శ్రీకాకుళం

ఆదిత్యుని కొబ్బరిచెక్కల వేలం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మే 13: ఆదినారాయణుడుగా ప్రసిద్ధికెక్కిని ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం కొబ్బరి చెక్కల వేలం మళ్లీ వాయిదా పడింది. ఈనెల 13వ తేదీన నిర్వహించిన తలనీలాలు, కొబ్బరి చెక్కల వేలంలో తలనీలాలకు వేలం ఖరారు కాగా కొబ్బరి చెక్కలకు 11.30 లక్షల రూపాయలకు వెల్లడంతో దేవస్థానం అధికారులు కనీసం 13 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశించి వేలం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం నిర్వహించిన ఈ వేలంనకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు ఐదుగురు వ్యక్తులు మాత్రమే వేలంలో పాల్గొనగా, వారంతా సిండికేట్ అయి ఎనిమిది లక్షల రూపాయలకు మాత్రమే పాట పాడటం విశేషం. కనీసం మొన్నటి వేలం పాటకు సరిసమానంగా పాడినా వేలం ఖరారు చేద్దామనుకున్న ఆలయ అధికారులకు గుత్తేదారులు సిండికేట్‌గా మారి ఝలక్ ఇచ్చారు. ఒకే పర్యాయం ఎనిమిది లక్షల రూపాయలు చెప్పి అనంతరం ఏ ఒక్కరూ ఒక్క పైసా అధికంగా పాడటానికి ముందుకు రాకపోవడం వెనుక వారి సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. దీనిని పసిగట్టిన ఆలయ అధికారులు పాటను మళ్ళీ వాయిదావేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్యామలాదేవి, పూర్వపు ఈవో ప్రసాద్ పట్నాయక్, సిబ్బంది మృత్యంజయరావు, కొండలరావు, రమణమూర్తి పాల్గొన్నారు.