శ్రీకాకుళం

పశు సఖి ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, మే22 : రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి గాను అనేక పథకాలు ద్వారా కృషి చేస్తుందని దీనిలో భాగంగా మహిళా స్యయం శక్తి సంఘాలు ద్వారా విస్తరింపజేసే దిశగా చర్యలను చేపడుతుందని పశు సంవర్ధక శాఖ ఏడీ కె.రాజ్‌గోపాల్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని వెలుగు కేంద్రంలో ఏర్పాటుచేసిన పశుమిత్ర సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు అభివృద్ధికి గాను గోపాల మిత్ర తదితర సంఘాల సహకారాన్ని తీసుకోవడం జరిగుతుందని, దీనిలో భాగంగా మహిళా సంఘాలు ద్వారా మరింత అభివృద్ధి చేసేందుకుగాను ప్రణాళికలుకు గాను రూపొందిస్తున్నారని వివరించారు. ప్రతీ గ్రామంలో పశుమిత్రలకు పాడి పరిశ్రమలపై ప్రతీ మండలంలో 30 నుండి 50 మందిని నియమించి తగు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వెలుగు కో ఆర్డినేటర్ ఎస్.రాజకుమార్, ఏపీ ఎం బి.మల్లేశ్, పశువైద్యాధికారులు లక్ష్మణరావు, సంతోష్‌కుమార్, షణ్ముఖరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎ.కల్పన తదితరులు పాల్గొన్నారు.

హిందూ పరిరక్షణ కోసమే పాదయాత్ర
* లక్ష్మీపతి స్వామిజీ
నరసన్నపేట, మే22 : హిందూ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కర్ణాటకకు చెందిన లక్ష్మీపతి స్వామీజీ తెలిపారు. మంగళవారం తమ పాదయాత్రలో భాగంగా స్థానిక వేంకటేశ్వర ఆలయానికి విశ్రాంతి తీసుకోవడానికి గాను విచ్చేసారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ పచ్చబొట్లు స్వామీజీగా బుడితిలో పేరుగాంచడం జరిగిందని గత 2016 జూన్ 16వ తేదీన బుడితి గ్రామం నుండి ఇచ్ఛాపురం వరకు హిందూ పరిరక్షణ కోసం పాదయాత్రను చేపట్టానని పేర్కొన్నారు. తాను యమధర్మరాజుకు పూజలు చేసినవారిలో తానొక్కడేనని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఇచ్ఛాపురంలో బయలుదేరిన ఆయన రెండు నెలలు తర్వాత తిరుగు ప్రయాణంలోస్థానిక నరసన్నపేటకు చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వేంకటేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు రేగేటి రామాచార్యులు పాల్గొన్నారు.