శ్రీకాకుళం

మొబైల్ లోక్ అదాలత్‌పై అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ(టౌన్), ఏప్రిల్ 28: చట్టబద్దంగా తక్కువ కాలంలో కేసులు పరిష్కారం మొబైల్ లోక్‌అదాలత్ ద్వారా సాధ్యమని జిల్లా లోక్‌అదాలత్ చైర్మన్ వి.బి నిర్మలగీతాంబ పేర్కొన్నారు. గురువారం ఆమె ఆర్డీవో కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. కొన్నిసార్లు న్యాయకోసం పోరాటం చేసే వారికి దశాబ్దాలు తరబడి సమయం వృధా అవుతుందన్నారు. తద్వారా న్యాయం జరిగినప్పటికీ బాధితుడు కుటుంబీకులు న్యాయఫలాన్ని పొందుతున్నారన్నారు. ఇటువంటి సమస్యలు అధిగమించేందుకు న్యాయస్థానం నూతన విదానాలను చట్టాలు ద్వారా అనుసరిస్తుందన్నారు. దీనిపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకుంటే కోర్టులు చుట్టూ తిరగాల్సిన సమస్యలు ఉండవన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం విరివిగా న్యాయవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం వంశధార నిర్వాసితుల పరిహారం పంపిణీపై ప్రభుత్వం ఒప్పందం మేరకు చెల్లింపుల్లో అలస్యం చేస్తే నిర్వాసితులు పాలకొండ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఆమెతోపాటు జెసి వివేక్‌యాదవ్, స్థానిక న్యాయమూర్తి చీకటి వివేకానందశ్రీనివాస్, ఆర్డీవో రెడ్డి గున్నయ్యలు పాల్గొన్నారు.