శ్రీకాకుళం

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 22: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బొడ్డేపల్లి శాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ స్థాయి నుండి పదోన్నతిపై ఈ బాధ్యతలు పొందారు. గతంలో ఆర్డివో కార్యాలయంలో ఏవోగా, గార తహశీల్దార్ తోపాటు వివిధ మండలాల తహశీల్దార్ గా విధులు నిర్వర్తించారు. ఆమదాలవలస యూనిట్-4 ల్యాండ్ ఎక్విసన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతిపై వచ్చారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
కోటబొమ్మాళి, అక్టోబర్ 22: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని ఎన్‌హెచ్ నుంచి సుబ్బారావుపేట వరకు 30 లక్షల రూపాయలు వ్యయంతో ఆర్‌డి ఎఫ్ నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసారు. చవితిపాడు వరకు ఈ రోడ్డు నిర్మాణానికి త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రాజకీయ కారణాలు వల్ల గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, తనకు ఎన్నికల్లో సహకరించని గ్రామాలను అభివృద్ధి చేసి చూపుతానన్నారు. 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు వారి సొంత గ్రామాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని, తాను ఆయా గ్రామాల్లో సిమ్మెంట్ రోడ్లు, గ్రామగ్రామాన మధ్య తారురోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తానన్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. తన స్వగ్రామానికి చేరువలో గల భగీరధిపురం, చవితిపాడు వంటి గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఇప్పటికైనా రాజకీయ విభేదాలు వీడి అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ప్రజలు సహకరిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చవితిపాడుకు చెందిన ఎస్.అప్పన్న, నారాయణ, తిరుపతిరావు, అంజయ్య, పారినాయుడు, ఆదినారాయణ, శ్రీనివాసరావు, గోవిందు, తేజేశ్వరరావుతో సహా 200 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి తెదేపాలోకి చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, ఎంపిపి రామకృష్ణ, జడ్‌పిటిసి పద్మశ్రీనివాస్, ఎఎంసి ఛైర్మన్ విజయలక్ష్మి, రమేష్, నాగయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాను వినియోగించుకోవాలి
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 22: సోషల్ మీడియాను వినియోగించుకొని ప్రభుత్వం చేపడుతున్న మంచి చెడు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం సోషల్ మీడియాపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సోషల్ మీడియా వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని దీనిని వినియోగించాలన్నారు. యువతతోనే ఇది సాధ్యమని సోషల్‌మీడియాలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపొందేందుకు సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియా వలన ప్రధానమంత్రి మోదీ 2014లో జరిగిన ఎన్నికల్లో 170 స్థానాలు అధనంగా సాధించారన్నారు. మనం కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా నలుగురితో ఈ సోషల్‌మీడియాను ప్రారంభించి 40మందితో రెండోసారి గెలవడానికి ఇదే రహస్యమన్నారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈసమావేశంలో అందవరపు సూరిబాబు, వైకుంఠరావు, కోణార్కు శ్రీను, ఎన్ని ధనుంజయరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరురోడ్ల విస్తరణ పనులు ప్రారంభం
నరసన్నపేట, అక్టోబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆనందపురం నుండి జిల్లాలోని నరసన్నపేట జమ్ము కూడలి వరకు ఆరురోడ్ల విస్తరణ పనులు కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఆరురోడ్లకు సంబంధించిన స్థలాలను ఇదివరకే ప్రభుత్వం గుర్తించడమే కాకుండా దానికి సంబంధించిన యజమానులకు నష్టపరిహారం కూడా గతంలో చెల్లించారు. ఈ దిశగానే ఆరురోడ్ల విస్తరణ పనులు ఊపందుకోవడంతో ఆదివారం విస్తరణ కార్యక్రమాలను చేపట్టారు. అయితే గతంలో నష్టపరిహారం చెల్లించినా ఆయా యాజమానులు ఆయా స్థలాలను ఆక్రమించుకుని ముందుకు కట్టడాలు నిర్మించారు. అయితే తమకు ఎటువంటి నోటీసులు లేకుండా ఒక్కసారిగా తొలగించడం అన్యాయమని ముందస్తుగా తమకు తెలియజేస్తే వాటిని ఖాళీ చేసేవాళ్లమని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీనిపై జాతీయ రహదారి అధికారులు మాట్లాడుతూ దీనికి సంబంధించిన నష్టపరిహారాలను గతంలోనే చెల్లించామని దానిపై పూర్తిహక్కులు ప్రభుత్వానికి ఉంటుందని ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని తమ స్థలాన్ని ఆక్రమించుకోవడంలో ఎటువంటి లోపాలు లేవని వారు స్పష్టంచేశారు. ఆదివారం చేపట్టిన ఈ తొలగింపు కార్యక్రమంలో భాగంగా జమ్ము కూడలి నుండి నరసన్నపేట మండలం మడపాం గ్రామం వరకు పనులను చేపట్టారు. ఎక్కడా ఎటువంటి ఆక్రమణలు తొలగించేందుకు ఎటువంటి నోటీసులు ఇచ్చే ప్రశక్తే లేదని వారు స్పష్టంచేశారు. సుమారు ఆక్రమణలకు సంబంధించి 1000మందికిపైగా జాతీయ రహదారి భూములపై ఆక్రమణలు చేపట్టారు. వివరించారు. ఇప్పటికైనా ఎవరైనా ఆక్రమణలు చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా సి ఐ పైడిపినాయుడు, నరసన్నపేట, పోలాకి, జలుమూరు ఎస్ ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
రుణమాఫీకి 1బి మెలిక
ఎచ్చెర్ల, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా మూడవ విడత రుణమాఫీని అమలు చేసేలా రైతుల ఖాతాల్లో నిధులు జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని బ్యాంకర్లను ఇటీవల ఆదేశించారు. మూడవ విడత రుణమాఫీ మొత్తంతోపాటు పదిశాతం వడ్డీలు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతులకు పంట రుణాలు అందించే అనేక బ్యాంకుల్లో సిబ్బంది రుణమాఫీ పత్రం, ఆధార్ కార్డుకు సంబంధించిన ప్రతులను బ్యాంకులకు తీసుకువచ్చి నమోదు చేసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు వ్యవహరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడవ విడత రుణమాఫీకి 1బి తప్పనిసరి అని సిబ్బంది మెళిక పెట్టడంతో లబ్ధిదారులైన రైతులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనునిత్యం సర్వర్ డౌన్ కష్టాలతో మీ సేవ నిర్వాహకులు నానా అవస్థలు పడిన విషయం విధితమే. దీనికి తోడు 1బిలు కావాలని పి ఏ సి ఎస్ సిబ్బంది నిబంధనల పేరిట రైతులపై రుద్దడంతో వారంతా 1బిలు పొందేందుకు మీ సేవ కేంద్రాల వద్ద కాపలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించిన సర్వర్ ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. ఇటువంటి సాంకేతిక కష్టాలు రైతుల సహనాన్ని పరీక్షించేలా పి ఏ సి ఎస్ అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతీ 1బి ప్రతికి 30 నుంచి రూ.40లు చెల్లించక తప్పడంలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఎస్ ఎం పురం పి ఏ సి ఎస్ పరిధిలో 2వేల మంది రైతులు మూడవ విడత రుణమాఫీకై అర్హులుగా మిగిలారు. వీరి వివరాలు నమోదు చేసేందుకు ఇక్కడ సిబ్బంది 1బి తప్పనిసరి అనడంతో ఇప్పటివరకు 275మందే ముందుకు వచ్చారు. 1బి మెళిక కారణంగా నమోదు ప్రక్రియ కూడా మరింత జాప్యం నెలకొంది. పలువురు రైతులు పి ఏ సి ఎస్ అధికారులపై చిందులు తొక్కుతూ నిబంధనలు సడలించాలని వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఈ విషయంపై ఎస్ ఎం పురం పిఏసిఎస్ సిఈవో డి.జగన్మోహనరావును వివరణ కోరగా ఉన్నతాధికారులు చెప్పిన విధంగా రుణమాఫీ పత్రంతోపాటు ఆధార్ జిరాక్సులను మీసేవ కేంద్రం నుంచి తాజాగా పొందిన 1బి ఉంటేనే నమోదు సాగిస్తున్నామని పేర్కొన్నారు.
