శ్రీకాకుళం

పిఆర్‌సి ఎరియర్స్‌ను విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 27: ఎన్జీవోలకు ఇవ్వాల్సిన పి ఆర్ సి ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఎన్జీవో సంఘ రాష్టస్రహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో మంగళవారం విడుదల చేసిన విలేఖర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎన్జీవో హోమ్ ఉందని ఇది ప్రభుత్వ ఆస్తి కాదని ఎన్జీవో సంఘ నేతల విరాళాలతో నిర్మాణం చేపట్టిందని తెలియజేశారు. హైదరాబాద్ కలెక్టర్ ఏ పి ఎన్జీవో భవనం పట్ల జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. తెలంగాణా ప్రభుత్వంజోక్యం లేకుండా చూడాలన్నారు. పి ఆర్ సి ఎరియర్స్‌తోపాటు రెండు డి ఏ లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పి ఆర్ సి కోసం కమిటీని వేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ వద్దకు గతంలో వెళ్లి కలిశామని డి ఏ ఎప్పుడైనా ఇవ్వకతప్పదని సకాలంలో ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. హెల్త్‌కార్డువిషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాయని దీనికి భరోసా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే వాటికి సరిచేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం జీవోను విడుదల చేశారని అయితే అందులో స్పష్టత లేదన్నారు. ఎవరికీ ఉపయోగపడని విధంగా ఉందని పేర్కొన్నారు. 151 జీవోకు సంబంధించి అమలు కావడం లేదని తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఉద్యోగులకు 20 శాతం హెచ్ ఆర్ ఏ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దానిని నెరవేర్చాలన్నారు. జిల్లా జె ఏ సి చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ మూడేళ్ల పాలన పూర్తయిందని కేబినేట్‌సమావేశాల్లో డి ఏ ఊసే ఎత్తడంలేదన్నారు. అన్ని జిల్లాలకు యూనిఫామ్‌గా 20శాతం డి ఏను ఇవ్వాలన్నారు. సి పి ఎస్ విధానంపై పునరాలోచన చేయాలని కోరారు. సి పి ఎస్ విధానం రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న అంశాన్ని అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ కలెక్టర్ నిర్ణయాన్ని వారు ఖండించారు. ఈ సమావేశంలో బమ్మిడి నరసింగరావు, జగన్మోహనరావు, చల్లా శ్రీనివాస్, రామ్మోహన్‌రావు, రాధాకృష్ణ, నరసింగరావు, పూర్ణచంద్రరావు, మధుసూధనరావు తదితరులు ఉన్నారు.

జిల్లా ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన రెడ్డిశాంతి
శ్రీకాకుళం(రూరల్), జూన్ 27 : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశం ఈ నెల 28న జిల్లాపార్టీ కార్యాలయం టౌన్‌హాల్‌లో నిర్వహించనున్నారు. ఏర్పాట్లను మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రాజకీయ వ్యవహారాలు కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్ తదితరులు పరిశీలించారు. జిల్లాలో 38 మండలాల నుండి ముఖ్యనాయకులు, మండల పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అభిమానులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. మండల, నియోజక వర్గ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయి. శ్రీకాకుళం నియోజక వర్గానికి సంబంధించి ప్లీనరీ సమావేశం క్రమశిక్షణతో జరిగింది. అదే తరహాలో జిల్లా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాలని నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశీలనలో అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్ తదితరులు ఉన్నారు.

అన్నదాన కార్యక్రమానికి రూ. లక్ష విరాళం
శ్రీకాకుళం(రూరల్), జూన్ 27 : ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం పరిధిలో నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాతల విరాళాలే ప్రధానం. జిల్లాలోని పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన నగరం పల్లి త్యాగరాజు శర్మ కుమారుడు ఆత్రేయశర్మ నిత్యాన్నదాన కార్యక్రమానికి మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేసారు. రూ. లక్ష ఆలయ ఈ ఓ శ్యామలాదేవి కి అందజేసారు.

వరహావతారంలో జగన్నాధుడు
సారవకోట, జూన్ 27: రధాయాత్ర సందర్భంగా గుడించా మందిరంలో కొలువైయున్న జగన్నాధస్వామి మూడవ రోజు వరహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భగవంతుని పది అవతారాలలో మూడవ అవతారమైన వరహావతారం భక్తులకు కనువిందు చేసింది. భూ మండలం బరువును మోయడానికి భగవంతుడు ఈ అవతారాన్ని ఎత్తినట్లుగా పురాణగాదలు స్పష్టంచేస్తున్నాయి. మండలంలోని బుడితి, చీడిపుడి, అవలింగి పరిసర గ్రామాల ప్రజలు అవలంగి గుడించా మందిరానికి తరలివచ్చి వరహావతారంలో ఉన్న జగన్నాధస్వామిని ప్రత్యేకంగా పూజలు చేశారు.