శ్రీకాకుళం

రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్న టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో అవినీతి రోజురోజుకూ అంచెలంచెలుగా పెరిగిపోతూ వస్తుందని 1.80లక్షలకోట్లు అప్పులు చేసి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నేతాజీ వీధిలో జరిగిన వై ఎస్ ఆర్ కుటుంబంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.28వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్‌లో ఉందని ఆ విషయం తెలుసుకోలేని ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఇటీవల జిల్లాలో పర్యటించినప్పుడు అభివృద్ధి చేయిస్తామన్న ప్రకటించిన వైనం విడ్డూరంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. టెట్టంగి గ్రామంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్థానిక టిడిపి నాయకులు 8 ఇళ్లను ఎంపిక చేశారని అక్కడకు వెళ్లిన చంద్రబాబునాయుడుకు స్పష్టంగా వ్యతిరేకత చూపించారని ఆ కథనాలు తనకు అనుకూలమైన పత్రికలోనే ప్రచురణ అయిన సంగతి తెలుగుదేశం నాయకులు గుర్తెరగాలని వ్యాఖ్యానించారు. జిల్లాలో రాష్ట్రంలో ఇసుక వనరులను ప్రజలకు అందించేందుకు గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజలకు అందించేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారని నేటికీ ఒక స్వ్కేర్‌ను ప్రకటించలేకపోవడం వారి అనైఖ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మండలంలో నరసన్నపేటలో మడపాం వద్ద ఇసుక ర్యాంపును ఆ పార్టీ నాయకులకే అప్పగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇదేమీ తెలియని ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ జిల్లాలో లేనిపోని హామీలను ఇంటింటికీ కొళాయిలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హాస్యాస్పధంగా ఉందని నాయకుల పర్యటనలకు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

బొంతలకోడూరు రోడ్డు నిర్మించండి
* మంత్రి లోకేష్‌కు వినతి
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 19: చేనేత కార్మికుల గ్రామమైన బొంతలకోడూరుకు పక్కారోడ్డు నిర్మించాలని రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌కు స్థానికులు మంగళవారం జెడ్పి సమావేశ మందిర ఆవరణలో వినతిపత్రం సమర్పించారు. రోడ్డు పూర్తిగా రూపాంతరం చెందడం వలన గ్రామం నుంచి జిల్లా మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రికి వివరించారు. పొన్నాడ నుంచి బొంతలకోడూరు వరకు రోడ్డును నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తానని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో మాజీ సర్పంచ్ మాడుగుల వీరభద్రస్వామి, ఎంపిటీసీ సభ్యులు సత్యానందం, నీటి సంఘం ఉపాధ్యక్షులు లావేటి అన్నారావు తదితరులు ఉన్నారు.