శ్రీకాకుళం

జగన్ కావాలి... జగన్ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రజలంతా వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కావాలి.. పదవిలోకి రావాలని వారి అభీష్టాన్ని వ్యక్తం చేస్తున్నారని, దీనికి అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. బుధవారం అంతకాపల్లి గ్రామంలో జగన్ రావాలి... జగన్ కావాలి అనే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలకు అమృత గుళికలు వంటివని, వీటిపై ప్రతి ఇంటా ప్రచారం నిర్వహించాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, మార్పు కోరుకున్న ప్రజలకు జగన్ ఆశాదీపంలా మారారన్నారు. రానున్న ఎన్నికల్లో ఇప్పటినుంచే గ్రామస్థాయి నుంచి ప్రణాళిక రూప కల్పన చేయాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి వాకముళ్ల చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజాం నాయకులు లావేటి రాజగోపాల్, సామంతుల వెంకటప్పలనాయుడు, విజయకుమార్, సుధాకర్, కరణం సుదర్శనరావు, సురేష్‌ముఖర్జీ, కె.శ్రీనివాసరావు తదితరులున్నారు.

శతశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయండి
సారవకోట, సెప్టెంబర్ 19: మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు శతశాతం పూర్తిచేయించేందుకు మండల, గ్రామస్థాయి అధికారులు కృషి చేయాలని ఎంపీడీవో జగదీశ్వరరావు ఆదేశించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో 7,583 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి వుండగా ఇప్పటివరకు 6,504 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. 914 మరుగుదొడ్ల నిర్మాణాలు గత మూడు నెలలుగా వివిధ దశలలో కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 72 మరుగుదొడ్ల నిర్మాణాలు తుది దశకు చేరాయని తెలిపారు. ఇప్పటివరకు 117 మంది లబ్ధిదారులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించలేదని, ఈ విషయమై అధికారులందరూ ఆయా కుటుంబాలతో చర్చించి మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించే దిశగా చైతన్యపరచాలన్నారు. తహశీల్దార్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ శతశాతం లక్ష్యాలు పూర్తిచేయలేక 86.92 శాతం వద్ద మండలం నిలిచిపోయి జిల్లాలో లక్ష్యాల సాధనలో అట్టడుగు స్థానానికి చేరడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు, వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర సంఘ కౌన్సిలర్‌గా రాజాం ప్రిన్సిపాల్ ఎన్నిక
రాజాం, సెప్టెంబర్ 19: రాష్టస్థ్రాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర కౌన్సిలర్‌గా రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మెట్ట ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాకు సంబంధించి 44 జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈయన ఎంపిక పట్ల జిల్లా వృత్తి విద్యాధికారి పి.హరిప్రసాద్, జిల్లా ప్రిన్సిపాల్ సంఘ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి జి.శ్యామసుందర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

రాజాంలో వర్షబీభత్సం
రాజాం, సెప్టెంబర్ 19: రాజాం పట్టణం, పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ పెనుగాలులతో కూడిన వర్షం గంటపాటు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రోడ్డుపక్కనే ఉన్న షాపులు గాలికి ఎగిరిపోయాయి. అలాగే ఉరుములు, మెరుపులతో వాతావరణం దద్దరిల్లింది. సమీప గ్రామాల్లోని తోటల్లో పిడుగులు పడినప్పటికీ ఎటువంటి ప్రాణభయం లేనట్టు తెలిసింది. అలాగే రాజాం ఆసుపత్రి ఆవరణలో చెట్లు కూడా కూలిపోయాయి. ఏది ఏమైనా తీవ్ర ఎండలతో విలవిలలాడిన ప్రజలకు ఈ వర్షం చల్లదనం ఇచ్చింది.

కోండ్రుకు ఇన్‌చార్జి పదవి పట్ల హర్షం
రాజాం, సెప్టెంబర్ 19: రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ను పార్టీ అధిష్టాన వర్గం నియమించడం పట్ల రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమైన కోండ్రు మురళీమోహన్‌ను ఇన్‌చార్జిగా నియమించడంతో రాజాం దశ మారిపోతుందని అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంపీపీ ప్రతినిధి జడ్డు విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఓటు హక్కు శక్తివంతమైనది
సరుబుజ్జిలి, సెప్టెంబర్ 19: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని సరుబుజ్జిలి తహశీల్దార్ ప్రభాకర్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులంతా ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం కళాశాల విద్యార్థులు ఓటు హక్కుపై నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పీవో దుగ్గిరాల రాంప్రసాద్, కామేశ్వర పాట్రిన్, రహేష్‌సాహు, ధర్మారావు, శ్రీనివాసరావు, రామారావు, విజయ, సంగీత, సాగరిక, వాసుదేవరావు, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.