శ్రీకాకుళం

జూలై 15 నాటికి వరినాట్లు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 17: రాబోవు ఖరీఫ్ సీజన్‌లో నెల రోజుల ముందుగా వరినాట్లు వేయడం లేదా ఎద సాగు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు ఏడి సత్యవతి స్పష్టంచేశారు. ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక సదస్సులను మంగళవారం మదనాపురం, జరాలీ తదితర గ్రామాలలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ ఖరీఫ్ పంట దశలో వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులకు , విపత్తులకు గురౌతున్న నేపధ్యంలో వీటి భారి నుండి ఖరీఫ్ పంటను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ముందస్తుగా వరినాట్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పంట చివరి దశలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు కూడా ముందస్తు ప్రణాళిక ప్రక్రియ ఉపయోగపడుతుందని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖాధికారి మురళీధర్ మాట్లాడుతూ వరి వంగడాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనశుద్ధి మున్నగు అంశాలను సోదాహరణంగా వివరించారు. భూసార పరీక్షా ఫలితాల మేరకు అవసరమైన ఎరువులను వాడాలని ఆయన స్పష్టంచేశారు. జింక్ సల్ఫేట్ ను వరినాట్లువేసే సమయంలో పంట పొలాలలో వేయాలని కోరారు. ఈ సదస్సులలో పలువురు రైతులు మాట్లాడుతూ నూతన వరి వంగడాలను సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు.