శ్రీకాకుళం

బంగారు పథకాలకు విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 19: జిల్లాలో ఉన్న అంబేద్కర్ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఇంఛార్జ్ వీసి జి.నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈనెల 23న శ్రీకాకుళం నగరంలో ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో స్నాతకోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 8విభాగాలకు చెందిన టాపర్లకు బంగారు పథకాలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు విరాళాలు స్వచ్ఛదంగా అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. విశాఖపట్నం కళా ఆసుపత్రి వ్యవస్థాపకులు జిల్లాకు చెందిన డాక్టర్ పి.వి రమణమూర్తి బంగారు పథకాల కోసం రూ.3లక్షల విరాళాన్ని వీసి నాగేశ్వరరావుకు మంగళవారం అందజేశారు. అలాగే వర్శిటీ అకడమిక్ సెనేట్ సభ్యుడు డాక్టర్ కుమారరాజా తన కుమారుడు సాయితేజ పేరుపై బంగారు పథకాలు అందించి విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని రూ.3లక్షల చెక్కును ఇంఛార్జ్ వీసికి అందజేశారు. ఈ సందర్భంగా వీసి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేలా విరాళాలు బంగారు పథకాలు అందించేందుకు దాతలు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతీ విభాగంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పథకాలు అందజేసేందుకు కూడా దాతలు ముందుకు రావాలని వీసి కోరారు. డాక్టర్ పి.వి రమణమూర్తి, కుమారరాజాలను ప్రత్యేకంగా అభినందించారు.

నిర్బంధాలతో పోరాటాలు ఆగవు
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలపై నిర్భందాలను ప్రయోగిస్తే సహించేది లేదని సిటు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు, కెవి పి ఎస్ జిల్లా కార్యదర్శి గణేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐటీమంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం సిటు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, డి.గణేష్‌లను ముందుగా ఇంటి వద్ద అక్రమంగా అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానంవలన కాన్‌కాస్ట్ పరిశ్రమ మూత పడటంతో 650 కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ విధానాల వలన చక్కెర, జ్యూట్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని దీనిలో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో కాన్‌కాస్ట్ యాజమాన్యం కార్మిక చట్టాలు తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై ప్రభుత్వ యంత్రంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మిక శాఖ యాజమాన్యాల శాఖగా మారిపోయిందని విమర్శించారు. 2017 మార్చి నుండి వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విదేశాల నుండి కొత్త పరిశ్రమలు వస్తాయని అబద్దపు ప్రచారం చేస్తూ భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మూసివేసిన పరిశ్రమలు ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు. బకాయి పడ్డవేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాన్‌కాస్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ నాయకులు మాట్లాడుతూ కాన్‌కాస్ట్ పరిశ్రమను తెరిపించాలని కోరారు.

వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం నిరంకశసత్వ పోకడలు మానాలని వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వంశదార నిర్వాసితులకు పునరావాసం పూర్తి కాలేదని అర్హులైన వారికి ఇంకా అనేకమందికి పరిహారం అందలేదని పేర్కొన్నారు. నేటికీ జెసి నిర్వహించే వంశధార నిర్వాసితుల ప్రత్యేక ప్రజావాణికి వందల సంఖ్యలో పాడలి, తులగాం, దుగ్గిపురం, కొల్లివలస తదితర గ్రామాల నుండి పరిహారం కోసం వస్తున్నారన్నారు. ఈ స్థితి అక్కడ సమస్యలు పరిష్కారం కాలేదని తెలుస్తోందని స్పష్టంచేశారు. అయితే వీటిని పరిష్కరించకుండా యంత్రాలతో పనులు చేపట్టి పంట పొలాలను గట్లను ద్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వం అడ్డొచ్చిన నిర్వాసితులను అరెస్ట్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలను జలసమాధి చేయడానికి సిద్ధమైందని తెలియజేశారు. దీన్ని ప్రశ్నించడానికి ఈనెల 18న వెళ్లిన సి పి ఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమే కాకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు చూస్తుందని స్పష్టంచేశారు. 9 నెలల క్రితం జరిగిన ఘటనలో సి పి ఎం కార్యకర్తలు లేనప్పటికీ వారిని ముద్దాయిలుగా అంగీకరించమని రిమాండ్ కోర్టుపై ఆ సెక్షన్‌లో నమోదు చేసి సంతకాలు పెట్టమని పోలీసుల పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఒత్తిడి తేవడం పూర్తిగా అనైతికమన్నారు. ఈ చర్యలను అఖిలపక్ష సమావేశం తరఫున ఖండిస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి లోకేష్ పర్యటన దృష్ట్యా కొందరు సి పి ఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అరెస్‌ట చేసిన వారికి విడుదల చేయాలని, నిర్భందకాండ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ఆ ప్రజల న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో సి పి ఎం సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వెంకటరమణ, మావన హక్కుల వేదిక సంఘం నాయకులు కె.వి జగన్నాధరావు, సి పి ఎం ( ఎం ఎల్ న్యూడెమోక్రసీ) నాయకులు తాండ్రప్రకాశ్ , అరుణ, రత్నాల నర్శింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.