శ్రీకాకుళం

ముఖ్యమంత్రిది భయం కాదు, బాధ్యత: మంత్రి అచ్చెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, ఫిబ్రవరి 16:విడిపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు అలుపెరగని యోథుడులా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి భయపడుతున్నట్లు ప్రతిపక్షనాయకుడు జగన్ చేస్తున్న ప్రచారం అర్థరహితమని, హోదాపై ముఖ్యమంత్రిది భయం కాదని, అది బాధ్యత అని, భయానికి, బాధ్యతకు తేడా తెలుసుకొని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. సోంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన శుక్రవారం కమ్యూనిటీ ఆసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి అనేక అంశాలపై సానుకూల దృక్పథంతో ఉన్నారని, బిజెపితో పొత్తు కోసం జగన్ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ముఖ్యమంత్రిపై హోదా విషయంలో విమర్శలు చేయడం తగదన్నారు. అనేక అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న జగన్‌కు ప్రతి రోజు ఇడి నుంచి సమన్లు అందుతున్నాయని, ఇక్కడ భయపడాల్సింది ఏవరో ప్రజలకు తెలుసునన్నారు. ఎంపిల రాజీనామా విషయంలో రెండేళ్లుగా డ్రామాలు ఆడుతుందని, నీవు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రజలు కోసం తన వంతు పాత్ర పోషిస్తుందని, ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వైఖరిని ఎంపిలు పార్లమెంట్‌లో తెలియజేసారన్నారు. జిల్లాలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయల వ్యయం చేసి ఎన్‌టి ఆర్ శుద్దజల ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో పెట్టినివే కాకుండా పెట్టనవికూడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.