శ్రీకాకుళం

గ్రామ శిథిలాల నడుమ వంశధార నిర్వాసితుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, డిసెంబర్ 12: ఇళ్ళు నేలమట్టం... నిర్మానుష్యం, భయానక వాతావరణం.. ముంపు గ్రామాల్లో ఇళ్ళ కూల్చివేత దుస్థితి ఇది! అలాంటి గ్రామాల్లోని పెద్ద సంకిలి గ్రామంలో పడాల రాజారావు అనే వృద్ధుడు రాత్రి, పగలు నివాముంటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వంశధార రిజర్వాయర్ నిర్మాణ వల్ల ముంపునకు గురైన గ్రామాల్లోని భవనాలను కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నెల 10న పెద్ద సంకిలి గ్రామంలోని భవనాలను అధికారులు కూల్చివేశారు. దీంతో నిర్వాసితులు 650 ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
దీంతో కొందరు నిర్వాసితులు ఏర్పాటుచేసిన పునరావాస కాలనీకి తరలివెళ్లారు. అలాంటిది గ్రామానికి చెందిన పడాల రాజారావు అనే వృద్ధుడు కూల్చివేసిన తమ ఇళ్లు ఆవరణలోనే నివాసముంటున్నాడు. రాజారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబాల కలహాలు చోటుచేసుకున్నట్టు తెలియవచ్చింది. దీంతో ప్రభుత్వం చెల్లించిన రూ.6 లక్షలు పరిహారం భార్య, రాజారావు పేరున గ్రామ పెద్దలు బ్యాంకులో జాయింట్ ఖాతాలో జమ చేశారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు, భార్య రాజమండ్రి ఉపాధి కోసం వలస వెళ్లారు. దీంతో అధికారులు గ్రామంలోని భవనాలను కూల్చివేయడంతో దిక్కులేని రాజారావు కూల్చివేసిన పురిపాక కిందనే నివాసముంటున్నాడు. రాజారావుకు 35 కేజీల బియ్యం మాత్రమే ప్రభుత్వం అందిస్తోంది. పింఛను లేదు. కేవలం రూ.13 మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఎవరికీ ఆర్థిక సాయం అడగని రాజారావు ఆకలితో గుట్టల మధ్యనే నివాసముంటున్నాడు. సుమారు రెండేళ్ళ కిందట ఆధ్యాత్మిక వేత్తగా మారి, జీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై రాజారావును ప్రశ్నించగా నన్ను ఆదుకోవడానికి ఎవరూ లేకపోవడంతో నివాసగృహం కూడా లేకపోవడం వల్ల ఇక్కడే తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆ భగవంతుడే నన్ను ఆదుకుంటాడని సమాధానం చెప్పారు. సొంత గ్రామంలో ఉండడానికి ఎందుకు భయమని సమాధానం చెప్పాడు. కూల్చివేసిన గ్రామంలో నివాసం ఉండడం చాలా మంది ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు.

బాలికకు విద్యుదాఘాతం
ఎచ్చెర్ల, డిసెంబర్ 12: మండలంలోని డి.మత్స్యలేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సూరాడ దేవి మంగళవారం పాఠశాల ప్రాంగణంలోనే విద్యుత్‌షాక్‌కు గురై గాయాలు పాలైన సంఘటన చోటు చేసుకుంది. మూత్ర విసర్జన కోసం తోటి విద్యార్థులతో వెళ్లి, బలుసుపళ్లు ఏరుతుండగా సమీపంలో విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురయ్యింది. సంఘటన తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు రమణమూర్తి, పిఇటి శ్రీనివాసరావులు చికిత్స నిమిత్తం పొన్నాడ పిహెచ్‌సికు గాయపడిన దేవిని తరలించి వైద్య సేవలు అందించారు. గాయపడిన దేవికు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ వైర్లు సరిచేయాలని పలుమార్లు స్థానికులు విన్నవించుకున్నప్పటికీ సంబంధించకపోవడమే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక సర్పంచ్ మూగి మంగమ్మ, ఎంపిటిసి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వేలాడి వైర్లను సరిచేయాలని కోరుతున్నారు.