శ్రీకాకుళం

డిగ్రీ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 16: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలోని చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఫలితాలను ఇన్‌ఛార్జి విసి ఎం.చంద్రయ్య మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలలో 46.41శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. బిఏ కోర్సుకు 1629మంది హాజరుకాగా 1070మంది పాసై 65.68శాతం ఉత్తీర్ణత నమోదైంది. బిఎస్సీకి 6001 హాజరుకాగా, 2399 మంది ఉత్తీర్ణులై 39.98 శాతం పాసయ్యారు. బికాం 2298మంది హాజరుకాగా, 1098మంది పాసై 4776శాతం ఉత్తీర్ణులయ్యారు. బి బి ఎం 102మంది హాజరై 88మంది ఉత్తీర్ణులయ్యారు. 86.27శాతం ఈ కోర్సు నుంచి పాసయ్యారు. ఒకశాతం గ్రేస్‌మార్కులు కల్పించడం వలన 500మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని విసి పేర్కొన్నారు.
ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైన వారికి ఈనెల 27వతేదీన ఇనిస్టెంట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000కు రెండు పేపర్లయితే రూ.1500 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 15 రోజుల్లో రీ-వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఒక్కో పేపర్‌కు రూ.500 రుసుము చెల్లించాలని తెలిపారు. ఫలితాలు విడుదల చేసిన వారిలో రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపాల్ పి.చిరంజీవులు, ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు, పాలక మండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, కె.విఏనాయుడు పి.జయరామ్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ బాబూరావు, జ్యోతిఫెడ్రిక్, పులఖంఢం శ్రీనివాసరావు పాల్గొన్నారు.