1బి అవసరం లేదు: ఎల్‌డిఎం
మూడవ విడత రుణమాఫీలో అర్హులైన లబ్ధిదారులు బ్యాంకులకు 1బి ఇవ్వాల్సిన అసవరం లేదని రుణార్హత పత్రం , ఆధార్ జిరాక్సులను మాత్రమే అందివ్వాలని ఎల్ డి ఎం వెంకటేశ్వరరావు కోరారు. పి ఏ సి ఎస్ అధికారులు 1బి నిబంధనతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎల్ డి ఎం దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి ఈ సమస్య పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

పంచలింగాల దర్శనం... సర్వపాపహరణం
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 22: హిందువులకు అత్యంత పవిత్రమైనది కార్తీకమాసం. అతిప్రీతిపాత్రమైన ఈ నెల రోజులపాటు ఉపవాసదీక్షలు, నిష్టతో పూజలు, ఆలయాలు దర్శనాలు చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ప్రతీ రోజూ వేకువజామునే స్నానమాచరించి శివాలయంలో స్వామిని దర్శించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీపావళి పండగ పర్వదినం అనంతరం ప్రారంభమయ్యే కార్తీకమాసమంతా భక్తులు శైవ క్షేత్రాల్లో భారులు తీరి సాంప్రదాయద్ధంగా పూజలు నిర్వహించేందుకు పోటెత్తడం పరిపాటి. వేకువజామునుంచే రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు, దర్శనాలతో శివాలయాలు కిటకిటలాడుతాయి. శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక ఆలయాలకు పెట్టింది పేరు. అరసవల్లిలో ఆదిత్యుడి, శ్రీకూర్మాంలో కూర్మనాధుడు వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతోపాటు దక్షిణకాశీగా ఫరిడిల్లుతున్న శ్రీముఖలింగం , ఎండల మల్లిఖార్జుని ఆలయాలకు నిలయం. అలాగే బలరాముడు ప్రతిష్టించే పంచలింగాలు కూడా నాగావళి నదీ చెంతనే భక్తులకు దర్శనమివ్వడం ఓ ప్రత్యేకత. కార్తీక సోమవారం ఈ పంచలింగాలను ఒకేరోజు దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. . నాగావళి నదీ తీరాన ఉన్న ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు రామ్‌జీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. బలరాముడు ప్రతిష్టించిన ఈ ఆలయ ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. దీనికి తోడు కళ్లేపల్లి మణీనాగేశ్వర ఆలయం కూడా బలరాముడు ప్రతిష్టించినదే. పశ్చిమముఖంగా ఉండటం ఈ ఆలయం విశేషం. నాగావళి నదీ తీరంలోనే ఈ ఆలయం కూడా వెలిసి భక్తుల పూజలందుకుంటుంది. పంచ లింగాల్లో మొదటి ఒడిషా రాష్ట్ర రాయ్‌ఘడ్ సమీపంలో పాయకరావుపేట అనే గ్రామంలో నాగవళితీరాన ప్రతిష్టించిన పాయకేశ్వర శివలింగం. రెండవది పార్వతీపురం సమీపంలో గుంపా గ్రామంలో సోమేశ్వరశివలింగం, మూడవ వంగర మండలం సంగాం గ్రామంలో సంగమేశ్వర శివలింగం ప్రతిష్టించారు.

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం నగరకార్పొరేషన్ పరిధి 9వ డివిజన్‌ల్‌లో ఇంఛార్జ్ గండేపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద బడుగు బలహీనవర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను తెలియజేసే కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించడమే టిడిపి ధ్యేయమన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయనున్నట్లు స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, గొర్లె కృష్ణారావు, ప్రకాశ్, సీపాన రమ, కరగాన రాము, ఎస్ వి రమణమాదిగ, కరగాన భాస్కర్ తదితరులు ఉన్నారు.
