శ్రీకాకుళం

సమన్వయం.. సమగ్రాభివృద్ధే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: సర్వసభ్య సమావేశాలు, డి.డి.ఆర్.సి.లు, జిల్లా సమీక్షలు అంటే - అధికార యంత్రాంగం హాడలెత్తిపోవడం ఇక్కడ పరిపాటి. సీనియర్ ఎమ్మెల్యే శివాజీ, విప్ రవికుమార్ మాటకారులుగా అధికారులను సమీక్షల్లో టార్గెట్ చేసి చర్చను పక్కతోవపట్టించి, సాగదీయడం ఒక ఆనవాయితీ. ఈ సంస్కృతికి చెక్‌పెట్టేలా సమన్వయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఐ.టీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా అధికారులతో సమీక్ష సాగడం వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజులుగా సమీక్ష హాట్‌హాట్‌గా ఉంటుందని అధికారులు భావించినప్పటికీ, అందుకు భిన్నంగా వారినే వెనకేసుకుని ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు బ్రేక్‌లు వేస్తూ సమీక్ష సమయస్ఫూర్తిగా నడిపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించే సమీక్షలతో పోలిస్తే ప్రభుత్వ అధికారుల పట్ల లోకేష్ చూపిన ఆదరణ, సానుకూలత ఉన్నతాధికారుల్లో మరింతగా లక్ష్యాలను చేరుకునేందుకు టానిక్‌గా మారింది. గ్రామ పంచాయతీలు స్వయం శక్తితో ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రి మంగళవారం ఇక్కడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. 2019 సంవత్సరం నాటికి ప్రతీ గ్రామ పంచాయతీలో సేంద్రియ ఎరువులు ఉత్పాదన ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం సంపాదించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్టు మేనేజిమెంటు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటికి రెండు బుట్టలు పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. చెత్తను సేకరించి సేంద్రియ విధానం ప్రారంభించడం ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు. గ్రామాల్లో గ్రీన్ అంబాజిడర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వారికి ఫోన్ అందజేస్తామని చెప్పారు. ఇంటికి వెళ్ళి చెత్త తీసుకువెళ్ళాలని, చెత్త తీసుకొనుటకు రాకపోతే ఫోన్ చేయవచ్చని చెప్పారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ప్రజాప్రతినిధులు దీనిని ముందుకు తీసుకువెళ్ళాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను అన్ని గ్రామాలకు విస్తరించి శాట్యూరేషన్ మేడ్‌లో చేపట్టాలన్నారు. ప్రాక్టికల్ అప్రోచ్‌తో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనులను సమన్వయంతో చేపట్టాలన్నారు. కొంత మంది క్షేత్ర సహాయకులు సరిగా పనిచేయడం లేదని అటువంటివారిని ఉపేక్షించరాదని ఆదేశించారు. కొంత మంది క్షేత్ర సహాయకులు సరిగా పనిచేయడం లేదని అటువంటి వారిని ఉపేక్షించరాదని స్పష్టం చేసారు. మరుగుదొడ్లకు చెల్లింపు చేయాల్సిన రూ. 8.73 కోట్ల బిల్లులపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేపట్టడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం - ఓక ప్రభుత్వం అని, అన్ని పనులు సమన్వయంతో జరగాలని, ముఖ్య మంత్రి స్పిరిట్‌ను అవగాహన చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఉద్దేశించి అన్నారు. ఉపాధి హామీలో భామిని, సీతంపేట, కంచిలి, హిరమండలం, మందస మండలాలు తక్కువ ప్రగతిలో ఉండటం పట్ల ప్రశ్నించారు. ఎం.పి.డి.వోలు పనులను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. జీడిపంట పనుల్లో ఉండటం వల్ల ప్రగతి కొంతమేర లోపించిందని ఇకపై వేగవంతం చేస్తామని సీతంపేట ఎం.పి.డి.వో. యు.రాధాకృష్ణ తెలియజేయగా, వేతనదారులను మోటివేట్ చేసి వారికి అందాల్సిన వేతనాలు గరిష్టంగా ఉండే విధంగా చేయాలన్నారు. పలాస నియోజకవర్గంలో గరిష్టంగా వేతనం రూ. 147 ఉండటం, రాజాం నియోజకవర్గంలో రూ. 97 ఉండటం సరికాదన్నారు. వేతనదారుల ఏవిధంగాను నష్టపోరాదని మంత్రి అన్నారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం కొంత లోపంగా కనిపిస్తుందని వాటిని సరవరించుకోవాలని మంత్రి సూచించారు. వేతనాల చెల్లింపులో పెండింగు ఉంటే వెంటనే తెలియజేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్‌ను ఆదేశించారు. ఉపాధిహామీ పనుల సామాజిక ఆడిట్, నాణ్యతా ప్రమాణాల పరిశీలన నిర్దేశిత కాలంలో పూర్తి కావాలని, లేనిపక్షంలో అది పూర్తి అయినట్లుగానే (డీమ్డ్ టుబి అప్రూవ్‌డ్) బావించాలని అన్నారు. చెల్లింపు విషయంలో ప్రతి రోజు సమన్వయం చేస్తున్నామని మంత్రి అన్నారు. డాక్యుమెంటేషన్ సక్రమంగా ఉండాలని అన్నారు. పంచాయతీల ప్రగతిని గూర్చి మాట్లాడుతూ పంచాయతీ జనాభా ప్రకారం ఒక వ్యక్తికి రూ. 660 చొప్పున్న నిధులు వస్తాయని వాటిని సక్రమంగా వినియోగించాలని అన్నారు. పంచాయతీలలో తాగునీటి పథకాలు వంటి వాటిని కూడా సక్రమంగా నిర్వహించని పంచాయతీలు అనేకం ఉన్నాయని చెప్పారు. పంచాయతీ అభివృద్ధిపై దృష్టిసారించాలని హితవు పలికారు. నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చుచేయడం సరికాదని అవసరమైతే ఆడిట్ నిర్వహిస్తామన్నారు. పంచాయితీ నిధులు ఆన్‌లైన్‌లో పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. సిమ్మెంట్హ్రదారులువేసిన వెంటనే ఇరుపక్కలా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలన్నారు. ఉద్దానం తాగునీటి పథకానికి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు పేరును పెట్టేందుకు జిల్లా సర్వసభ్యసమావేశంలో తీర్మాణించడం జరిగిందని దానిపై తదుపరి ఉత్తర్వులుజారీ చేయాలని ఎమ్మెల్యే శివాజీ కోరగా దానిపై స్పందిస్తూ దస్త్రం పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. జెడ్పి ఆదాయ వనరులు అభివృద్ధి చేసేందుకు జెడ్పి భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లునిర్మించాలని సూచించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను సముద్ర తీర గ్రామాల్లో చేపట్టేందుకు సమస్యగా ఉందన్నారు. పనులు ఒక గ్రామంలో లేనప్పుడు ఇతర గ్రామాల్లో చేపట్టవచ్చునని తెలిపారు. ఎంపి కింజరాపురామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ వినూత్న పనులు సముద్రతీర ప్రాంత గ్రామాల్లో చేపట్టుటకు గుర్తించేంతసాంకేతిక పరిజ్ఞానం క్షేత్రసహాయకులకు లేదన్నారు. ఎమ్మెల్యే గౌతు శివాజీ మంత్రి ఉపాధి హామీ కింద గునపాలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయడంలేదన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ సముద్రతీరప్రాంత గ్రామాల్లో చెరువులపనులు చేపట్టడం వలన పనులు కల్పించవచ్చునని సూచించారు. సామాజిక ఆడిట్‌లో తప్పులు కనిపించినప్పటికీ చర్యలు ఉండటం లేదని వివరించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ గతంలో జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టిన ఇంకుడుగుంతల బిల్లులు చెల్లింపులు జరగడంలేదన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిమాట్లాడుతూ 40శాతం కింద చేపట్టిన మెటీరియల్ కాంపోనెంట్ పనులు బిల్లులు చెల్లింపు జరగలేదని వాటిని పరిష్కరించాలని కోరారు. పనులను రికార్డులు చేశారని, చెల్లింపులో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ కమీషనర్ బి.రామాంజనేయులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో జరిగే ఉపాధి హామీ పనుల ఖర్చులను ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్లు చెప్పారు. పెండింగ్ బిల్లుల వివరాలు జిల్లా కలెక్టర్ ద్వారా సమర్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా 2018 అక్టోబర్ 2 నాటికి ప్రకటించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటికి రూ.11కోట్లు మంజూరుచేశామన్నారు. డుమా పీడి కూర్మారావు మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో వినూత్నమైన పనులు చేపట్టేందుకు డిజైన్ చేస్తున్నామన్నారు. జిల్లా దశవసంతాల ప్రగతి, ఉపాధి హామీ పనులు మార్గదర్శిని అనే పుస్తకాలను ఉపాధి హామీలో శ్రీకాకుళం, నవ్యాంధ్రపచ్చతోరణాలు సీడిలను జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ రూపొందించిన రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యుల కరదీపికను మంత్రి ఆవిష్కరించారు. తొలుత డి ఆర్ డి ఏ కార్యాలయ ఆవరణలో రూ.2కోట్లతో నిర్మించే జిల్లా నీటియాజమాన్య సంస్థ భవనం- ఎన్టీ ఆర్ జలభవన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. మొబైల్ మొక్కలు పంపిణీ వాహనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెసి చక్రధరబాబు, ఐటి డి ఏ పివో ఎల్.శివశంకర్, జిల్లా అధికారులు, జెడ్పిటీసీ సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు.