శ్రీకాకుళం

ఎస్సీ ఉపప్రణాళికలో పనులు వేగవంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 20 : షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి ఆదేశించారు. ఎస్సి సబ్ ప్లాన్ పనులపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సి ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె వి ఆదిత్యలక్ష్మీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గృహ నిర్మాణ సంస్ధ తదితర శాఖల ద్వారా చేపడుతున్న పనులు కొంత మేర జాప్యం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె వి ఎన్ చక్రధరబాబు, జెసి-2 పి రజనీకాంతారావు, డి ఆర్ వో కె నరేంద్ర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ తిరుపతిరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి శ్రీనివాసరావు, డి ఆర్ డి ఎ పిడి డాక్టర్ జిసి కిషోర్‌కుమార్, డి ఇవో ఎం సాయిరాం, జెడ్పి సి ఇవో బి నగేష్, రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు కె కాంతిమహి, వయోజన విద్యాశాఖ డిడి జి కృష్ణారావు, వ్యవసాయశాఖ డిడి పిడి రత్నకుమార్, మత్స్యశాఖ జెడి డాక్టర్ వివి కృష్ణమూర్తి, సర్వశిక్ష అభియాన్ ఎస్ త్రినాధరావు, హౌసింగ్ పడి ఆర్ వి నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.

డిసిసిబి కాలనీలో పర్యటించిన బీజేపీ నాయకులు
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 20 : నగరంలోని డిసిసిబి కాలనీని ఆనుకొని ఉన్న శివారు కాలనీలో ప్రజల విజ్ఞప్తి మేరకు బీజేపి నగర శాఖ నాయకులు కాలనీలో పర్యటించి అక్కడ ఉన్న పరిస్ధితులను పరిశీలించారు. కాలనీలో రోడ్లు గత పది రోజులుగా పూర్తిగా మోకాల లోతు నీళ్లలో మునిగి ఉన్నాయని ఏ ఇంటికి వెళ్లలేని పరిస్ధితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారన్నారు. వర్షం నీరు పోయే మార్గం లేక ప్రతీ ఏడాది ఇబ్బందులు పడుతున్నామని స్ధానికులు తెలియజేసారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్లు వేసేందుకు చూపుతున్న శ్రద్ధ డ్రైనేజి విషయంలో, కాలువల నిర్మాణంలో చూపడం లేదని ఆరోపించారు. సాగు నీటి కోసం మిర్తి బట్టికి గండి కొడుతున్నారని దాని వలన అక్కడ నుండి నీరు, వర్షం నీరు కాలనీలోకి చేరి నిలిచి పోతుందని రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరమణ మూర్తి తెలిపారు. మిర్తిబట్టికి గండి కొట్టకుండా చూడాలని అలాగే కాలనీలో నీరు పోయేందుకు రామిగెడ్డ వరకు కాలువ ఏర్పాటు చేయాలని కాలనీలో కల్వర్టులను నిర్మించాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా బీజేపి నాయకులు స్పందిస్తు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక ప్రణాళిక లేకుండా వౌళిక వసతులు కల్పించడం వలన ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులకు తెలిపారు. స్ధానిక ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్‌కు సమస్యలను తెలియజేసి తగు చర్యలు తీసుకోమని కోరుతామన్నారు. కాలనీలో పర్యటించిన వారిలో బీ.జే.పి నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, పూడి తిరపతిరావు, దుప్పల రవీంద్రబాబు, శవ్వాన ఉమామహేశ్వరి, ఎస్ వి రమణమూర్తి, సంపతరావు నాగేశ్వరరావు, చల్లా శ్రీదేవి, కీర్తి శాంతారావు, బెండి రవికాంత్ తదితరులు ఉన్నారు.

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 20 : భారతరత్న, మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమం స్ధానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పిసిసి అధికార ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట ప్రాధాన్యత ఇచ్చి పెద్ద పీఠ వేసిన ఘనత రాజీవ్‌గాంధీదే అని అన్నారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్య హక్కును కల్పించారన్నారు. ఢిల్లీ నుంచి పల్లె వరకు నేరుగా నిధులు కల్పించి గ్రామ స్వరాజ్య స్ధాపనకు విశేష కృషి చేసిన మహనీయుడని తనకు రాజీకీయాలపై ఆసక్తి లేకపోయినా ఉక్కు మహిళ భారతరత్న దివంగత ఇందిరాగాంధీ మతోన్మాదులు చేతుల్లో అశువులు బాసిన తరువాత తన తల్లి ఆశయ సాధనకు, దేశ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రజల అభీష్టం మేరకు ప్రధాని పదవి చేపట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారన్నారు. కొందరూ ముస్కరుల చేతుల్లో హతమవ్వడం ఈ దేశం మంచి దార్శనికుడైన నాయకున్ని కోల్పోయామని పేర్కొన్నారు. తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సనపల అన్నాజీరావు, డి ఎస్ కె ప్రసాద్, కుంచి రాజ్యలక్ష్మీ, ఎం ఎ బేగ్, కనుగుల చంద్రశేఖర్, గోవింద మల్లిబాబు, కె వి ఎల్ ఎన్ ఈశ్వరి, అంబటి కృష్ణ, రెల్ల సురేష్, సునీల్ భాషా, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.