సహజ సిద్ధమైన ప్రాజెక్టు మడ్డువలస
పాలకొండ, అక్టోబర్ 22: పాలకొండ రెవెన్యూ డివిజన్ ప్రాంతంలోని వంగర మండల కేంద్రానికి చేరువులో ఉన్న మడ్డువలస గ్రామం వద్ద 2002లో నిర్మితమైన సహజ సిద్దమైన ప్రాజెక్టు మడ్డువలస. దీనికి జిల్లాలో దివంగత నేత గొర్లె శ్రీరాములనాయుడు పేరును ప్రభుత్వం నామకరణం చేయడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఆపేరుతో పిలవబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మితం కాకమునుపు ప్రాజెక్టు పరిధిలో ఉన్న పలు మండలాలకు చెందిన వ్యవసాయ భూములన్నీ మెట్టు భూములే. ఈ భూముల్లో అప్పట్లో రైతులు మొక్కజొన్న, వేరుశెనగ, గోగు, ఉలవ, పెసర, మినుము వంటి ఆరు తడి తేలికపాటి పంటలు వేసుకొని జీవనం సాగించే వారు. సుమారు 120 కోట్ల వ్యయంతో సహజ సిద్ధ్దమైన ఎతె్తైన కొండల నడుమ నిర్మించిన మడ్డువలస ప్రాజెక్టును ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2002లో అప్పటి భారీ నీటిపారుదలశాఖామంత్రి కడియం శ్రీహరి పర్యవేక్షణలో ప్రారంభం జరిపారు. మడ్డువలస జలవనరులు లభించిన తర్వాత డివిజన్‌లోని సంతకవిటి, రేగిడి, జి.సిగడాం, పొందూరు, వంగర మండలాల పరిధిలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పటిష్టమైన లైనింగ్‌తో ఏర్పాటు చేసిన కాలువలు ద్వారా ప్రవహించిన సాగునీటితో ఈ మండలాలకు చెందిన రైతులు పంట పొలాలు పల్లపు భూములుగా మారి తేలికపాటి పంటలకు బదులు వరి, చెరకు వంటి పంటలను సాగు చేసుకుంటున్నారు.
అనేక గ్రామాల త్యాగఫలితం...
ఏదైనా ప్రాజెక్టు నిర్మితమైతే ఆ ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురికావాల్సిన వ్యవసాయ భూములు, గ్రామాలు ఖాళీ చేయాల్సిందే. ఇదే తరహాలో మడ్డువలస ప్రాజెక్టు నిర్మించడానికి అనేక గ్రామాల ప్రజలు తమ తోడ్పాటును అందించారు. ప్రభుత్వం నిర్వాసితుల భూములు, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ పూర్వికుల నుంచి నివాసముంటున్న తమ గ్రామాలను తప్పనిసరి పరిస్థితుల్లో త్యాగం చేసి విడిచిపెట్టాల్సి వచ్చింది. అటువంటి గ్రామాల్లో మగ్గూరు, పటువర్థనం, దేవకివాడ, కొత్తకోట, కొట్టిశ, నరేంద్రపురం తదితర గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ప్రాజెక్టు నీటిలో మునిగిపోయి ఇప్పటికీ ఆ గ్రామాల ఆనవాళ్లు ప్రాజెక్టులో నీరు తగ్గుముఖం పట్టే పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటాయి.
దాహాలు తీర్చేందుకు ప్రధాన నీటివనరు...
జిల్లాకు ఎగువ ప్రాంతంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నట్టయితే జిల్లాలోని అనేక మండలాల ప్రజలకు దాహం తీరినట్టే. ముఖ్యంగా వేసవి కాలంలో నాగావళి నదిలోని నీరు అడుగంటుతున్న సమయంలో మడ్డువలస ప్రాజెక్టు నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేయడంతో ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది.