శ్రీకాకుళం

శిర్లియాత్ర మహోత్సవం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలో శుక్రవారం శిర్లియాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యజ్ఞకర్త ఎస్.వి. ఎల్. ఎన్.శర్మయాజీ ఆధ్వర్యంలో జరిపిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీకృష్ణా సేవా సంఘం, బాపూజీ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో వ్యవసాయాధికారి మృతి
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 23: స్థానిక వ్యవసాయాధికారిగా గత కొనే్నళ్ల నుంచి పాలకొండలో విధులు నిర్వహిస్తున్న జి.రవి (45) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందినట్టు ఆయన బంధువులు తెలిపారు. గత కొనే్నళ్లుగా హైదరాబాద్ ఆసుపత్రిలో ఈయన చికిత్స పొందుతున్నారు. ఈయన మృతి పట్ల స్థానిక అధికారులు, వ్యవసాయశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
చట్టాలపై అవగాహనా బైక్ ర్యాలీ
యువత తరలిరావాలి
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 23: సమాజ శ్రేయస్సులో భాగంగా ప్రతి ఒక్కరు చట్టాలను తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన అవగాహనా ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి, పాలకొండ ఇన్‌చార్జి న్యాయమూర్తి బి.కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. న్యాయసేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో భారతదేశపు చట్టాలపై ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాలకొండ నుంచి సీతంపేట, కొత్తూరు, హిరమండలం మీదుగా పాతపట్నం వరకు నిర్వహిస్తున్న ఈ ద్విచక్ర వాహన ర్యాలీ కార్యక్రమంలో పోలీస్ యంత్రాంగం, న్యాయవాదులు పాల్గొంటారన్నారు.
* 12 అంశాలను తెలుసుకోవాలి...
సమాజ భద్రత కోసం న్యాయపరంగా ఏర్పాటు చేసిన 12 అంశాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం, స్ర్తిలను గృహహింస చేయడం, బాల్య వివాహం వ్యతిరేకించడం- నిర్వహించడం, బాల బాలికలను కార్మికులుగా నియమించడం, వన్యప్రాణులను హింసించడం, భ్రూణహత్యలకు పాల్పడడం వంటివి నేరాలని, అలాగే జనన, మరణ ధ్రువీకరణ, వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, ధ్రువపత్రాలు కలిగి ఉండకపోవడం,, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటివి చట్టరీత్యా నేరమని అలాగే దేవదాసి ఆచారం నిషేధించబడిందని వెల్లడించారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండడం ద్వారా నేరాలు సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు.
కల్వర్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు
ప్రయాణికులు సురక్షితం *తప్పిన పెను ప్రమాదం
హిరమండలం, ఫిబ్రవరి 23: మండలంలోని హిరమండలంలోని కోరాడ కాలనీ సమీపంలో ఎబి రహదారి పక్కన కల్వర్టును శుక్రవారం ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గుణుపూరు నుంచి హిరమండలం వైపు వస్తున్న ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని లోతైన ప్రాంతంలో ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులై బయటకు దూకారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలియవచ్చింది. రహదారి మధ్యలో బస్సు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న హిరమండలం పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని వాహనాలను వేరే మార్గాలు ద్వారా మళ్లించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.