శ్రీకాకుళం

సకాలంలో రైతులకు విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 16: జిల్లాలోని రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి ఆదేశించారు. మంగళవారం సా యంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖలతో ఖరీఫ్ పంటలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, మైక్రో ఇరిగేషన్ ప్రణాళికాబద్దంగా రైతులకు సకాలంలో విత్తనా లు అందజేయాలన్నారు. ఈ ఏడాది చివఃరి మాసానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తికాబడతాయన్నారు. తద్వారా చివరి ఎకరాకు సాగునీరు అం దుతుందన్నారు. ఈ ఏడాదిలో ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు విత్తనాలు తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని, రైతులకు అందించే ఇన్‌ఫుట్ సబ్సీడి, పనిముట్లు, ఫెర్టిలైజర్స్ తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళికతో అధిక దిగుబడులను సాధించాలన్నారు. నిధులకు లోటులేదని సాధ్యమైనంతవరకు వ్యవసాయాధికారులకు ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టంచేశారు. ఎన్ ఎఫ్ ఎస్ ఎం పథకం కింద 2.55లక్షల హెక్టార్లలో వరి 9,800 హెక్టార్లలో పత్తిపంట, 5,950 హెక్టార్లలో చెర కు పంట దిగుబడి లక్ష్యాలను సాధించాలన్నారు. 20వేల క్వింటాళ్ల అపరాలు పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగజేయరాదన్నారు. ధాన్యం, అపరాలు, వేరుశనగ, పత్తి విత్తనాల సరఫరాలో నకిలీకి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జింకు సల్ఫేట్ వాడకంపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. మే 31వతేదీలోగా రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేయాలన్నారు. ఫెర్టిలైజర్స్ పంపిణీలో తూకం సరిగా ఉండాలన్నారు. ఫారం మెకనైజేషన్‌లో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇచ్చే సబ్సిడిపై వివరాలు అందించాలన్నారు. నిధులకు కొతర లేదని, అధికారులంతా కృషి చేసి అధిక దిగుబడులను సాధించేందుకు కృషి చేయాలన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి లాభసాటి వ్యవసాయానికి అడుగులు వేయాలన్నారు. జిల్లాలోని వనరులను సక్రమంగా వినియోగించుకొని 13వ స్థానం నుండి ప్రథమస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు, వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జి.రామారావు, ఉపసంచాలకుడు సిహెచ్.అప్పలస్వామి, ఆత్మా పిడి ఇ.ప్ర మీల, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకుడు సత్యారావు పాల్గొన్నారు.

ఉద్యానవన పంటలు సాగు చేయాలి
* పిడి కిషోర్‌కుమార్
ఎచ్చెర్ల, మే 16: మహిళా సంఘాల సభ్యులను ఆర్థిక స్వావలంభన సాధించేందుకు వీలుగా వెలుగు సిబ్బంది ప్రతీ సి.సి పరిధిలో 25 ఎకరాలకు తక్కువ లేకుండా కన్వర్జెన్స్‌లో భాగంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని డి ఆర్ డి ఏ పిడి జి.సి కిషోర్‌కుమార్ ఆదేశించారు. స్థానిక టిటిడిసిలో మంగళవారం వెలుగు సిబ్బందికి లక్ష్యాలు అధిగమించే దిశగా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పిడి మాట్లాడుతూ పశుగ్రాసం పెంపకం కూడా ఐదెకరాలు విస్తీర్ణంలో చేయాలని సూచించారు. వీటికి రూ.20వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద రూ.3వేల వంతున అందని సంఘ సభ్యులు వివరాలు తెలుసుకుని వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనేక చోట్ల వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆసక్తి కనబర్చాలన్నారు. వర్మీ కంపోస్టు పిట్లు నిర్మించిన వారికి నిధులు మంజూరు చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ఉపాధి పథకంతో అనుసందానం చేసుకొని వీటి లక్ష్యాలు అధిగమించాలన్నారు. సి.సి పరిధిలో 75 వర్మీ కంపోస్టు పిట్లు కొత్తగా నిర్మించాలని పేర్కొన్నారు. లక్ష్యాలు అధిగమించకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసమీక్షలో డిపిఎంలు నారాయణరావు, ఏరియా కో-ఆర్డినేటర్ రవికుమార్, ఏపి ఎంలు, సిసిలు పాల్గొన్నారు.