శ్రీకాకుళం

తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే విశ్వాసాన్ని కోల్పోతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 22 : ప్రజలను తప్పు త్రోవ పట్టించేందుకు ప్రయత్నిస్తే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారని నగర ప్రచార కార్యదర్శి గుర్తు చిన్నారావు, అబ్దుల్ షాజహాన్, నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దిన్, అబ్దుల్ రెహమన్, బహుదూర్ బాషాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాల్లో అవినీతి లేని ప్రజాసేవ చేస్తూ ప్రజా విశ్వాసం పొందితే ప్రజలు సంతోషిస్తారన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను మభ్య పెట్టడానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత కిషోర్ లాంటి వ్యూహ కర్తలు ఈవెంట్ మేనేజర్లతో ప్రజలను తప్పు త్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. అవినీతి నాయకుడు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపి నాయకులు రాజకీయాల్లో అందరూ అవినీతి పరులే అనే అభిప్రాయాన్ని కలిగించడానికి గుండ దంపతులపై బురద చల్లితే గత 40 ఏళ్ల నుండి మచ్చ లేని రాజకీయాల్లో పనిచేయడం వలన వీరి గూర్చి ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజల్లో ఇఫోరియా కలిగించడానికి లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకున్న ఎవరికీ అభ్యంతరం లేదని తప్పుడు సమాచారంతో యాడ్స్ ఇవ్వడం ఘోరమని పేర్కొన్నారు. ఇటీవల మాజీ మంత్రి ధర్మాన పాదయాత్ర, జన్మదినోత్సవాల్లో యాడ్స్‌లో చనిపోయిన షేక్ గౌనుద్దీన్ తండ్రి బదురుద్దీన్, ఆలీ ఉస్మాన్, ఉరఫ్ వౌళాలి ఫోటోలతో పాటు ప్రముఖ నాయకుల డ్రైవర్ల ఫోటోలు, రౌడీ షీటర్ల ఫోటోలు ఉండటం మాజీ మంత్రి ధర్మాన గౌరవాన్ని తెలుసుకున్న ప్రజలు అవహేలన చేస్తారని పేర్కొన్నారు. ఇకనైనా ఫ్లెక్సీల పైన కాకుండా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని టీడీపి నాయకులు తెలిపారు. ఇటీవల ఈ కార్యక్రమాల వెనుక అతిగా ప్రవర్తిస్తున్న మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పద్మావతి తనయుడు స్వరూప్‌ల పాత్రే అని అర్ధమవుతుందన్నారు.