శ్రీకాకుళం

సిక్కోలు గుండె చప్పుడు ఎర్రన్నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: సిక్కోలు గుండె చప్పుడు ఎర్రంనాయుడు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ఎర్రన్న 61వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అంత ఎత్తుకు ఎదిగిన నేత ఎర్రన్న అని 1989లో ఎన్టీ ఆర్ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగి సత్తా చాటి హరిశ్ఛంద్రపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఆయనకే సొంతమన్నారు. ఎన్ డి ఏ -1,2 కేబినెట్‌లలో తనదైన హవా కొనసాగించిన నేత ఎర్రన్న అని గుర్తు చేశారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజల హృదయాల్లో నాన్నగారి స్థానం సుస్ధిరమన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి అవకాశాలను వినియోగించుకుని ఎదిగిన వైనం నవతరం నాయకులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన బాటలో నడిచి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తెలంగాణా సి ఎం కేసి ఆర్ కూడా ఎర్రన్న సేవలు ఇప్పటికే గుర్తు చేసుకుంటారన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు సిద్ధిపేటకు రూ.100కోట్ల మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన ఘనత ఎర్రన్నదే అన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నేత ఆయనే అని ఎర్రన్న ఆశయసాధనకు శ్రమిస్తారన్నారు. సత్యం కోసం పోరాడి నిలిచిన నేతగా నాన్నగారు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రన్నాయుడు అని ఓ ఆంధ్రుడిగా ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి పార్టీలకు అతీతంగా నేతల మన్ననలను అందుకున్నారన్నారు. హోదాతో గుర్తింపు రాదని అది ఓ అలంకారం మాత్రమేనని వ్యక్తి వ్యవహారశైలికి అనుగుణంగానే గుర్తింపు వస్తుందన్నారు. కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ సమర్ధత ఉన్న నేతగా జాతీయ స్థాయిలో ఎర్రన్నకు మంచి పేరు ఉందన్నారు. ఆయన జయంతిని, వర్ధింతిని అధికారిక కార్యక్రమాలుగా ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన స్ఫూర్తిని రేపటి తరం తప్పకు అందుకోవాలని కోరారు. జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు మాట్లాడుతూ స్వశక్తితో రాణించి ఉన్నత పదవులు అందుకున్న నేత ఎర్రన్న అని కితాబిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేశారని ఉద్దానం, శాలిహుండాం మంచినీటి పథకాలకు నిధులు తెచ్చి చిరస్థాయిలో నిలిచిపోయేలా ఆయా ప్రాజెక్టు రూపకల్పనకు దోహదపడ్డారన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ఎర్రన్న పేరిట జిల్లా ప్రలజంతాగుర్తించుకునేలా ఓమంచి కార్యక్రమాలకు శ్రీకారం దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, టీడీజీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తొలుత భారతీ రమేష్, ప్రధాన ఆదినారాయణ ఆలపించిన గీతాలు సభకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్ల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి ఆర్.వేణుగోపాల్, నిమ్మకు జయరాజ్, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఆర్డివో దయానిధి, సి బి ఎస్ ఆర్ వి జిల్లా దళపతి రేష్మాప్రసాద్, నౌపాడ సత్యనారాయణ, పోలుమహంతి ఉమామహేశ్వరరావు, డబ్బీరు వాసు, ఆర్‌వి ఎన్ శర్మ, మాదారపు వెంకటేష్, జామి భీమశంకరరావు, చిట్టి నాగభూషణం, సాదు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
ఎర్రన్న జయంతిలో విద్యార్ధుల రక్తదానం
జలుమూరు, ఫిబ్రవరి 23: చల్లవానిపేట వంశదార డిగ్రీ కళాశాల విద్యార్ధులు దివంగత ఎర్రంనాయుడు 61వ జన్మదినం సందర్భంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని ముందుగా ఎన్టీ ఆర్, ఎర్రంనాయుడు చిత్రపటాలకు పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రాష్ట్రానికే మకుటంలేని మహారాజు ఎర్రంనాయుడు అని ఆయన లేకపోయినా ఆయన జన్మదిన వేడుకలు వాడవాడలా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. ముందుగా విద్యార్ధులు అభినందించారు. విద్యార్ధి దశలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టం ఆనందంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.మోహనరావు, ఏ ఎం సి అధ్యక్షులు వెలమల చంద్రభూషణ, జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సాదు చిన్నికృష్ణారావు, మూకళ్ల సత్యం, వెలమల రాజేంద్రనాయుడు, మురళీమోహనరావు, తెలుగుదేశం నేతలు తర్ర బలరాం, మనుకోటి దామోదరరావు, సోంబాబు, పంచిరెడ్డిరామచంద్రరావు, రత్నాలనాయుడు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల పరిషత్ కార్యాలయంలో ఎర్రంనాయుడు చిత్రపటానికి ఎంపీడివో పడాల వాసుదేవరావు జ్యోతిప్రజ్వలన చేసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎర్రన్న ఆశయాలను కొనసాగించాలి
సారవకోట, ఫిబ్రవరి 23: దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రంనాయుడు ఆశయాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని జిల్లా తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి సాదు చిన్నికృష్ణంనాయుడు పిలుపునిచ్చారు. ఎర్రంనాయుడు 61వ జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వౌలిక సదుపాయాల కల్పనకు ఎర్రంనాయుడు ఎనలేని కృషి చేశారన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు వరుదు రాఘవేంద్ర మాట్లాడుతూ ఎర్రంనాయుడు పిలుపుమేరకు తాను రాజకీయాలలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ కార్యదర్శి మూకళ్ల చిన్నయ్య, ఏ ఎం సి ఉపాధ్యక్షుడు రత్నాలనాయుడు, రంగసాగరం నీటి సంఘం అధ్యక్షుడు చిన్నాల మాధవరావు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలంయలో అధికారికంగా జరిగిన ఎర్రన్న జయంతి వేడుకల సందర్భంగా ఎంపిడివో జగదీశ్వరరావు ఎర్రన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ఎర్రన్న జయంతి
రాజాం, ఫిబ్రవరి 23: మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరాపు ఎర్రంనాయుడు 61వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా శుక్రవారం రాజాంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, డిప్యూటి తహశీల్దార్ కృష్ణమూర్తి సారధ్యంలో ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఎంపిడి ఒ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్టీవెన్‌సన్ సారధ్యంలో ఎర్రన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే బొద్దాం, నగర పంచాయతీ కార్యాలయంతో పాటు పలు గ్రామాల్లో ఎర్రంనాయుడు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానాలు, రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

ఘనంగా ఎర్రంనాయుడు జయంతి
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 23: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ కార్యాలయంలో పల్లా కొండలరావు ఆధ్వర్యంలో ఎర్రన్నకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను టిడిపి పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్ కొనియాడారు. అలాగే ఆర్‌డి ఒ కార్యాలయంలో ఆర్‌డి ఒ రెడ్డి గున్నయ్య ఎర్రన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి ఎర్రంనాయుడు జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.