శ్రీకాకుళం

శ్రీముఖలింగంలో జనసేన పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జనవరి 22: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలో మధుకేశ్వరస్వామికి నరసన్నపేట జనసేన సమన్వయం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన యాత్ర విజయవంతం కాలని కోరుతూ పూజలు చేపట్టినట్లు కన్వీనర్ లుకలాపు రంజిత్‌కుమార్ తెలిపారు. ఆయనతోపాటు శ్రీముఖలింగం గ్రామానికి చెందిన నాయుడు రాజశేఖర్, హరిబాబు, ప్రసాదరావులు పాల్గొన్నారు.

గ్రామీణ యువతకు వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు
సారవకోట, జనవరి 22: సమాజంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వ్యవసాయ శాస్తవ్రేత్త జి.చిన్నంనాయుడు తెలిపారు. సోమవారం స్థానిక వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయంలో ఎంపి ఇవోల శిక్షణా తరగతుల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో నాణ్యమైన విద్య ప్రతీ ఒక్కరికీ అందుతుందని అయితే దానితోపాటుగా ఉద్యోగ అవకాశాలు ఎండమావుల్లా కనిపిస్తున్నాయని వివరించారు. దీనికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే యువత ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మ పీడి ప్రమీల మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పూల పెంపకం, ఉద్యానవన పంటలు తదితర వ్యవసాయాల పట్ల చదువుకునే విద్యార్దులు దృష్టి సారించగలిగితే వారి భవిష్యత్ పూల బాట అవుతుందని వివరించారు. ఇప్పటికే అవగాహన పరుచుకున్న కుటుంబాలు చక్కగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఈ దిశగానే ప్రతీ పంచాయితీలలో యువతకు వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచే విధంగా చూడాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఏరువాక శాస్తవ్రేత్తలు చిట్టిబాబు, వెంకటరావు, ఏడి జి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

అమ్మకు వందనం విజయవంతం
నరసన్నపేట, జనవరి 22: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన అమ్మకు వందనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సోమవారం ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాఘశుద్ధపంచమి, వసంతపంచమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎం ఈవో శాంతారావు తెలిపారు. అంతేకాకుండా పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలను కూడా హెచ్ ఎంలు నిర్వహించారు. పలు పాఠశాలల్లో ఇటీవల జరిగిన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అమ్మ దీవెనలు విద్యార్ధులకు ఉన్ననాడే వారి భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా వెలుగుతుందని హెచ్ ఎంలు తెలిపారు.