శ్రీకాకుళం

పండుటాకుల పింఛను పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, ఫిబ్రవరి 16: నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు ఆర్థికంగా చేయూత అందించాలని ఉద్దేశ్యంతో అమలు చేస్తున్న పింఛను పథకం పండుటాకులకు పాట్లు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అక్రమాలు అరికట్టేందుకు వేలిముద్రలు ద్వారా అమలు చేస్తుండడంతో వేలిముద్రలు పడని వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి లబ్ధిదారులకు మూడు శాతానికి మించి పంపిణీ చేపడితే సంబంధిత ఉద్యోగులకు మెమో జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 5,064 మందికి వృద్దాప్య, వితంతు, వికలాంగ, అభయహస్తం తదితర పింఛను లబ్ధిదారులున్నారు. వీటిలో హిరమండలం మేజర్ పంచాయతీలో 1100 మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరికి నెలవారి పింఛను సొమ్మును గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ కార్యదర్శులతో పాటు వెలుగు, సాక్షరభారత్ తదితర శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పంపిణీ చేపడుతున్నారు. వేలిముద్రలు వేసి పింఛను సొమ్మును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వయోభారంలో ఉన్న వృద్ధులకు వేలిముద్రలు పడని పరిస్థితులున్నాయి. గతంలో వీరికి పంపిణీ ఉద్యోగులు వేలిముద్రలు వేసి పంపిణీ చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం వేలిముద్రలు పడని వారు మూడు శాతానికి మించి పంపిణీ చేపట్టినట్టయితే సంబంధిత ఉద్యోగులకు మెమో జారీ చేయడం జరుగుతుందన్నారు. వీటి వల్ల కొంతమందికి పింఛను సొమ్ము పంపిణీ చేసి మిగిలిన వారికి అందజేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా మూడు నెలలు పింఛను పొందలేకపోతే రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిబందనలు లబ్ధిదారులకు గుదిబండగా మారింది. దీంతో ఉద్యోగులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీలో వేలిముద్రలు పడని వారు సుమారు వంద మంది వరకు ఉన్నట్టు తెలిసింది. నిబంధనలు మేరకు సుమారు 30 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, మిగిలిన వారికి అందజేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఆలోచించి నిబంధనలు సడలించాలని లబ్దిదారులు కోరుతున్నారు.