శ్రీకాకుళం

మహిళా సంఘాలకు కాంక్రీటు మిల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, మే 13: మహిళల్లో మరింత ఆర్థిక పరిపుష్టి పెంచేందుకు ప్రతీ మహిళా సంఘానికి లక్ష రూపాయలు విలువ చేసే కాంక్రీటు మిల్లర్లను పంపిణీ చేయనున్నట్టు డిఆర్‌డిఏ పిడి ఎస్.తనూజారాణి తెలిపారు. శుక్రవారంస్థానిక ఐకెపి కార్యాలయం వద్ద నిర్వహించిన మహిళా సంఘాల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల వరకు సిసి రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ రోడ్లు పనుల కోసం కాంక్రీటు మిల్లర్లకై బాగా డిమాండ్ ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలకు జీవనోపాధి పథకాల్లో భాగంగా ఈ మిల్లర్లు ఎంపిక చేశామని ఆమె తెలిపారు. మిల్లర్ల నిర్వహణ వల్ల ఆయా సంఘానికి ప్రతీ నెలా కనీసం రూ.10వేల వరకు ఆదాయం వస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రతీ మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ వృత్తులలో మహిళలకు శిక్షణ ఇస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రతీ మండలంలోనూ మహిళలకోసం డ్వాక్రా బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రోజారాణి, ఐసిడిఎస్ పివో నళినిదేవి, తహశీల్దార్ శ్రీరాములు పాల్గొన్నారు.