క్రైమ్/లీగల్

క్వారీ ట్రాక్టర్ బోల్తాపడి క్వారీ కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు,జూన్ 25:మండలం రాపాక పంచాయతీ పరిధిలో గల ఇల్లయ్యగారి పేట సమీపంలోనున్న కొండ క్వారీలో జి.సిగడాం మండలం పాలఖండ్యాం గ్రామానికి చెందిన ట్రాక్టర్ కూలి మాదర్స నాగరాజు (24) మృతి చెందాడు. ఇల్లయ్యగారిపేట కొండ ఆలి త్రినాధ్ క్వారీలో సోమవారం ఉదయం సుమారు 7గంటలకు ట్రాక్టర్ లోడింగ్ చేసారు. ట్రాక్టర్ బయలు దేరే సమయంలో డ్రైవర్ మృతుడు నాగరాజుకు టిఫిన్ చేసేందుకు రమ్మని చెప్పడంతో నాగరాజు ట్రాక్టర్ ఇంజన్ వెనుక ట్రక్కు ముందు భాగంన గల ఇనపరాడ్‌పై నిలుచొని ప్రయాణానికి సిద్దమయ్యాడు. క్వారీ నుండి ట్రాక్టరు పదడుగుల దూరం వెల్లకముందే ట్రాక్టర్ స్పీడ్ పెంచడం వల్ల అదుపు తప్పింది. నాగరాజు కిందకు దూకేయడంతో అదే సమయంలో రాళ్ల లోడ్‌తో ఉన్న ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కు, తొట్టెలో ఉన్న రాళ్లతో సహా మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి కన్నబిడ్డను కోల్పోయి ధీనంగా రోదిస్తూ తల్లడిల్లిన తల్లి కన్నీటి ఘోష హృదయ విదారకంగా చూపరుల హృదయాలను కదిలించాయి. పాలఖండ్యాం గ్రామానికి చెందిన మృతుడు నాగరాజుకు గతేడాది 2017 సంవత్సరంలో నవంబరు నెలలో జి.సిగడాం మండలం యలగాడ గ్రామానికి చెందిన అలేఖ్యతో వివాహం అయింది. ఏడునెలలు దాటకముందే ఏడడుగులు నడిచే వివాహంలో ఏడ్పుల దుర్ఘటన చోటుచేసుకొంది. మృతిని భార్య అలేఖ్య ఆశలు ఈ దుర్ఘటనతో ఆవిరైపోయింది. మృతుని సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి మృతుని బంధువులు చేరుకొన్నారు. సంఘటన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్థానిక ఎస్సై బాలరాజు హాటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించార.