శ్రీకాకుళం

టిడిపి నేతల ‘గూడు’పుఠాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మండుటెండ..102 డిగ్రీల జ్వరంతో వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు బీదల ఇళ్ళ కోసం తలపెట్టిన ఉద్యమానికి నగరంలో పాదయాత్ర చేసారు. రూ. కోట్లాది రూపాయలు బుక్కేసి తెలుగుదేశం పార్టీ బోకర్లను అరెస్టు చేయాలన్న డిమాండ్‌ను దిక్కులు దద్దరిల్లేలా ప్రజాసైన్యంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరుమాసాలే సమయం..ప్రజలపక్షాన ఉద్యమానికి సిద్ధం కండి!! అంటూ తప్పులు చేసే పసుపుదండును వెనకేసుకోచ్చే స్థానిక ఎమ్మెల్యేకు ధర్మాన సవాల్ విసిరారు. 192 హుదూద్ ఇళ్ళు అమ్మేసి, రూ. కోట్ల రూపాయలు బుక్కేస్తే చూస్తూ ఊరుకోమంటూ అల్టిమేటం ఇచ్చారు. అర్హులైనవారికి ఆ గృహాలు ఇవ్వాల్సిందేనని, దేశం బోకర్లు కొందరు వసూళ్లు చేసిన డబ్బు పేదోళ్ళకు ఇవ్వకపోతే రణమే అంటూ నగరమంతా ‘్ధర్మ(న)పోరాటం’ శంఖారావాన్ని పూరించారు. నగరంలో హుదూద్ ఇళ్లనిర్మాణం పూర్తయి ఏడాదికి పైగా కావస్తున్నా లబ్ధిదారుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని వెంటనే ఈ జాబితాను ప్రకటించాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని కోరుతూ మంగళవారం ఇక్కడ వైకాపా జిల్లా కార్యాలయం నుంచి హుదూద్ గృహాల సముదాయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ జి.టి రోడ్ గుండా ఏడురోడ్ల మీదుగా కళింగరోడ్డు మీదుగా పాతబస్టాండ్, కంపోస్టు కాలనీలో ఉన్న హుదూద్ ఇళ్ల నిర్మాణాల వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ధర్మాన మాట్లాడుతూ బీదల కోసం నిర్మించిన ఇళ్లు బ్రోకర్ల పాలౌతున్నాయని పేర్కొన్నారు. పట్టణ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి ప్రజలు, ప్రతిపక్షాలు హాజరయ్యాయంటే - అవినీతి ఎంత స్థాయిలో ఉందో అర్థమవతుందన్నారు. ప్రతిపక్షమంటే పరిపాలనాలోపాలను ఎత్తిచూపడమేనన్నారు. దానికి జవాబు చెప్పకుండా అధికారంలో గల పాలకులు తిరిగి ఆరోపణలు చేయడం వలన ప్రయోజనం లేదన్నారు. హుదూద్ ఇళ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కట్టించిన ఇళ్లు టిడిపి కార్యకర్తలకే కేటాయించడం వల్ల అర్హులైన పేదోళ్ళు ఇంటి కల నెరవేరలేదన్నారు. రూ. కోట్లు అక్రమంగా హుదూద్ గృహాలు కోసం వసూలు చేసిన వారిచేతే ప్రజలు కక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి ప్రతిపక్షంగా వైకాపా అండదండలు ఉంటూ ప్రజాఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందన్నారు. రాజకీయ పార్టీల మధ్య జరిగే పోరాటం ఇది కాదని, పేదోడికి, పాలకులకు మధ్య జరిగే కురుక్షేత్రమన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవల్సిన అవసరం ఉందన్నారు. భారీ మొత్తంలో కలెక్షన్ చేసినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ఎమ్మెల్యేకు కూడా ఇందులో వాటా ఉందని అనుకుంటారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు వాటా లేదనుకుంటే కలెక్షన్ చేసిన బ్రోకర్లను అరెస్ట్ చేయించాలన్నారు. గాంధీ జయంతి రోజున ఎందుకు ఈ గృహప్రవేశాలు చేయలేదని ప్రశ్నించారు. గతంలో నగరంలో ఉన్న కంపోస్టునంతా ఇక్కడకు తెచ్చి పోసేవారని దీనిని తరలించేందుకు రూరల్ మండలం తండేంవలస సమీపంలో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం తరఫున కొనిపించామని తెలియజేశారు. నగరంలో 15000 మంది ఇళ్లు లేకుండా ఉన్నారని పేదల కోసం ఒక ఎకరా భూమినైనా సేకరించారా అని ప్రశ్నించారు. తన హయాంలో 20 ఎకరాల భూమిని చాపురం పంచాయితీ పరిధిలో కొనుగోలు చేసేందుకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 80 అడుగుల రోడ్డులో సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ భూమిని కొనుగోలు చేసి హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తే దానిని ఎన్టీఆర్ ట్రస్టు కోసం తీసుకొని టిడిపి జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. హుదూద్ ఇళ్ల జాబితాలు ఆరు నెలల్లోగా ప్రకటించకపోతే తామే ఓ రెండువందల మంది నిరుపేద లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి గృహ ప్రవేశాలు చేయిస్తామంటూ హెచ్చరించారు. టిడిపి కార్యకర్తలు తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేయాలని ధర్మాన ఆగ్రహించారు. రేషన్‌డిప్లో బియ్యం తప్ప మరేసరుకులు ఇవ్వడంలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీవీ ముందు కూర్చుని అందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నారేతప్ప, అన్యాయమైన పరిపాలన సాగుతుందని ఇసుక ఉచితమని చెబుతూ రేవువద్దే లారీకి రూ.10000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హుదూద్ గృహాలే కాకుండా, ఇటువంటి అతిభీకరమైన మరో 10 అంశాలు నగరంలో ఉన్నాయన్నారు. బీదలకు న్యాయం జరిగేవరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, కోణార్క్‌శ్రీను, డాక్టర్ పైడి మహేశ్వరరావు, అందవరపు సూరిబాబు, శ్రీనివాస్‌పట్నాయక్, టి.కామేశ్వరి, కె.ఎల్. ప్రసాద్, పొన్నాడ రుషి, సాదు వైకుంఠరావు, శ్రీనివాస్, రెహ్మాన్, ధనుంజయరావు, కోరాడ రమేష్, నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అన్యాయమైపోయిన ప్రజలు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.