శ్రీకాకుళం

రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్ వాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 16: ప్రపంచ దేశాలకు రొయ్యిలను ఉత్పత్తి చేయడంలో సింహభాగం మన రాష్ట్రానిదేనని ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఉందని మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్ పేర్కొన్నారు. ఇంతటి విదేశీమారక విలువ ఉన్న రొయ్యల పరిశ్రమ ఈ మధ్య కాలంలో యాంటీబయోటిక్స్ అవశేషాలవలన సంక్షోభంలో పడిందన్నారు. దీనిపై ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. సోమవారం స్థానిక ఓ హోటల్‌లో ఆక్వాసాగులో నిషేదిత యాంటీబయోటిక్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని మత్స్యశాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మనదేశం నుండి రూ.17వేల కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుండగా అందులో 70శాతం వరకు మన రాష్టవ్రాటాగా ఉందని చెప్పారు. అయితే మన దేశం నుండి ఎగుమతి చేయబడుతున్న రొయ్యలలో యాంటీబయోటిక్స్ ఉండటం వలన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఎగుమతి దేశాలకు వెళ్లే రొయ్యల కంటైనర్లను వెనక్కి పంపించవేయబడ్డారన్నారు. విదేశాలకు రొయ్యల ఎగుమతి కాకపోతే ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్తుందని దీని ద్వారా వేలాది కుటుంబాలు నష్టపోతారని చెప్పారు. జిల్లాలో 1600 హెక్టార్లలో రొయ్యల సాగు జరుగుతోందని 193 కిలోమీటర్లమేర సముద్రతీరం కలిగిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అని పేర్కొన్నారు. సముద్ర తీరం నుండి 2కిలోమీటర్ల పరిధి వరకు ఆక్వా సాగుకు అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. అదే విధంగా ఏదైన రసాయనాలను ఆక్వా సాగులో ఉపయోగించకుండా ముందు దానిలో యాంటీబయోటిక్స్ లేనట్లుగా నిర్దారించుకోవాలని చెప్పారు. రసాయనాలను వాడేటప్పుటువాటిలోని రసాయనాల వివరాలు, తయారు తేదీ, గడువు తేదీ, ముద్రించి ఉన్నదీ గమనించాలని కోరారు. వాటిని చెరువులో ఉపయోగించే ముందు సాంకేతిక నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని, సి ఏ ఏ, సిఫార్సు చేసిన రసాయనాలను మాత్రమే సూచించారు. ఆక్వా సాగులో కొత్తగా ఉన్నటువంటి సాంకేతిక విషయాలపై అవగాహన పెంపొందించుకొని యాంటీబయోటిక్స్‌కు బదులుగా క్రో బయోటిక్స్‌ను వాడాలని తెలిపారు. సాగులో శాస్ర్తియ, సాంకేతిక సలహాల కోసం మత్స్యశాఖ అధికారులనుసంప్రదించాలని సూచించారు. అదే విధంగా రొయ్యల సాగును సుస్థిరపరుచుకునేందుకు పంట పంటకు మధ్య విరామం ఇచ్చి చెరువులను పూర్తిగా ఎండబెట్టాలని నీటిని మూడు దశలలో వడకట్టిబ్లీచింగ్‌తో శుద్ది చేయాలన్నారు. చెరువు చుట్టూ కట్టుదిట్టమైన బయోసెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరిమితికి మించి విత్తనాలను వాడరాదని సూచించారు. హ్యచరీ షీడ్‌ను నాణ్యత పరీక్షలు , పి సి ఆర్ పరీక్షలు చేయించి వ్యాధి రహిత నాణ్యమైన షీడ్‌ను కొనుగోలు చేసి చెరువు నీటికి అలవాటు చేసి వదలాల్సి ఉంటుందన్నారు. ప్రతీ వారం లేబరేటరీలలో నీటి పరీక్షలు, బ్యాక్టీరియా పరీక్షలు చేయించి తగిన మెళకువలు పాటించాల్సి ఉంటుందన్నారు. వీటన్నింటినీ పాటిస్తే ఆక్వా రంగం మరింత పురోగతి సాధిస్తుందని వివరించారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అభ్యుదయ రైతులు తగిన సలహాలు, సూచనలు ఇస్తేవాటిని పరిగణనలోనికి తీసుకుంటామని కమీషనర్ పేర్కొన్నారు. మత్స్యశాఖ జెడి కృష్ణమూర్తి, ఏడి నిర్మలాకుమారి, విశ్రాంత ఏడి, కన్సల్టెంట్‌రామ్మోహన్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవ్రేత్త బాలకృష్ణ, షీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ అధికారి డాక్టర్ డేవిడ్, జిల్లా మత్స్యకార సహకార సంస్థ అధ్యక్షులు నరసింగరావు, ఆక్వా రంగానికి చెందిన అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.