శ్రీకాకుళం

ఆదిత్యుని తలనీలాలకు వేలం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 29: కోరిన కోర్కెలు తీర్చే శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలకు 2016-17 ఏడాదికి రూ. 68.10 లక్షలకు వేలం పాట ఖరారైంది. శుక్రవారం ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శ్యామలాదేవి పర్యవేక్షణలో కొబ్బరి చెక్కలు, తలనీలాల వేలం నిర్వహించారు. అయితే కొబ్బరి చెక్కల పాటకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు గుత్తేదారులు పాల్గొన్నప్పటికీ గతంలో పాట మొత్తానికి తక్కువగా ఉన్నందున ఆ పాటను రద్దుచేసారు. గత నెలలో నిర్వహించిన ఈ వేలం పాటకు 11.35 లక్షల రూపాయలకు గుత్తేదారులు పాటపాడగా, శుక్రవారం నాటి పాటలో 9.50 లక్షల రూపాయలకు పాడారు. దీంతో గతం కంటే తక్కువ మొత్తానికి ఇచ్చేది లేదని ఈవో పాటను రద్దుచేసారు. కాగా సాయంత్రం తలనీలాలకు నిర్వహించిన పాటలో ఏడుగురు గుత్తేదారులు పాల్గొన్నారు. ఆలయఅధికారులు 75 లక్షల రూపాయల నుండి రాగా గుత్తేదారులు 60 లక్షల రూపాయల నుండి పాటను పెంచారు. అయితే ఆఖరిగా ఏలూరుకు చెందిన సిహెచ్‌ఎస్‌ఎన్ రాజు 68 లక్షల పదివేల రూపాయలకు పాడగా అధికారులు అతనికి పాటను ఖరారు చేసారు. కార్యక్రమంలో ఆలయ పూర్వపు కార్యనిర్వహణాధికారి ప్రసాద్ పట్నాయక్, సిబ్బంది రమణమూర్తి, మృత్యంజయరావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.