శ్రీకాకుళం

నియోజకవర్గాలవారీగా మానిఫెస్టోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

( శ్రీకాకుళం)
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గానికి ఒక మానిఫెస్టోతో 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగేందుకు జనసేనపార్టీ నిర్ణయించింది. అందులోభాగంగానే శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు పది మానిఫెస్టోలతో ప్రజల ముందుకు జనసేనపార్టీ వెళ్ళనుంది. ఇందుకుగాను ఆదివారం ఉత్తరాంధ్రజిల్లాల నేతలతో పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విజయవాడలో తన నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పాలకులే కారణమంటూ పవన్‌కళ్యాణ్ ఉద్ఘాటించారు. దేశానికి ఒక మానిఫెస్టో, రాష్ట్రాల వారీగా మానిఫెస్టోలతో జిల్లాలు, నియోజకవర్గాల్లో సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్న ప్రజల మనోభావాల నుంచి తీసుకున్న నిర్ణయమే నియోజకవర్గాలవారీగా ఎన్నికల మానిఫెస్టోలను జనసేనపార్టీ సిద్ధచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఊరూరుకీ ఎవరి సమస్యలు వారికి ఉంటున్నాయని, అలాంటిది రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే మానిఫెస్టో అంటే ఏలా?? అన్న ప్రశ్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆలోచనలకు తట్టడంతో ‘జనసేనతో మార్పు మొదలయ్యింది’ మొట్టమొదటిసారి ఎవరి మానిఫెస్టో వారికే 175 నియోజకవర్గాలకు మానిఫెస్టోలు సిద్ధం చేసేందుకు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నట్టు బోగట్టా. అదే జరిగితే జిల్లాలు, రాష్ట్రాలు ప్రమేయం లేకుండా ఏ నియోజకవర్గంలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల ముందు ప్రజల కోసం ఏర్పాటు అయ్యే ప్రభుత్వం హామీలు ఇవ్వాల్సిందేనన్న దృక్పథం రాజకీయ పార్టీల్లో కలగాలన్న ఆలోచనతోనే ఈ నియోజకవర్గాల మానిఫెస్టోను జనసేనపార్టీ ప్రజల్లోకి తీసుకువస్తున్నట్టు పవన్‌కళ్యాణ్ ప్రకటించడం ప్రాంతీయ, కేంద్ర రాజకీయపార్టీలకు సవాల్‌గా మారింది. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకూ చేసిన పోరాట యాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు వెతలు, పాలకులు ఆ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యానికి గురి చేసింది కళ్ళారా చూసిన పవన్‌కళ్యాణ్ నియోజకవర్గాల వారీ కష్టాలు, నష్టాలు, సమస్యలు పరిష్కారానికి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీలు మారుమూల పల్లెల్లోకి వెళ్ళి ప్రజలు చెప్పేలా నియోజకవర్గాలవారీ మానిఫెస్టోను అమలుకు తీసుకువస్తున్నట్టు పవన్‌కళ్యాణ్ కసరత్తు ఆరంభమైంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యచరణ రూపొందించేలా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో ఆదివారం రాత్రి అమరావతిలో సమీక్ష నిర్వహించిన జనసేనపార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ‘నియోజకవర్గాల మానిఫెస్టో’ విధానానికి తెరలేపారు. ఉత్తరాంధ్రలో 45 రోజులపాటు సాగిన పోరాట యాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యధలు స్వయంగా చూశానని, వారి పడుతున్న వెతలకు పరిష్కార మార్గాలు అనే్వషించేందుకే నియోజకవర్గాలవారీగా మానిఫెస్టోపై ప్రత్యేక స్టడీ సర్వే నిర్వహించేందుకు యువతను భాగస్వామ్యం చేస్తున్నారు.

నేడు ఆదరణ పథకం ఇంటర్వ్యూలు
పోలాకి,జూలై 23: మండల పరిషత్ కార్యాలయంలో ఆదరణ పథకం కొరకు అంతర్జాలంలో నమోదు చేసుకున్న కుమ్మరి,కమ్మరి,కంచరి,స్వర్ణకారులు మంగళవారం ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అలివేలుమంగమ్మ విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం టైలరింగ్, చేనేత పనేలకు సంబంధించి అర్జీలు చేసుకున్న వారు మొత్తం 47మంది సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. అనంతరం మంగళవారం మిగిలియున్న కులాలందరికీ ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి ఆన్‌లైన్ కాపీలతో ఉదయం 10గంటలకు కార్యాలయానికి హాజరుకావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొండు రామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, ఏఎంసీ చైర్మన్ బైరి భాస్కరరావు, వంశధార ప్రోజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటప్పలనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కిల్లివేణుగోపాలస్వామి, సూపరింటెండెంట్ ప్రకాశరావు, ఈవోపీ ఆర్‌డీ రవికుమర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.