శ్రీకాకుళం

ప్రభుత్వ లక్ష్య దిశగా విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: 26 గ్రామాల్లో సర్వే...21,353 కుటుంబాల్లో చైతన్యం.. విద్యార్ధుల మాటలు నమ్మి 10448 మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటామంటూ నిర్ణయించుకున్నారు. ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు అందించిన వెంటనే వారికి కావల్సిన సదుపాయాలు, నిధులు అందించి ఒకేసారి పదివేలకుపైగా మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించిన చైతన్యం..అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్ధులు తీసుకువచ్చారు. వచ్చే నెలాఖరులోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు పరుగులుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ కూన రాంజీ ఓడీఎఫ్ లక్ష్యాలు పూర్తి చేసేందుకు విద్యార్థినీవిద్యార్ధులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచి, వాటి ఆవశ్యకత తెలుపుతూ సర్వేలు నిర్వహించేందుకు సహాకారాన్ని ఇటీవలే కోరారు. దీంతో అంబేద్కర్ యూనివర్సిటీ పి.జీ.విద్యార్థినీవిద్యార్ధులు పైలట్ ప్రొగ్రాంగా ఎచ్చెర్ల మండలంలో ఓడీఎఫ్‌పై చైతన్య సదస్సులు నిర్వహిస్తూ, ఇంటింటికీ వెళ్ళి అక్కడ గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వ్యక్తిగత మరుగుదొడ్లు స్వచ్చందంగా ప్రజలు నిర్మించుకునే వాతావారణాన్ని కల్పించేలా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో 13వ స్థానంలో గల శ్రీకాకుళం జిల్లాను ఓడీఎఫ్ లక్ష్యాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయకపోతే సి.ఎం. లక్ష్యాలు నెరవేర్చని అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తానని, కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేస్తానంటూ పదేసార్లు వీడియోకాన్ఫరెన్స్‌ల్లో హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి లక్ష్యాలను చేరుకోవాలంటే యువత భాగస్వామ్యం అవసరం అంటూ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన శైలిలో పి.జి. విద్యార్థినీవిద్యార్ధులచే గ్రామాల్లో ఓడీఎఫ్ లక్ష్యాల కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తూ, సర్వేలు చేయిస్తున్నారు. జిల్లా యంత్రాంగానికి కావల్సిన సహాయసహకారాలు అందించేందుకు అంబేద్కర్ యూనివర్సిటీ పి.జి. విద్యార్ధులు ముందుకు రావాలంటూ వైస్‌ఛాన్సలర్ పేర్కొనడం, అంతకుముందే, విద్యార్ధులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రాయితీలు, ఫీజు రీయాంబర్స్‌మెంటు వంటి సహాయసహాకారాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓడీఎఫ్ లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగానికి విద్యార్ధులుగా తమవంతు సాయం అందించాలని కోరిన వెంటనే గ్రామాల్లో చైతన్యయాత్రలు విద్యార్ధులు ప్రారంభించారు. 26 గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. 21,353 కుటుంబాలను కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలంటూ వారిని చైతన్యపరిచారు. ఓడీఎఫ్ వల్ల గ్రామాలకు జరిగే ప్రయోజనాలు వివరించారు. దీనివల్ల 10448 కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు విద్యార్ధులతో అంగీకారం తెలిపి, ఆ దిశగా పనులు ప్రారంభించారు. అందుకు జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఆ విద్యార్ధులు ఒప్పించిన కుటుంబాలతో, ఆయా గ్రామాల్లో సంబంధిత అధికారులను పంపి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కావల్సిన నిధులు, ఇతర అంశాలను పూర్తి స్థాయిలో సమకూర్చేలా చేసారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చేపట్టే ఈ దంగల్‌లో జిల్లా యంత్రాంగంతోపాటు పాల్గొనేందుకు సంసిద్ధం కావడం అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్ధుల చొరవకు కలెక్టర్ అభినందించారు. అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూన