క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 13 : ప్రజా పంపిణీ వ్యవస్ధకు చెందిన బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం రాగా రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అప్రత్తం చేసారు. గురువారం రాత్రి బాలభారతి జంక్షన్ వద్ద మారుతి వ్యాన్‌ను ఆపి పరిశీలించగా అందులో సుమారు 50కేజీల బస్తాలు 36 ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ ముద్దపు సూరిబాబు సరుకు ఓనర్ భోగి శ్రీనివాసరావులను ప్రశ్నించగా అల్లినగరం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రజల వద్ద నుండి ప్రజా పంపిణీకి వినియోగించాల్సిన బియ్యం కేజి బియ్యం 15రూపాయలకు కొనుగోలు చేసి వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించుటకు తరలిస్తున్నట్లు సమాచారం. పి డి ఎస్ బియ్యాన్ని తరలించడానికి వినియోగించిన వాహనాన్ని సీజ్ చేసారు. ఈ ఇద్దరు వ్యక్తుల పై 6 ఎ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.54వేలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో డి ఎస్పి భార్గవనాయుడు, సి ఎ చంద్ర, సి ఎస్ డి టి ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

చీమల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజాం, జూలై 13: రాజాం మండలం కంచరాం గ్రామానికి చెందిన తోలాపి పైడయ్య అనే వ్యక్తి శుక్రవారం చీమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్‌ల సేవల సిబ్బంది రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు సునీత వైద్య సేవలందించారు. జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పైడయ్య ఆ ఫ్యాక్టరీ మూతపడడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

మొగిలివలసలో అతిసార
రాజాం, జూలై 13: రాజాం మండలం అంతకాపల్లి గ్రామ పంచాయతీ మొగిలివలసలో అతిసారం ప్రబలింది. ఇందులో భాగంగా లెంక సిమ్మన్న అనే వ్యక్తి పరిస్థితి ఆందోళనంగా మారడంతో రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. అతనితో పాటు మరికొందరికి ఈ లక్షణాలు ఉన్నట్టు, వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బంది జోక్యం చేసుకొని గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.