శ్రీకాకుళం

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 17: అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన ఆస్తులను విక్రయించి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం మంగళవారం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. న్యాయస్థానంలో ఈకేసు రోజుకో మలుపు తిరుగుతూ బాధితులను నిరాశ పరుస్తుందని వీరు ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 25న కోర్టువాయిదా సందర్భంగా హైకోర్టు నుండి అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి అనుమతి పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన రూ.3,965కోట్లను రాష్ట్రప్రభుత్వం అడ్వాన్సుగా చెల్లించి అదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా బయట ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని వీరు కోరారు. ప్రతీ జిల్లాలో ఒక వెరిఫికేషన్ కేంద్రం పెట్టి ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్లలో నమోదు కాని బాధితుల బాండ్లను పరిశీలించి జాబితాలో చేర్చాలని కోరారు. తహశీల్దార్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ బాధితులు ఆత్మహత్యకు పాల్పడరాదని విజ్ఞప్తి చేశారు. సమస్యలను శాంతియుత మార్గం న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. బాధితుల సంఘం సమర్పించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు ఖగేశ్వరరావు, వసంతరావు, సాకిపెల్లి రాము, కె.నగేష్, మెండ పాపారావు, ఫల్గుణరావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రమాదాలను ఎలా ఎదుర్కొవాలి?
జలుమూరు, ఏప్రిల్ 17: గ్రామీణ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించేటప్పుడు వాటిని ఎలా ఎదుర్కొవాలని కోటబొమ్మాళి అగ్నిమాపక కేంద్రం ఎస్ ఐ ఆర్.వెంకటరమణ విద్యార్ధులకు వివరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చల్లవానిపేట విజ్ఞాన దుర్గ హైస్కూల్ విద్యార్ధులకు పలు విన్యాసాలు, ప్రదర్శనల ద్వారా వివరించారు. మీ గ్రామాల్లో ప్రమాదం జరిగిన మరుక్షణమే మంటలను అదుపు చేయడం, మనుషులను రక్షించాలనే పలు అంశాలపై విద్యార్ధులకు అవగాహనకల్పించారు. విద్యార్ధులచే కొన్ని విన్యాసాలను చేయించారు. ఆయనతోపాటు సిబ్బంది, పద్మ ,విద్యార్ధులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఆందోలన
జలుమూరు, ఏప్రిల్ 17: మండల పరిధిలో ఉన్న పలువురు అగ్రిగోల్డ్ ఏజెంట్లు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోలన చెపట్టి డి.టి నారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఏజెంట్ల వద్ద ఇటీవల కాలంలో పోలీసులు ఖాతాదారుల నుండి అనేక సమాచారాలు సేకరించారు. ఎంతో నిరాశతో ఉన్నవారిలో కొంత ఆశలు చిగురించాయి. వివరాలు సేకరించి ఏడాది అవుతున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం రాలేదని వాపోయారు. ఖాతాదారులకు, ఏజెంట్లకు తగాదాలు జరుగుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మధుకేశ్వరుని దర్శించుకున్న ప్రముఖులు
జలుమూరు, ఏప్రిల్ 17: శ్రీముఖలింగం గ్రామంలో కొలువైయున్న మధుకేశ్వరస్వామి తెలంగాణా రాష్ట్రం పొల్యూషన్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణరెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రధాన దేవాలయం మండపంపై వారి కుటుంబానికి అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. ఆలయ ప్రాంగాణంలో ఉన్న శిల్ప సంపదను తిలకించారు. వారాహి అమ్మవారిని దర్శించి పూజలు చేపట్టారు. డి.టి నారాయణరావు, విజయబాబు తదితరులు ఉన్నారు.