శ్రీకాకుళం

విద్యాక్షేత్రంలో...‘మత్తు’మొక్కలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఏ విత్తనం నాటితే ఆ పంటే పండుతుంది. విద్యాక్షేత్రంలో ‘మత్తు’మొక్కలు నాటి, అక్రమ ఎరువు వేసి, కాండం తొలిచే పైరవీ పురుగులను పోషించి, గంజాయి కలుపు మొక్కలను పెరగనిచ్చి, విజ్ఞానపు సూర్యరశ్మి సోకకుండా అడ్డుకుని, విలువల నీరు పెట్టకుండా మాడ్చి, రాజకీయ పశువులకు గేట్లు బార్లా తెరిచినప్పుడు...ఎకడమిక్‌పైరు ఏపుగా ఎదగడం లేదని, పట్టాల పంట పాడైందని, విద్యా ప్రమాణాలు ముక్కువాసన కొడుతున్నాయని, మార్కెట్లో గిరాకీ బొత్తిగా లేదని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విలపించి ప్రయోజనం లేదు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి, సాధ్యమైనంత ‘గంజాయి’మొక్కలను నాటేసి..విద్యారంగాన్ని సాయిశక్తులా భష్టుపట్టించాక ఇంకెక్కడి జాతీయాభివృద్ధి? ఇంకెక్కడి సామాజిక పరివర్తన?? విద్యార్ధులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్న వారిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టులు చేయలేదు. వారితోపాటుగా గంజాయి అలవాటుపడిన విద్యార్ధుల భవిష్యత్తు దృష్యా వారిపై కూడా పోలీసుశాఖ ఎటువంటి కేసులు నమోదు చేయకుండా, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలతో కౌన్సిలింగ్‌లు నిర్వహించిన సంఘటనలు ఎన్నో..ఇటువంటి సంఘటనలు తరుచుగా జాతీయరహదారికి కొంచెం దూరంలో గల మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతునేవున్నాయి. ఇప్పటి వరకూ చాటుమాటుగా సాగిన గంజాయి విక్రయాలు, వినియోగం ఇప్పుడు బహిర్గతం కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. పక్క రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే విద్యార్ధుల్లో ఇటువంటి ‘మత్తు’కల్చర్ సిక్కోల్‌కు పాకడంతో యువత పెడత్రోవపడుతున్నారన్న భయం జిల్లా పోలీసుశాఖను కలవరపెడుతోంది. ఇటువంటి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలన్న ఆలోచనతో జిల్లా ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మ ప్రత్యేక బృందాలను ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలతోపాటు, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు నియమించేందుకు రంగం సిద్ధం చేశారు.
డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం
* కలెక్టర్ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, ఫిబ్రవరి 16: డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైధానంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాల సభ్యులు ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు రెండు రోజులపాటు ఏర్పాటు చేశారు. ఈప్రదర్శనను ఎమ్మెల్యే లక్ష్మీదేవి సమక్షంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. డ్వాక్రా ప్రదర్శనలో శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న సంఘాలతో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, రాజాం, పాలకొండ, ఆమదాలవలస, పురపాలక సంఘాలు నగర పంచాయతీల పరిధిలో గల సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు తీసుకువచ్చారు. జిల్లాలో ప్రసిద్ధినొందిన తినుబండార్లతో సమోసా వంటి ఇతర వంటకాలు, చికెన్‌బిరాయనీ, పులిహోరో, చల్లనీపానీయాలు, బాలికలు, మహిళలకు అవసరమగు ఆభరణాలు, గాజులు, జ్యూట్‌బ్యాగులు, అల్లిక బ్యాగులు, ఫినాయిల్, ఇతర మెటీరియల్ ప్రదర్శన, విక్రయాలలో చోటు చేసుకున్నారు. ప్రతీ స్టాల్‌లోమహిళా సంఘాల ప్రతినిధులతో కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడి వారి ఉత్పాతదనలను మరింత వృద్ధి చేయాలని సూచించారు. స్థానికంగా ఉండే మార్కెటింగ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ పరిస్థితులను గమనించి అందుకు అనుగుణంగా విక్రయాలు చేయడం వలన లాభదాయకత ఉంటుందని తెలిపారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో మెప్మా నేతృత్వంలో ప్రదర్శన, విక్రయాలను ఏర్పాటు చేశామన్నారు.

ఘనంగా చక్రతీర్థస్నానాలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 16: మండలంలోని సింగుపురంలో వెలసిన కొండమ్మ సహిత హాటకేశ్వరస్వామి చక్రతీర్థస్నానాలు వంశదారి నదీ తీరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బైరి గ్రామానికి ఆనుకుని ఉన్న వంశధార తీరంలో స్వామివారికి చక్రతీర్థస్నానం జరిపించారు. ఆలయ అర్చకులు పెంటా చిట్టిబాబుశర్మ ఆధ్వర్యంలో రుత్వికులు చక్రతీర్థస్నానాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో బైరి, కరజాడ, సింగుపురం పలు పంచాయతీల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని చక్రతీర్థస్నానాల్లో పాల్గొన్నారు. స్వామివారిని అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

ప్రజల అవసరాలు తీర్చడమే టీడీపీ ధ్యేయం
* ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 16: ప్రజల అవసరాలు తీర్చడమే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి అన్నారు. నగరంలోని 48వ డివిజన్‌లో ఇంఛార్జ్ సురకాశి వెంకటరావు ఆధ్వర్యంలో ఫాజుల్‌బేగ్‌పేటలో జీరు అప్పారావు వీధిలో రూ.4లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా ఎటువంటి సమస్యలు లేకుండా అభివృద్ధి చేసేందుకు సిఎం చంద్రబాబు సహకరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో సుమారు రూ.10కోట్లతో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని, వాటి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలియజేశారు. అవి పూర్తయితే ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. పి ఎన్ కాలనీ వెంకటేశ్వర దేవాలయం నుండి కాలువలు, రోడ్లు నిర్మాణానికి రూ.31లక్షలు నిధులు మంజూరు చేశామని అవి కూడా త్వరలో పూర్తికానున్నాయన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు సి ఎం మంజూరు చేశారన్నారు. నగరంలో సమస్యలు లేని సుందర నగరంగా అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపాన మల్లేశ్వరరావు, మడ్డి అప్పలరాజు, సీపాన రమ, నాగభూషణపట్నాయక్, పెద్దింటి తవిటిరెడ్డి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎం.వి కృష్ణారావు మృతికి వైసీపీ సంతాపం
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 16: మాజీ ఎమ్మెల్యే ఎం.వి కృష్ణారావు ఆకస్మీక మరణం పట్ల శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈసభలో మాజీ మంత్రి, వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, కెవిజి సత్యనారాయణ, గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, జోగారావు, తాతబాబు, నాగేశ్వరరావు, పేడాడ అశోక్, ఆర్. ఆర్ మూర్తి, జోగారావు, ఆర్.చిట్టిబాబు, పాలిశెట్టి మధు తదితరులు ఉన్నారు.