శ్రీకాకుళం

సివిల్ పోలీసులకు నెలకు రెండు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 17: సివిల్ పోలీసులకు నెలకు రెండు సెలవులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఎస్పీ త్రివిక్రమవర్మ అన్నారు. రెండు వారాలకొకరోజు సెలవు సిబ్బంది తీసుకునేలా ప్రణాళిక అమలు చేశామని, సక్రమంగా నిర్వహణలో వారాంతపు సెలవుగా మార్చడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏ ఆర్ సిబ్బందికి వారానికి ఒకరోజు సెలవు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో పోలీసు అధికారుల సంఘ సర్వసభ్య సమావేశం కె.అప్పన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ పాడైపోయిన క్వార్టర్స్‌ను హౌసింగ్ బోర్డు ఇంజినీరు గుర్తిస్తే వాటిని మరామ్మతులు చేయడమా.. పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంటే హెచ్ ఆర్ ఏ మంజూరు చేయడమా అనే అంశంపై ఆలోచిస్తామన్నారు. వీధిలైట్లు, వాటర్‌సమస్యల పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ షరీనాభేగమ్, డీఎస్పీలు భీమారావు, కృష్ణమూర్తినాయుడు తదితరులు ఉన్నారు.

బాబు పాలనలోనే ఆంధ్ర అగ్రగామి
మందస, అక్టోబర్ 17: సిఎం చంద్రబాబునాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి అగ్రగామిగా నిలిచే విధంగా అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని జిల్లుండలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, అదనపు పాఠశాల భవనాన్ని, బైరిసారంగపురంలో 6 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. మందస మండల పరిషత్ ప్రాంగణంలో మందస పట్టణవాసులతో విస్తరణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉన్నప్పటికి అభివృద్ధి, సంక్షేమానికి నిలువుట్టదంగా నిలిచామన్నారు. గ్రామాల్లో చంద్రన్న బాట, చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక, సంక్షేమ పథకాలతో రాష్ట్భ్రావృద్ధికి పెద్దపీట వేసారన్నారు. 4 కోట్ల రూపాయలతో మందస పట్టణానికి రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మందస హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపుల 80 అడుగులు తొలగించడం జరుగుతుందని, కొత్తవీధిలో 55 అడుగుల రోడ్డుకు ఇరువైపుల తొలగించడం జరుగుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు నుంచి మందసలోని 10 అంగన్‌వాడీ కేంద్రాలకు వంట పాత్రలతోపాటు ఇతర సామాగ్రిని అందజేసారు. ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను జీతాలు నుంచి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలకు ముడుపులు ఎంత చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఉద్యోగభద్రత కల్పించిందని, కమ్యూనిస్టులు కలెక్షన్‌కింగ్‌లు అని అన్నారు. అభివృద్ధికి రాజకీయరాబంధులా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ మందస పట్టణానికి బస్సుషెల్టర్, సులభ్‌కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణలో నిర్వాసితులైన పేదలందరికి ప్రభుత్వ స్థలం, ఎన్‌టి ఆర్ గృహాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ విషయమై మంత్రి ఆర్డీవో వెంకటేశ్వరరావుకు తక్షణమే ప్రభుత్వ స్థలంతోపాటు అర్హులైన నిర్వాసితులకు ఎన్‌టిఆర్ ఇళ్లు జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు. మందస రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి విశాఖ, భువనేశ్వర్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, డి ఎంయులు, రాజారాణి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌లు కల్పించాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అన్నాజీరావు, వాసు, సూర్యనారాయణలు ఎంపికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కె.రామ్మోహన్‌నాయుడు, జడ్‌పిటిసి సవర కుమారి, ఎంపిపి జయలక్ష్మి, జికె నాయకుడు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ విఠల్, జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీషా, తాతారావు, లింగరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ తిరుపతి, వాసు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రామినాయుడు, డిఇ రామచంద్రరావు, ఎఇలు, ఎంపిడివో చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.