శ్రీకాకుళం

ఘనంగా శ్రీశయన ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, జూలై 23: రాజాం పరిసరాల్లోని ఆలయాల్లో సోమవారం ఆషాడంలో వచ్చే శ్రీశయన ఏకాదశని ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారధి ఎండల మల్లిఖార్జున ఆలయం, డోలపేట, ఉమాలక్ష్మీనారాయణ దేవాలయం, ఠాణావీధి, రాజగోపాలస్వామి ఆలయం, రాజయ్యపేట వరదరాజస్వామి ఆలయంతో పాటు అన్ని గ్రామాల్లో ఏకాదశి వ్రతాన్ని పవిత్రంగా నిర్వహించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా
రేగిడి, జూలై 23: మండలంలోని 39 పంచాయతీలకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం ధర్నా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించి తమ డిమాండ్లును ప్రభుత్వానికి తెలియజేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, క్యాజువల్ లీవ్‌లు పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో శంకరరావుకు వినతిపత్రం అందజేశారు.

ఆలయ నిర్మాణానికి రూ.50 వితరణ
పాలకొండ (టౌన్), జూలై 23: స్థానిక ఇందిరానగర్ కాలనీలో నిర్మిస్తున్న పంచముఖేశ్వర స్వామి మందిర నిర్మాణం కోసం రూ.50 వేలు వితరణ అందజేశారు. సోమవారం నగర పంచాయతీ పరిధిలోని ఎం. ఎం.నగర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని తెనే్నటి పార్వతి నిర్వాహకులకు నగదును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందన్నారు. మరికొంతమంది దాతలు సహకరించి నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా కృషి చేయాలన్నారు.

పౌష్టికాహారంతోనే రక్తహీనత నివారణ
సరుబుజ్జిలి, జూలై 23: విద్యార్థులంతా తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా రక్తహీనత నుంచి బయటపడవచ్చునని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్ ఎన్ పాతిన దమయంతి అన్నారు. సోమవారం రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకించి బాలికలు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.్ధనలక్ష్మీ, నర్సింగ్ విద్యార్థులు సుశీల, భవానీ తదితరులున్నారు.
తిలక్ ఆశయాలు ఆదర్శం కావాలి
కొత్తూరు, జూలై 23: భారతీయ జాతీయ ఉద్యమ పితామహుడు బాలగంగాధరతిలక్ ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని మహర్షి విద్యాలయం హెచ్ ఎం రాంబాబు సూచించారు. సోమవారం పాఠశాల ఆవరణలో బాలగంగాధరతిలక్ 162 జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిలక్ ఆశయాలు, ఆదర్శాలు విద్యార్థులు పాటించాలన్నారు. జాతీయ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామానుజన్, రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
కొత్తూరు, జూలై 23: మండల కేంద్రం కొత్తూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. కళాశాల నుంచి కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేసి ర్యాలీ చేశారు. మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం అందించడం లేదన్నారు. కళాశాలలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొని ఉందన్నారు. అలాగే బాలికలకు మరుగుదొడ్లు సదుపాయం లేకపోవడంతో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఎల్. ఉపేంద్ర, జె.అశోక్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
విభజన చట్టం హామీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం
కొత్తూరు, జూలై 23: రాష్ట్ర విభజన చట్టం పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం విఫలమయ్యాయని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాపు సింహాచలం విమర్శించారు. సోమవారం పార్టీ ఆదేశాలు మేరకు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో ఎర్ర జెండాలతో కార్యకర్తలతో ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా తయారయ్యాయన్నారు. అధికారం కోసమే ఇతర పార్టీలు కూడా పాకులాడుతున్నాయన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం పార్టీ నాయకులు, రైస్‌మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి
కొత్తూరు, జూలై 23: ఉపాధి హామీలో పనిచేస్తున్న పంచాయతీలోని క్షేత్ర సహాయకుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర కార్యదర్శి ఎల్.రవి హెచ్చరించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. ఆయన మట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలన్నారు. మిగిలిన ఉద్యోగుల మాదిరిగా పూర్తిస్థాయి వేతనం ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీడీవో ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు.