శ్రీకాకుళం

2019లో జనసేన జెండా పాతి తీరుతాం: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మే 22:2019 ఎన్నికలలో ధర్మపోరాటంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి రాష్ట్ర అధికార పగ్గాలు చేపడతామని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ జనసేన నాయకులకు భరోసా ఇచ్చారు. మంగళవారం జనసేన అధినేత పవన్ కాశీబుగ్గ హరిశంకర్ థియేటర్ నుంచి బస్టాండ్ వరకు ప్రత్యేక హోదా సాధనకై నిరసన కవాతు నిర్వహించి, జనసేన యాత్రలో భాగంగా ప్రత్యేక రథం నుంచి ప్రజలను ఉద్దేశించి ఆవేశభరితంగా మాట్లాడి జనసేన అభిమానుల్లో ఉత్తేజం నింపారు. ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని, కాదు కాదు ప్రత్యేక హోదా కావాలని మాటమార్చడం తాను మరిచిపోలేదని, తాను కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించే ముందు బీజెపీకి ముందుగా మోకారిల్లింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాకు ఎవరు తీసుకువచ్చింది చంద్రబాబు కాదా అని అన్నారు. 2014 ఎన్నికలలో తమ అండతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, రౌడీయిజం, భూకబ్జాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. పలాసలో జీ ఎస్‌టి ట్యాక్స్‌తోపాటు అల్లుడు ట్యాక్స్ కూడ కట్టాలని, తెలుగుదేశం హాయంలో 19 ఏళ్లు ముక్చుపచ్చలారని యువకుడును పొట్టనపెట్టుకున్నారని, ఆ పాపం అందరికి తగులుతుందని ఆవేదన వ్యక్తం చెందారు. శ్రీకాకుళం పోరాటాల పురిటిగడ్డ అని, అందుకే తన పోరాటాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించానని, శ్రీకాకుళం అంటే తనకు గొప్ప మమకారమని, ఉత్తరాంధ్ర కళాకారులకు నిలయమని, కష్టాలు ఉన్న దగ్గరే కళాకారులు పుడతారని, ఉత్తరాంధ్రలో తాను కళాకారుడుగా ఓనమాలు తీర్చుకున్నానన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిందనే కన్నా పాలకులు నిర్లక్ష్యంతోనే అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని చూస్తే జనసేన భయపడదని, తాట తీస్తామని హెచ్చరించారు. సమాజంలో శాంతి కోసం కత్తిని పట్టుకోవాల్సిన అవసరం వస్తుందని, అందుకు జనసేన సిద్దమన్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీలో రౌడీయిజం, భూకబ్జాలు ఉంటే నేడు పలాసలో కొనసాగుతున్నాయన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. అభిమానులు తమ ఇళ్లుకు సురక్షితంగా చేరాలని కోరారు. ఈ సమావేశంలో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, జనసేన నాయకులు సుజాతపండా, దుర్గారావు, శివ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనిషి శివాజీ
పలాస, మే 22:ప్రజల మనిషి శివాజీ అని ఎ ఎంసి అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు, పలాస ప్రభుత్వాసుపత్రి కమిటీ అధ్యక్షుడు గాలి కృష్ణారావులు అన్నారు. మంగళవారం పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందరశివాజీ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కేక్‌ను కట్ చేసి పలాస ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, కాశీబుగ్గ సీతారామాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శివాజీ నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. అటువంటి నాయకులు పలాస నియోజకవర్గ ప్రజలకు లభించడం అదృష్టమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ప్రజా సమస్యల పరిష్కారానికి దీక్షలు బూనిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పలాస మున్సిపల్ వైస్‌చైర్మన్ సూర్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు లోడగల కామేశ్వరరావు, టీడీపీ నాయకులు పుట్టా లోకనాధం, కె.సురేషుకుమార్, అబ్దుల, పాండు తదితరులు పాల్గొన్నారు.