శ్రీకాకుళం

కన్నాకు భారీగా స్వాగత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల,జూన్ 19: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించబడ్డ కన్నాలక్ష్మీనారాయణ మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బుధవారం విచ్చేస్తున్నారు. రెండు రోజులపాటు జిల్లాలో కన్నా పర్యటించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవల్సిన నిర్ణయాలపై ఇక్కడ శ్రేణులతో చర్చించి మరింత ఉత్సాహాన్ని నింపనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుండి భారీగా స్వాగతం పలికి కారులు, ద్విచక్రవాహనాలతో శ్రీకాకుళం నగరంలోని ర్యాలీ నిర్వహించేలా ఆపార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసారు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్, రామలక్ష్మణ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా పాలకొండ రోడ్ నుంచి దత్తాశ్రమం వద్ద ఉన్న ఓ కనె్వన్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించేందుకు క్యాడర్ అన్ని ఏర్పాటు పూర్తి చేసారు. పార్టీ అభిమానుల్లో జోష్ నింపేలా దారి పొడగునా భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పోటా పోటీగా ఏర్పాటుచేసి కాషాయంతో సిక్కోలును సుందరంగా అలంకరించారు.
కన్నా పర్యటన ఇలా:
9.30 గంటలకు విశాఖలో రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్‌తోబయలుదేరి 10.30 గంటలకు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. 4 గంటలకు జిల్లా బీజేపీ పార్టీ కార్యాయలంలో ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొంటారు. 5గంటలకు పార్టీ నేతలతో ముఖాముఖి నిర్వహించి పార్టీ సమస్థాగత నిర్మాణంపై సమీక్షిస్తారు. అక్కడ నుండి పాలకొండ చేరుకొని ఎస్సీ కాలనీలో రాత్రి భోజనం చేసి శ్రీకాకుళంలో బస చేయనున్నారు. 21వ తేదీన గురజాడ విద్యా సంస్థల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
అలాగే పెద్ద రెల్లివీధిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. 10.30 గంటలకు మీడీయా మిత్రులతో సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 11.30 నుంచి సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి హాజరవుతారు. 5 గంటల నుంచి పార్టీ సభ్యులతో రాత్రి 8 గంటల వరకు సమీక్ష నిర్వహించనున్నారు. 22 ఉదయం విజయనగరం బయలుదేరనున్నారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో స్పష్టం చేసాయి.

జూలై 15కి ప్రాజెక్టును పూర్తి చేయాలి
కొత్తూరు, జూన్ 19: వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని వంశధార ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాజు ఆదేశించారు. మంగళవారం మండలంలోని గూనభద్ర, కర్లెమ్మ ప్రాంతాల్లో జరుగుతున్న వంశధార పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పంతో ఉన్నారన్నారు. ఆయన వెంట ఎస్ ఇ శశిభూషణరావు, ఇ ఇ అప్పలనాయుడు, డీ ఇలు ఉన్నారు.