శ్రీకాకుళం

నాలా చెల్లించకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 21: వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నాలా రుసుము చెల్లించాలని అలా చెల్లించకుంటే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు ఆదేశించారు. మండలంలోని కొంగరాం గ్రామంలో రైతు సేవలో రెవెన్యూ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ నెలాఖరు లోగా నాలా చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ యజమానులకు నోటీసులు జారీ చేసి వారు స్పందించకుంటే జెసిబిలతో రోడ్లను తొలగించి వ్యాపారాలను అడ్డుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు నాలా చెల్లించని రియల్ ఎస్టేట్ సంస్థల బకాయిలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులనుద్దేశించి భూములు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులంతా సదస్సులకు హాజరై వారివారి సమస్యలను నివేదిస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. గతంలో మాదిరీగా కాకుండా ఈ పాస్ పుస్తకం వెంటనే రైతులకు అందించడం జరుగుతుందన్నారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఆ వివరాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేస్తే పాస్ పుస్తకం పొందవచ్చునన్నారు. అడంగల్, 1బి సవరణ సర్వే వంటి అంశాలు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు గొప్ప వేదికలుగా ఉపయోగపడతాయని రైతులంతా అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు పరిరక్షించుకుంటే భవిష్యత్‌లో సామాజిక అవసరాలకు దోహదపడతాయని స్థానికులు ఆ దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిమిడి రామ్మోహనరావు, సర్పంచ్ నక్క లక్ష్మణరావు, ఆర్ ఐ కె.వైకుంఠరావు, గ్రామ రెవెన్యూ అధికారులు జి.పురుషోత్తం, చంద్రరావు, ధనుంజయరావు, టిడిపి నాయకులు గోపిన కుమారబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా 69మంది భూ సమస్యలపై అర్జీలు అందించారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని జెసి ఆదేశించారు.

తరగతుల నిర్వహణకు సన్నహాలు
* ట్రిపుల్ ఐటీ కమిటీ పరిశీలన
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 21: జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు స్థానికంగా తరగతులు నిర్వహించేలా అధికారులు సన్నహాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ ఎం పురం సమీపంలో ఉన్న 21వ గురుకుల భవనాల నిర్మాణాల్లో మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ బాలికలకు తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఎచ్చెర్ల సమీపంలో ఉన్న మిత్రా ఇంజినీరింగ్ కళాశాలను కూడా ప్రభుత్వం లీజుకు తీసుకుని బాలురకు పాఠాలు బోధించేలా వసతి, వౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ ఏర్పాట్లను గురువారం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎస్.హరశ్రీరాములు, అంబేద్కర్ వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావు, తహశీల్దార్ కిమిడి రామ్మోహన్‌రావుల కమిటీ పరిశీలన జరిపింది. దసరా సెలవుల అనంతరం నూజివీడు క్యాంపస్‌లో అడ్మిషన్ తీసుకున్న 2వేల మంది విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సమీక్షించారు. దాదాపు మిత్ర కళాశాలలో వౌలిక వసతులు అంచనా మేరకు కల్పన పూర్తయినట్లు కమిటీ సభ్యులు నిర్దారణకు వచ్చారు. ఇక్కడ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. కమిటీ సభ్యుల్లో ఆర్ అండ్ బి డి ఇ రమణమూర్తి, పాలిటెక్నిక్ హెచ్ వో డి మురళీకృష్ణ, ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ తదితరులు ఉన్నారు.