శ్రీకాకుళం

బీసీల్లో.. అంతర్యుద్ధం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లా రాజకీయాల్లో బలహీనవర్గాల ఆధిపత్యం కొనసాగుతోంది. జిల్లాలో 20,38,231 జనాభాలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన తూర్పుకాపు, పోలినాటి వెలమ, కళింగ కులాలకు చెందిన వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. సంఖ్యాపరంగా అత్యల్పంగా ఉన్న కొన్ని కులాలవారికే అధికార పగ్గాలు అప్పగించి వారి అందలాలకు నిచ్చెనలుగా ఉపయోగపడుతున్న బలహీన వర్గాలకు ఈ జిల్లా రాజకీయాలు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయనడంలో అతిశయోక్తిలేదు. సామాజికంగా బలహీనవర్గాలకు చెందిన వారే అయినా ఈ జిల్లా నేతలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూడా తమైద ముద్ర వేస్తున్నారు. గౌతు లచ్చన్న ఈ రాజకీయాలను ఉద్యమాల బాట పట్టించి రాష్ట్ర రాజకీయచిత్రపటంలోనే సుస్థిర స్థానం పొందారు. కాంగ్రెస్‌కు పటిష్ట స్థానం సాధించి పెట్టినది బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు. ఈ ఇద్దరూ ఉద్దండులు బిసీలే! వర్తమానానికి వస్తే, వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, టిడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు, కూన రవికుమార్, గుండ అప్పలసూర్యనారాయణ...అంతా బిసీ నేతలే. అయితే, కన్పించే లోటు ఒకటే - శ్రీశయన, యాదవులు, కళింగకోమట్లు, మత్స్యకారులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం. ఇటువంటి సిక్కోల్ బిసీ నేతల్లో అంతర్యుద్ధానికి తెర లేచింది!? ముఖ్యంగా జిల్లా ఓటర్లలో అత్యధిక శాతం కలిగిన కాపు సామాజికవర్గం, తర్వాత వెలమ సామాజిక వర్గం, చివరిగా కళింగ సామాజిక వర్గాల బలాబలాలు కన్పిస్తాయి. వీటి ద్వారానే పార్టీలు, జెండాలు, సిద్ధాంతపరమైన నిర్ణయాలతో పనిలేకుండా వ్యక్తులకు - సామాజిక శక్తులకే సిక్కోల్ ఓటర్లు అందలం ఎక్కించేందుకు సిద్ధపడతారు. అందుకే, రాష్టమ్రంతటా ఎన్నికల ఫలితాలు ఒకవిధంగా ఉంటే - ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సామాజిక వాస్తవాలతో ఎన్నికల ఫలితాలు ముడిపడి వుంటాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో ముఖ్యులంతా మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావును భారతీయ జనతా పార్టీ సభ్యత్వంతో జాతీయ పార్టీ నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పొత్తుల చుట్టారికాలతో బిజెపీ అభ్యర్థిగా బరిలోకి దించి, మద్దతుగా కింజరాపు, గుండ రాజకీయ వర్గాలు బలాన్నీ ఇచ్చేలా వ్యూహాన్ని రచిస్తే జిల్లా అంతటా వైకాపా పార్టీయే ఉండబోదని, రానున్న రోజుల్లో ప్రతిపక్షం లేని మొట్టమొదటి జిల్లాగా శ్రీకాకుళం ఏర్పాటు చేసి, ఇక్కడ నుంచే అమరావతి వరకూ ప్రతిపక్షమే లేని నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యానికి ధర్మాన, కింజరాపు, గుండ వర్గాలు స్నేహితులుగా మారేందుకు అంగీకార రాజకీయ ఎత్తుగడలు సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ధర్మాన బిజెపీలోకి చేరుతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదంటూ ధర్మాన ప్రసాదరావు కొట్టిపారేస్తున్నప్పటికీ, కళింగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగతొక్కేయాలన్న వెలమసామాజిక రాజకీయ ఉద్దండుల వ్యూహంగా ఉంది. కాని - కాపు సామాజికవర్గం జిల్లా ఓటర్లలో 18 శాతం ఉండగా, వెలమ సామాజికవర్గం ఓటర్లు 15.8 శాతం ఉన్నారు. వీరికంటే తగ్గువుగా 11.2 శాతం మంది కళింగ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఈ కాకులెక్కలన్నీ కూడికలుతీసివేతలు వేస్తే వెలమ సామాజికవర్గం కాపు సామాజికవర్గంతో సంధి కుదుర్చుకుని తెలుగుదేశం పార్టీ చిరకాల వాంఛయైన పది నియోజకవర్గాల్లో ప్రతిపక్షం లేకుండా స్వీప్‌గా టిడీపీ విజయఢంకా మోగించేందుకు కమలనాధుల‘్ధర్మాన’ ఒప్పందం కుదిరితే - శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యే కావలి నారాయణ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వరకూ రాజకీయ చరిత్రే తిరిగి రాసేవిధంగా 2019 ఎన్నికలు ఉంటాయంటూ రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ మేయర్‌గా గుండ అప్పలసూర్యనారాయణకు మద్దతు పలికేందుకు కింజరాపు కుటుంబీకులు సై చెబితే..్ధర్మాన వర్గాలు బలపరిస్తే శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ధర్మానను బరిలోకి బిజెపీ నుంచి దించుతే..కింజరాపు కుటుంబీకులు అధినేత బాబుకు ఇచ్చిన ప్రతిపక్షం లేని సిక్కోల్ అప్పగించేందుకు వ్యూహాం ఫలిస్తే - తమ్మినేని సీతారాం రాజకీయ చరిత్ర ముగిసిపోతోందన్న ఎత్తుగడే ఇందుకు ప్రధాన అంశం. ఈ ఒప్పందం వెనుక విప్ కూన రవికుమార్ సెఫ్టీజోన్ ఎత్తుగడ కూడా దాగివుంది. ధర్మాన మాటలు పెడచెవిపెట్టే వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి, సీనియారిటీపై కనీసం విశ్వసించని విధానం, ధర్మాన రాజకీయ వ్యూహాలకు ప్రతిబంధకాలుగా తమ్మినేని, రెడ్డిశాంతి, పాలవలస, సోదరుడు ధర్మాన కృష్ణదాస్ వంటి నేతల ఆలోచనలతోనే సిక్కోల్ రాజకీయాలను నడిపించాలన్న జగన్ రాజకీయ దృష్టి..ఇవన్నీ ధర్మాన బిజెపీలోకి చేరేందుకు ప్రేరణలంటూ ఆయన అనుచరులు చెప్పుకొచ్చే సంగతులు. ఏదిఏమైనప్పటికీ, వెలమ - కళింగ సామాజికవర్గాల మధ్య పరోక్షంగా ఇప్పటి వరకూ 12 ఎన్నికల్లో జరిగిన అంతర్యుద్ధం కంటే రానున్న ఎన్నికల్లో మాత్రం ప్రచ్చన్న యుద్ధమే! సాగినట్టు రాజకీయ నేతల కదలికలు సుస్పష్టం చేస్తున్నాయి. ఇదే తు.చ.తప్పకుండా జరిగితే కింజరాపు - ధర్మాన - గుండ వర్గాల వ్యూహాం సక్సెస్ అయినట్టే!! వారితోపాటు విప్ కూన రవికుమార్ నియోజకవర్గం సేఫ్‌గా ఉన్నట్టే!!