శ్రీకాకుళం

ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జనవరి 22: వాహనాలపై ప్రయాణాలు చేసినప్పుడు ప్రమాదాలు జరగకుండా ప్రాణాలను రక్షించుకునే బాధ్యత ప్రయాణీకులు, వాహన చోదకులపై ఉందని పాలకొండ డీ ఎస్పీ బి.స్వరూపారాణి అభిప్రాయపడ్డారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహన చోదకుల నిర్లక్ష్యం వలనే అధికంగా నమోదయ్యాయని పలువురు ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాన్ని నడపరాదని ఆమె హెచ్చరించారు. వేగ నిరోదక సూచిక బోర్డులను అవసరమైన చోట్ల పోలీసు శాఖ ఏర్పాటు చేసిందని వీటిని గమనించాలన్నారు. మండలంలోని సవరడ్డపనస గ్రామం వద్ద ఇటీవల అధికంగా ప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో ఆదివారం జరిగిన సంఘటన స్థలాన్ని సందర్శించి ఆమె నిశితంగా పరిశీలించారు. పోలీసులు అమర్చిన వేగ నిరోదక డ్రమ్ముల వలన ఈ ప్రమాదం జరగలేదని ఆమె స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి నిందుతులను కోర్టుకు తరలించాలని డివిజన్‌లో గల అన్ని పోలీస్‌స్టేషన్లకు ఆదేశించినట్లు ఆమె స్పష్టంచేశారు. పోలీసుల సమక్షంలో రాజీ ప్రయత్నాలు చర్చలు జరపడం వలన నిందితులు నిర్భయంగా సమాజంలో తిరుగుతున్నారని దీని వలన బాధితులు నష్టపోతున్నారని ఆమె వివరించారు. కేసు నమోదు చేసిన తరువాత నిందితులు న్యాయమూర్తి వద్ద పరివర్తన చెంది కేసును ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేయవచ్చునని ఆమె సూచించారు. స్థానిక పోలీసు వసతిగృహాల దుస్థితి గురించి జిల్లా ఎస్ సితో చర్చిస్తానని ఆమె అన్నారు. మైనర్ బాలికలను లైంగిక నేరాల నుంచి కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. పాతపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు, స్థానిక ఎస్ ఐ సత్యనారాయణ విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.