రాంజీ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ 124 డిగ్రీ కాలేజీల విద్యార్ధులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తమ సేవలు అందిస్తున్నారన్నారు. సుమారు 60000 మంది విద్యార్థినీవిద్యార్ధులు ప్రభుత్వం గుర్తింపుపొందిన కాలేజీల్లో చదువుతున్నారని, వీరంతా గ్రామీణ ప్రజలకు చైతన్యపరిచేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ఆశించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ రోజుల్లో సాధ్యపడుతుందన్నారు. అలాగే, ప్రతీ విద్యార్థి తమ కుటుంబాలను చైతన్యపరిచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పట్టుబట్టి ఒప్పిస్తే సర్కార్ ఆశించిన లక్ష్యాలను మార్చి నెలాఖరులోగా జిల్లాలో ఓడీఎఫ్ పూర్తి కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో విద్యార్ధులు, అధ్యాపకులతోపాటు గ్రామ సర్పంచ్‌లు, ఎం.పి.టి.సీ.లతో అంబేద్కర్ యూనివర్సిటీలో ఓడీఎఫ్‌పై ఇటీవల నిర్వహించిన సదస్సు వల్ల చాలా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రజలు ముందుకువచ్చారని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా సర్పంచ్‌లు, ఎం.పి.టి.సి.లు చెప్పేమాటలకు ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఒప్పించగలిగిన సామర్థ్యాన్ని వారికి యూనివర్సిటీ, డిగ్రీ కాలేజీ అధ్యాపకులు నూరిపోసినట్టయితే - ఈ లక్ష్యం జిల్లాలో ఎప్పుడో పూర్తి అయ్యేదని, ఇప్పటికైనా విద్యార్ధుల్లో గల ఆ సేవా దృక్పథం, సర్కార్ అడిగిన లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన వారిని నాలుగుగోడల మధ్య తరగతి గదుల కంటే గ్రామాల్లో ఫీల్డ్‌వర్క్ చాలా విజ్ఞానాన్ని ఇస్తుందన్న వాస్తవాన్ని గమనించి, విద్యార్ధులు ఓడీఎఫ్ లక్ష్యాలు చేరుకోవడానికి పరుగులుపెడుతున్నారని వివరించారు. అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్ధులు నిర్వహించిన సర్వేల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓడిఎఫ్‌పై నివేదికలు సమర్పించినట్టు చెప్పారు. ఈ లక్ష్యాలు చేరుకునేందుకు గ్రామాల్లో గల కొన్ని అవంతరాలు ఈ నివేదికలు ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు వివరించారు. కుటుంబాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సుముఖతగా ఉన్నప్పటికీ, అక్కడ మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం లేని పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, మరుగుదొడ్లకు శుభ్రంగా మెంటినెన్స్ చేసేందుకు కావల్సిన నీటి వనరులు అందుబాటులో గ్రామాల్లో లేవన్నది మరో అంశంగా అంబేద్కర్ యూనివర్సిటీ పి.జి.విద్యార్ధులు సర్వేల ద్వారా వెల్లడైంది. కనీసం దగ్గర ప్రాంతాల్లో కూడా నీటిసదుపాయం లేకపోవడంతోనే మరుగుదొడ్లు ఇంటిలో నిర్మించుకునేందుకు గ్రామాల్లో ప్రజలు నిరాకరిస్తున్నారన్న అంశాలు విద్యార్ధులు సుస్పష్టం చేసారు. అలాగే, నిర్మాణం చేసిన మరుగుదొడ్డికి ప్రభుత్వం ఇస్తానన్న 15000 రూపాయలు సకాలంలో చెల్లింపులు చేయలేకపోవడం వల్లే చాలా వరకూ ఓడీఎఫ్ లక్ష్యాలను మోకాలడ్డుతున్నాయన్నది మరో అంశంగా విద్యార్ధులు గమనించి నివేదికల్లో పొందుపర్చారు. అందుకే 2.80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేయాల్సివుండగా, కేవలం 1.5 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలే ఇప్పటికీ పూర్తి అయ్యాయని, ఇందుకు గ్రామీణ ప్రజల చైతన్యలోపం కంటే - ప్రభుత్వం తీసుకునే చర్యల్లో జాప్యమే ఎక్కువ అంటూ విద్యార్ధులు నివేదికలు తేటతెల్లం చేసాయి!! ఇలా..పొందూరుఖాదీ పరిశ్రమ, వంశధార నిర్వాసిత కాలనీల్లో వౌలిక వసతులు, మత్స్యకారుల తీరంలో ఖనిజసంపద వివరాలు, జనథన్ ఖాతాలు, నగదురహిత లావాదేవీలు వంటి అంశాలపై వర్సిటీలో 17 కోర్సులకు చెందిన విద్యార్ధులు ప్రతీ శనివారం గ్రామాల్లోకి వెళ్ళి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నివేదికలు ఎప్పటికప్పుడు సి.ఎం.వో.కి పంపుతున్నారు!!