శ్రీకాకుళం

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 21: కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ మహిళామోర్చా ఇంఛార్జ్, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా చైతన్యసభల్లో భాగంగా మంగళవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వచ్చాక మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని ఏ రంగంలోనైనా మహిళలు రాణించగలరనే నమ్మకంతో కేంద్రమంత్రి వర్గంలో మహిళలకు కీలకశాఖలు అప్పగించారని తెలిపారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన సుకన్య, సమృద్ధియోజన, బేటీబచావ్, బేటీ పడావ్, స్వచ్ఛ్భారత్, కౌసల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మిషన్ ఇంద్రదనస్సు, ముద్రా యోజన, సభల యోజన, జన్‌ధన్ యోజన, నయారోష్ని వంటి పలు పథకాలను మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు. ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా మైనారిటీ మహిళలకు అండగా నిలబడ్డారని, ప్రసూతి సెలవులను ఆరు నెలలకు పెంచారన్నారు. నల్లధనం అంతా బ్యాంకుల్లోకి వచ్చిందని తెలియజేశారు. ఆర్ధిక శక్తి అయిన భారతదేశంలో 19శాతం మరణించేవారి సంఖ్య ఉందని దీనికి కారణం రక్తహీనతే నని తెలియజేశారు. దీనిని అధిగమించేందుకు ఐ సిడి ఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చిన్నారులకు,బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం 33శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉందని ఎన్డీయే కూటమిలో కుటుంబ సభ్యులుగా ఉన్నవారి అందరి అనుమతి అవసరమని తెలియజేశారు. పోలీసు ఫోర్సులో 33శాతం మహిళలను తీసుకోవాలన్నారు. 2019 నాటికి బిజెపి బలీయమైన శక్తిగా మారాలన్నారు. మహిళామోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు సీతాదేవి మాట్లాడుతూ మహిళల కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లాలో అందరికీ అందేటట్లు జిల్లా నాయకులు కృషి చేయాలని కోరారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కద్దాల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ చైతన్య సదస్సులో రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, మహిళా మోర్చాకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డ్భిగ్యలక్ష్మీ, శవ్వాన ఉమామహేశ్వరి, చల్లశ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూరచంద్రవదన, రాష్ట్ర కార్యదర్శి రేణూసింగ్, విశాఖ నగరఅధ్యక్షురాలు ప్రేమకుమారి, భాగ్యవతి, పైడి వేణుగోపాలం,కోటగిరి నారాయణరావు, పూడి తిరుపతిరావు, శవ్వాన వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, దుప్పల రవీంద్రబాబు, అట్టాడ రవిబాబ్జీ, సువ్వారి వెంకటసన్యాసిరావు, సంపతిరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.