శ్రీకాకుళం

హస్త కళలకు చేయూతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 21: హస్తకళలకు చేయూతనిచ్చి పరోక్షంగా కార్మికులను ఆదుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. నగరంలో ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగా హస్తకళ, చేనేత ఎంపోరియం ఆల్ ఇండియా క్రాఫ్ట్‌బజార్ పేరున నిర్వహించనున్న ప్రదర్శన, అమ్మకాన్ని ఆయన ప్రారంభించారు. నెల రోజులపాటు ఇది కొనసాగుతుందని తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్త్ధిరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు ముఖ్యంగా చేనేత హస్తకళా ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. ఆలిండియా క్రాఫ్ట్‌బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకచోటికి తెచ్చి ప్రదర్శన, విక్రయించడం ఒక ప్రత్యేక కళ అన్నారు. ఈ అవకాశాన్ని చుట్టుప్రక్కల ప్రాంతాలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖ ఆర్టీషియన్స్ డవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్‌నషీన్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ మంచిముత్యాలు, కలంకారీ పెయింట్స్, అగరబత్తులు, కాటన్ శారీస్, డ్రెస్‌మెటీరియల్స్, బ్యాగ్‌లు వంటి ఎన్నో రకాల వస్తువులు ప్రదర్శించి విక్రయించబడునని తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించబడునని తెలియజేశారు. మహ్మద్‌సలీమ్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

మున్సిపల్ హైస్కూల్ అభివృద్ధికి కృషి
* పూర్వ విద్యార్దుల సంఘం వెల్లడి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 21: నగరంలోని ఎన్టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షులు విజికె మూర్తి తెలియజేశారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న పూర్వవిద్యార్ధుల సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు నూతన వైభవం సాధించడం కోసం 2012 నుండి పూర్వ విద్యార్ధుల సంఘం ఏర్పాటు చేసి పనిచేస్తున్నట్లు తెలిపారు. శిధిలభవనాలు తొలగింపు, ప్రస్తుత భవనాలు మరామ్మతులు చేపట్టే కృషి ఇంతవరకు జరిగిందన్నారు. అడ్మిషన్ల పెంపుదల కోసం విద్యార్ధులకు ప్రోత్సహాకాలు కల్పించడంతో పాటుదీర్ఘకాలిక చర్యల్లో పాఠశాలకు శాశ్వత ప్రాతిపధికన అభివృద్ధి సాధించే దిశలో కృషి చేయాలని సంఘం నిశ్చయించిందన్నారు. ఈ సంఘం కృషిని గుర్తించిన అధికారులు ఏడుగదుల నూతన భవనాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ దశలోఫర్నిచర్, డిజిటల్ క్లాస్‌రూమ్, కంప్యూటర్లు హరితశోభ, భవనాలకు పెయింటింగ్‌లు తదితర ప్రణాళికల కోసం నిధులు సమీకరణ చేయాలని నిశ్చయించినట్లు తెలియజేశారు. రూ.20లక్షల నిధులు సమీకరించి ఓ ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రూ.3లక్షలు నిధులు సేకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విజికె మూర్తి తమవంతున రూ.1,11,111 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జామి భీమశంకరరావు, జె ఎస్ ఎస్ ప్రకాశరావు, విశే్వశ్వరరావు, పేర్ల కామరాజు, సిహెచ్ వి ఎస్ ప్రసాద్, కిల్లాన ఫల్గుణరావు, పాలిశెట్టి మల్లిబాబు, భాస్కరరావు, మూర్తి, నర్శింగరావు, పాఠశాల హెచ్ ఎం కాసిన వెంకటేశ్వరరావు, తర్లాడ బాలమురళీ తదితరులు పాల్గొన్నారు.