శ్రీకాకుళం

స్టేడియం ఆధునీకరణకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, మే 3: సిక్కోలు గడ్డ నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటడం, దానికి జిల్లా కేంద్రం కోడిరామ్మూర్తి స్టేడియం వేదిక కావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్టేడియం శిథిలావస్థకు చేరుకుని క్రీడకారాలకు దూరవౌతుంది. ముప్పై ఏళ్ల కిందట నాటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతులు మీదుగా 1983లో ప్రారంభించిన ఇదే స్టేడియం, చుట్టు ప్రక్కల ఉన్న గ్యాలరీ నేడు శిథిలావస్థకు చేరుకోవడం, అదేస్థానే అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ స్టేడియంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం విచ్చేయునున్నారు. గతమెంతో కీర్తి గడించిన ఈ గడ్డ నుంచి ఒలింపిక్ పతక విజేత కరణం మల్లేశ్వరి మొదలుకుని వెయిట్ లిఫ్టర్లు పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మీ తదితర క్రీడాకారులు ఎందరో జిల్లా నుంచి సత్తా చాటారు. అయితే నానాటికీ అధునాతన పరికరాలు అందుబాటులో లేకపోవడం, శిక్షకుల కొరత వెంటాడడంతో నానాటికీ క్రీడలకు క్రీడాకారులు దూరం కావల్సి వచ్చింది. ముప్పై మూడు ఏళ్ల కిందట అప్పటి అధికారుల పొరపాటే ఏమో గాని.. స్టేడియం, ట్రాక్, కోర్టుల నిర్మాణం ఉత్తర, దక్షిణ దిశలలో నిర్మించాల్సి ఉండగా, తూర్పు పడమర దిశలలో నిర్మించారు. అటువంటి తప్పులను సవరించుకుని ఉత్తర, దక్షిణ దిశలలో స్టేడియం నిర్మాణానికి రూపకల్పన చేశారు. నైరుతి మూలాన ఇండోర్ స్టేడియం, క్రీడాకారులకు వసతి గదులు నిర్మించేందుకు చర్యలు చేపట్టేందుకు రూపకల్పన చేశారు. అయితే సౌకర్యాలు కల్పించినప్పటికీ మెంటైనెన్స్‌కోసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించినట్టయితే ఏడాది కొంత మొత్తం చేకూరుతుందని ఇక్కడి క్రీడాసంఘాల ప్రతినిధుల వాదన. తొలి విడతగా స్టేడియం నిర్మించినప్పటికీ, తదనుగుణంగా కమర్షియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తే కొంత నిధులు సమకూరి స్టేడియం అభివృద్ధికి సహకరిస్తుందని క్రీడాకారులు పేర్కొంటున్నారు.
వెంటాడుతున్న శిక్షకుల కొరత
అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులకు వేదికగా మారిన సిక్కోలు క్రీడలకు శిక్షకుల కొరత వెంటాడుతోంది. అత్యాధునిక సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో సత్తా ఉన్న క్రీడాకారులు మరుగునపడుతున్నారు.
స్టేడియం వేదికగా ఆసక్తిగల క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితేసే శిక్షకులు నియమకాలు పాలకులు జరపకపోవడం ఓ శాపంగా మారింది. ఇప్పటికైనా పాలకులు స్పందించి శిక్షకులను నియమిస్తే మరిందరు క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో సత్తాచాటేందుకు వీలుంటుందని క్రీడాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.