శ్రీకాకుళం

బాల్యవివాహాలు నిరోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 31: బాల్య వివాహాలు నిరోధించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వెల్లడించారు. బాల్యవివాహాలు నిరోధానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సామాజిక ఆర్థిక వెనుకబాటు ఉన్నందువలన అక్కడక్కడా బాల్యవివాహాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకోసం అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరిగితే జిల్లా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కస్తూరిబా బాలికా విద్యాలయంలో ఇప్పటివరకు పదవ తరగతి వరకు మాత్రమే ఉందని, ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ తరగతులు కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కెజిబివిలలో అదనపు భవనాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కెజిబివిలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ కమీషనర్‌కు లేఖ తయారు చేయమని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి త్రినాథరావును కలెక్టర్ ఆదేశించారు. అధ్యాపక బృందం కొరత లేకుండా చూడాలన్నారు. ఈ విధంగా చూడటం వలన బాల్య వివాహాలు తగ్గుతాయన్నారు. కెజిబివిలో ఈ ఏడాది 1700మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, వారు ఈ విద్యా సంవత్సరం నుండే ఇంటర్మీడియట్ ఇందులోనే చదువుకొంటారన్నారు. పోలీస్, ఐసిడిఎస్, విద్యా, కార్మిక శాఖ కలిసి టాస్క్ఫోర్స్ కమిటీగా ఏర్పాటుచేసి కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే టాస్క్ఫోర్స్‌కు తెలియజేయాలన్నారు. చట్టప్రకారం కమిటీ చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో స్ర్తిలపై ఎక్కడైనా అత్యాచారాలు జరిగినా, వారిపై ఏ చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ విధమైన ఒత్తిడిలకు తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ బ్రహ్మారెడ్డిని కోరారు. మత, మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు వారిలో అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గతంలో బాల్యవివాహాలు జరిగేవని, ముఖ్యంగా గ్రామీణుల్లో అవగాహన పెంచాలన్నారు. స్ర్తి పట్ల హత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్, ఐ సిడిఎస్ పిడి లీలావతి, జిల్లాచైల్డ్ సంక్షేమ అధికారి కెవిరమణ, ఎం ఇవోలు , కెజిబివి ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహనను మరింత పెంచాలి
* జిల్లా జూనియర్ సివిల్ జడ్జి శ్యామలాదేవి
నరసన్నపేట, మార్చి 31: సమాజంలో న్యాయచట్టాలకు ఉన్న పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా కృషి చేయవల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ కార్యదర్శి, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిబ్ మెజిష్ట్రేట్ కార్యాలయంలో చట్టాలపై అవగాహన సదస్సులో భాగంగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానవంతులకే కాకుండా అతిసామాన్యులకు, నిరక్ష్యరాస్యులకు చట్టాలపై అవగాహన తీసుకువచ్చే విధంగా సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానం వద్ద నిరుపేదకు చెందిన నిందితులు కూడా తమకు లోకజ్ఞానం లేకపోవడంతో జైలు పాలవుతున్నారని, వారిని అన్ని విధాల ఆదుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉచితంగా న్యాయవాదులను నియమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్జి అన్నపూర్ణ, సిఐ పైడిపినాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, పోలాకి, నరసన్నపేట ఎస్‌ఐలు వినోద్‌బాబు, లక్ష్మణ్, న్యాయవాధులు జి.సత్యనారాయణ, ఐ.తాత, ఎస్.నాయుడు, లక్ష్మీ పాల్గొన్నారు.