శ్రీకాకుళం

సహజ వ్యవసాయంపై ముగిసిన శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 13: సహజ వ్యవసాయంపై నిర్వహించిన మూడు రోజుల శిక్షణాకార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. జిల్లా స్థాయిలో పదిక్లస్టర్లు, ఆరు డివిజన్లకు చెందిన ఏడిఏలు, ఏవోలు, ఏఇవోలు, ఎంఇ వోలు, సిఆర్‌పి, సిఏలు, బెస్ట్ ఫార్మర్స్‌లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ జెడి జి.రామారావు మాట్లాడుతూ సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్తత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందన్నారు. రసాయన ఎరువుల వినియోగం వలన భూమి నిస్సారవంతమవడంతోపాటు అనేక రకాల వ్యాధులకు కూడా గురవుతున్నారన్నారు. ఈనెల 16 నుండి గ్రామస్థాయిలో సహజ వ్యవసాయంపై శిక్షణ నిర్వహించనున్నట్టు తెలిపారు. 19న గ్రామస్థాయి యాక్షన్‌ప్లాన్ తయారు చేయనున్నారు. జిల్లాలో 9 మండలాలు, పది క్లస్టర్లు, 50 గ్రామాలను ఎంపిక చేసి సుమారు 3వేల మంది రైతులతో 2500 ఎకరాల్లో సహజ వ్యవసాయం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దీనిని అందరు రైతులు ముందుకు వచ్చి ఆచరించాలన్నారు. ప్రారంభంలో కొంత దిగుబడి తగ్గినప్పటికీ రానురాను దిగుబడి పెరుగుతుందన్నారు. ముందుగా జింక్‌లోపం ఎరువులకు పచ్చిరొట్ట ఎరువుల పెంపకం, వర్మీకంపోస్టు, అజోల్లా వంటివి వేసుకుంటే భూమి సారవంతం అవుతుందన్నారు. సుభాష్ పాలేకర్ అవలంబించిన ప్రకృతి వ్యవసాయంపై కూడా రైతులు దృష్టిసారించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి మాస్టర్ ట్రైనీలుగా డిపిఎం కె.రత్నకుమారి, ఏపిఎం బాబూరావు, కృషివిజ్ఞాన కేంద్రం శాస్తవ్రేత్త అనీల్‌కుమార్, డాట్స్ శాస్తవ్రేత్త చిట్టిబాబు, భూదేవి, ఎఫ్‌టిసి ఏడి శ్రీ్ధర్, ఎఫ్‌టిసి డిడి శివప్రసాద్‌లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆరు డివిజన్‌లకు చెందిన, ఏడిఏలు, 9మండలాలకు చెందిన ఏవోలు, ఎంపిఇవోలు, సిఆర్‌పి, సిఏలు పాల్గొన్నారు.