శ్రీకాకుళం

జ్వరాలతో రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20 : సాధారణ జ్వరంతో సైతం రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గుతాయని జెసి-2 పి రజనీకాంతారావు అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఆరోగ్యం పట్ల ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతీ గృహంలోని నీటి నిల్వకు ఉపయోగిస్తున్న పాత్రలను వారంలో ఒకరోజు పూర్తిగా ఆరబెట్టాలని సూచించారు. దోమలు మన చుట్టూ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిద్రించేటపుడు దోమతెరలు వాడటం మంచిదని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పాటించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయితీ అధికారి బి కోటేశ్వరరావును ఆదేశించారు. జ్వరాలు సంభవిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే వైద్య అధికారి తో కూడిన వైద్య బృందం గ్రామాల్లో పర్యటించాలని ఆయన స్పష్టం చేసారు. ఎలీసా టెస్ట్‌లో నిర్ధారణ అయినపుడు మాత్రమే డెంగ్యూ వ్యాధి సోకినట్లు గుర్తించాలని ఆయన తెలిపారు. ఎవరైనా డెంగ్యూ వ్యాధి సోకినట్లు తెలియజేస్తే ఏ వైద్య పరీక్షలు చేసారో చూడాలని సాధారణ రక్త పరీక్షలు చేసి డెంగ్యూ వ్యాధిగా గుర్తించడం తగదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ తిరపతిరావు మాట్లాడుతూ సర్ రోనాల్డ్ రాస్ జయంతిని దోమల నియంత్రణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన జ్వరం తగ్గుతుందనే భావం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అది వాస్తవం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రాణహాని జరిగే పనులు చేయరాదని ఆయన కోరారు. వర్షాలు కురుస్తున్నాయని ప్రతీ ఒక్కరు అంటువ్యాధుల పట్ల జాగరూకతతో ఉండాలని ఆయన అన్నారు. జిల్లా మలేరియా అధికారి టి వీర్రాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సమస్యాత్మక గ్రామాల్లో మలేరియా నియంత్రత స్పేయింగ్ ను చేపట్టామన్నారు. ఇప్పటికే మొదటి దఫా పూర్తి చేసామని, రెండవ దఫా ఆగస్టు 1వ తేదిన ప్రారంభమైందని సెప్టెంబర్ 15వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నరేంద్రప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి శ్రీనివాసరావు, డి ఆర్ డి ఎ పిడి డాక్టర్ జిసి కిషోర్‌కుమార్, డి ఇవో ఎం సాయిరాం, జెడ్పి సి ఇవో బి నగేష్, రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె కాంతిమతి, వయోజన విద్యా శాఖ డిడి జి కృష్ణారావు, వ్యవసాయ శాఖ డిడి పిడి రత్నకుమార్, మత్స్యశాఖ జెడి వివి కృష్ణమూర్తి, సర్వశిక్ష అభియాన్ పివో ఎస్ త్రినాధరావు, హౌసింగ్ పిడి ఆర్ వి నర్శింగరావు, వైద్యశాఖాధికారులు డాక్టర్ బి జగన్నాధరావు, డాక్టర్ మెండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక పద్దతుల ద్వారా అధిక దిగుబడులు
ఎల్ ఎన్‌పేట, ఆగస్టు 20: రైతులు ఆధునిక పద్దతులు అవలంభించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చునని కొత్తూరు ఏడీ ఏ భ్రమరాంబ అన్నారు. సోమవారం మండలంలోని చొర్లంగి, బొత్తాడసింగి గ్రామాల్లో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆత్మ బ్లాక్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదర్శ గ్రామాల్లో రైతులకు వరిసాగుపై పలు సూచనలు అందించారు. వరిసాగులో కాలిబాటలు ఏర్పాటు చేయడం వల్ల దోమపోటు నివారణకు దోహదపడుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా వరిలో కాలిబాటలు ఏర్పాటు చేయాలన్నారు. సేంద్రీయ ఎరువులు విరివిగా వినియోగించాలన్నారు. రసాయన ఎరువులను తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ మేనేజర్ వెంకన్నదొర, ఏ ఇ ఒలు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలతో సమస్యలను గుర్తిస్తున్నాం
సీపీ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు
రాజాం, ఆగస్టు 20: రాజాం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కనీస వౌళిక సమస్యలను పాదయాత్ర ద్వారా గుర్తిస్తున్నామని సీపీ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు అన్నారు. కంచరాంలో సీపీ ఎం పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, సాగునీరు, కనీస వౌళిక వసతులకు సంబంధించిన వసతులను గుర్తించి వాటి పరిష్కారానికి మార్గాలు అనే్వషిస్తున్నామన్నారు. ప్రజలంతా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను పాదయాత్రలో భాగంగా వస్తున్న బృందాలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీ ఐటీయూ డివిజన్ కార్యదర్శి సి.హెచ్.రామ్మూర్తినాయుడు, ఆనెం సత్యారావు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు పాదయాత్ర కంచరాం నుంచి దోసరి వరకు కొనసాగింది.