శ్రీకాకుళం

భూముల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: స్వర్ణశ్రీకాకుళం..అందులో రింగ్‌రోడ్డు హామీ..వచ్చే ఎన్నికల నాటికి పూర్తి కావల్సిందే! లేదంటే - నగరప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి చెప్పిన మాటే రింగ్‌రోడ్డు! ఇప్పుడు ఆ రింగ్‌రోడ్డు నిర్మాణం శ్రీకాకుళం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి విజయానికి ముడిపడిపోయింది. అంతే - రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నాగావళి నదికి జలసిరి హారతి ఇచ్చేందుకు వచ్చి రింగ్‌రోడ్డుకు రూ. 150 కోట్లు ఇచ్చానని, ఆ పనులు సత్వరమే పూర్తి చేయాలంటూ కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి భుజస్కందాలపై చంద్రబాబునాయుడు పడేసారు. దీంతో రింగ్‌రోడ్డుకు సంబంధించిన శాఖలన్నీంటినీ సమన్వయం చేసేందుకు తొలిసారిగా గురువారం కలెక్టరేట్ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రింగ్ రోడ్డు అత్యంత అవసరమని అధికారులు గుర్తించినప్పటికీ, ప్రభుత్వ ఖజానా నిండుకోవడం వల్ల ఆ పనులు గడచిన నాలుగేళ్ళుగా ముందుకు సాగలేదు. సి.ఎం. బహిరంగసభలో కలెక్టర్‌కి రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశిస్తూ శ్రీకాకుళాన్ని శాటిలైట్ టౌన్‌గా తీర్చుదిద్దుతామని ప్రకటించారు. రూ. 150 కోట్లు నిధులు వీటి నిర్మాణానికి కూడా కేటాయించినట్టు సాక్షాత్తు సి.ఎం. వెల్లడించడంతో మరోసారి రింగ్‌రోడ్డు కదలికలు ఆరంభమయ్యాయి. సి.ఎం. ఆదేశాలు అమలుచేసేందుకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఫిజికల్‌గా అధికారులు రింగ్‌రోడ్డు స్కెచ్ తయారుచేసేందుకు కూడా ఆయా రూట్‌మ్యాప్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే, కేవలం కాగితాలపై కథలు అల్లేసి చూపించే విధానంతో రింగ్‌రోడ్డు ఎన్నాళ్లైనా పూర్తికాదంటూ సాక్షాత్తు సీనియర్ ఇంజనీర్లే చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం రింగ్‌రోడ్డును రింగరింగ్‌లాడించి భూపరిహారాన్ని పెద్దమొత్తంలో కొట్టేసేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. రింగ్‌రోడ్డు చర్చ అర్బన్ రూరల్‌లో ఊపందుకోవడంతో రైతులు కూడా భూములకు ధరలు పెంచి అమ్మకాలు సాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రింగ్ రోడ్డు వెనుక ఎవరి ప్రయోజనం వారిది ఉన్నమాదిరిగానే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చి ఇప్పటి వరకూ ఎన్నికలు జరపకుండా ప్రత్యేక పాలనతో పౌరుల ప్రాధమిక అవసరాలను తీర్చలేక అబాసుపాలైన విషయం తెలిసిందే. సిక్కోల్ ఓటర్ల దృష్టి మళ్ళించి వచ్చే ఎన్నికల్లో మైలేజ్ పెంచుకునేలా రింగ్ రోడ్డు అంటూ సరికొత్త నాటకానికి తెరలేపిందని విద్యాధికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి పురిటినొప్పులు నడుమ రింగ్‌రోడ్డు ముందుకుసాగదన్న సందేహాలకు అధికారుల అభిప్రాయాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయన్న ప్రశ్నలకు సమాధానాలు కోకొల్లలుగా చెప్పొచ్చు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు, పాత్రునివలస, పెద్దపాడు, కిల్లిపాలేం, కళ్ళేపల్లి, రామచంద్రాపురం మీదుగా పొన్నాడ లంక వద్ద నాగావళి నదిపై నూతన వంతెన నిర్మాణం ఇందులో భాగం. ఇక్కడ నుంచి పొన్నాడ, తోటపాలేం, దోమాం, ఎస్.ఎం.పురం, కనిమెట్ట, కింతలి, తోటాడ తదితర రెవెన్యూ గ్రామాల గుండా ఈ రోడ్డును నిర్మించేలా ఇప్పటికే సర్వేలు పూర్తి చేసారు. వీటి నిర్మాణంలో గ్రామాలు, స్టక్చర్స్‌కు ఎటువంటి పరిహారం చెల్లించకుండా కేవలం వ్యవసాయ, వాణిజ్య భూముల మీదుగా రింగ్‌రోడ్డును నిర్మించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో డీపీఆర్‌ను ఇక్కడ అధికారులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ల్యాండ్ అండ్ సర్వే అధికారులు, ఉడా సిబ్బంది సర్వే నిర్వహించి 200 ఎకరాల భూమిని రింగ్‌రోడ్డు నిర్మాణానికి సేకరించేలా హద్దులతోకూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ డీపీఆర్‌ను ఉడా అధికారులు అంగీకరించి తుది ప్రచురణ ప్రక్రియ కూడా పూర్తి చేసారు. 100 అడుగుల విస్తీర్ణంలో రింగ్‌రోడ్డు రూపుదిద్దుకునేలా అధునాతన హంగులతో కూడిన నిర్మాణాన్ని సాగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు సర్వం సిద్ధం చేసారు. దీనిపై ప్రతిపాదనలు సి.ఎం. కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, ఇంత పెద్దమొత్తంలో నిధులు వెచ్చించలేమని రాష్ట్ర బడ్జెట్ సహకరించదని అప్పట్లో ముఖ్యమంత్రి తాత్కలికంగా వాయిదా వేసినట్లు ప్రచారం సాగింది. అయితే, తాజాగా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో మరికొన్ని సందేహాలు తొంగిచూస్తున్నాయి. ఉడా అధికారులు అంగీకరించిన డీపీఆర్ ప్రాప్తికి రింగ్‌రోడ్డు మార్కింగ్ చేస్తారా? లేకుంటే రీసర్వే కోసం అధికారులు పరుగులు తీస్తారా?? అన్న ఉత్కంఠ సంబంధిత గ్రామాల్లో నెలకొంది. ఎన్నికల ముందు రింగ్‌రోడ్డు వెనుక రాజకీయ ప్రయోజనం దాగివుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో వారివారి భూములను అనుసంధానం చేస్తూ రింగ్‌రోడ్డు డిజైన్‌ను మార్చాలని ఇప్పటికే ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీలు ప్రారంభించినట్టు చర్చ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వానికేకాకుండా, ఆ పార్టీని నమ్ముకున్న నేతలకు కూడా ఆర్థిక ప్రయోజనం కొవ్వాడ అణుపార్కు మాదిరిగా అందిస్తున్న విశ్వాసాన్ని టీడీపీ కుటుంబ సభ్యులు బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ రింగ్‌రోడ్డు ఎన్నికల స్టంట్‌గా మిగిలిపోతుందా?! పునాదిరాయి వరకూ వెళ్తుందా చూడాలి మరీ!!

షోడస గణపతి యాగానికి ప్రతీ ఒక్కరు సహకరించాలి
* ఈ నెల 21న లక్ష కుంకుమార్చన
* వర్తక సంఘం ప్రతినిధులు పిలుపు
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో జీటీ రోడ్‌లో శ్రీ సంకట మోచన గణేశ సహిత శ్రీ షోడస గణపతి యాగ మహోత్సవాలకు ప్రతీ ఒక్కరు సహకరించి ఈనెల 21న నిర్వహించనున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని వర్తక సంఘం ప్రతినిధి కోణార్క్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జీటీ రోడ్‌లో యాగ మహోత్సవం ఆవరణలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవాల రూపకర్త శంకరరావు అని జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు పాల్గొంటున్నారని వర్తక సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. 21రోజులు కార్యక్రమమని, 16 హోమగుండాలు ఉన్నాయని, దంపతులు పాల్గొని హోమం చేస్తున్నట్లు తెలియజేశారు. 21న నిర్వహించనున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి కమిటీయే ఏర్పాటుచేస్తుందన్నారు. 23న ఆదివారం ఉదయం 9గంటలకు గణేష్ స్వాములు, భక్తులచే షోడస గణపతి ప్రచార ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 24న సోమవారం ఉదయం 9గంటలకు 121 మంది దంపతులచే మహా రుద్రాభిషేక సహిత లక్ష బిల్వార్చన జరుగునని తెలియజేశారు. అలాగే 28న శుక్రవారం సాయంత్రం 5గంటలకు మహిళలు, భక్తులచే లక్ష కిస్మిస్‌తో పూజా కార్యక్రమం నిర్వహించబడునని తెలియజేశారు. అక్టోబర్ 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. 6వ తేదీన ముగింపు కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. అందరూ సహకరించాలని రోజుకు 10వేల మంది దర్శనం కోసం వస్తున్నట్లు తెలియజేశారు. పురోహితులు విశ్వశర్మ మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్ణముల వారు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుతూ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీశోడస గణపతి యాగ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలియజేశారు. అంపోలు రుధ్ర కోటీశ్వర శర్మ, అంపోలు రామప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో 25 మంది రుత్వికులుచే ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుందని స్పష్టం చేశారు. గణేశ్‌ని ఆవిర్భావం విగ్రహరూపంలో ఇక్కడ ఉంచినట్లు తెలియజేశారు. దీక్ష బలం ముఖ్యమైనదన్నారు. ఈ సమావేశంలో దుప్పల వెంకటరావు, మండవిల్లి రవికుమార్, జి.నర్సునాయుడు, కోరాడ రమేష్, నటుకుల మోహన్, చంద్రశేఖర్, అమరావతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కర్నూలులో రాహుల్ సభ విజయవంతం
* ఆంధ్రా ప్రజానీకానికి ధన్యవాదాలు
* డీసీసీ అధ్యక్షుడు డోల జగన్
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: కర్నూల్‌లో రాహుల్ గాంధి సభను జయప్రదం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ ధన్యవాదాలు తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబం మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి వుంటారని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తాను ప్రధాన మంత్రి అయితే వెంటనే ప్రత్యేక హోదా ఫైల్‌మీదే సంతకం చేస్తానని కర్నూలు సభలో రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. అలాగే ఒక్కొక్క రైతుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. మతాన్ని పట్టుకొని వేలాడుతున్న ప్రధాన మోడీ, అమిత్‌షాలను ప్రజలు నమ్మరని, 2019లో రాహుల్ గాంధి ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ బలం పుంజుకుంటుందన్నారు. దేశానికి స్వర్ణయుగం రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నారు. 130 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా అందరిని సమన్వయం చేసుకొని ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్‌ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన వారికి సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. సమాసమాజ ఏర్పాటుకు అందరూ కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు. శ్రీకాకుళం నియోజక వర్గం ఇన్‌ఛార్జ్ చౌదరి సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ప్రత్యేక హోదా కావాలంటే రాహుల్ ప్రధాన మంత్రి కావాలన్నారు. ఈ సమావేశంలో సనపల అన్నాజీరావు, అల్లిబిల్లి రాధ, కె. ఎల్. ఎన్ ఈశ్వరి, బాన్న రాము, ఎమ్. ఎ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను కలిసిన కలగ శ్రీను
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా బీములి నియోజకవర్గం గిరిజాల గ్రామంలో మండలంలోని పెద్దపాడు గ్రామానికి చెందిన కలగ శ్రీనివాసయాదవ్ జగన్మోహనరెడ్డిని కలిసారు. శ్రీకాకుళం జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో యాదవలు పరిస్థితులపై ఆరా తీసారు. యాదవులకు రాజకీయ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పినట్లు శ్రీనివాస్ తెలియజేశారు. ప్రభుత్వం వస్తే యాదవుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుతెలియజేశారు. జల్లాలో పదినియోజక వార్గల్లో వైసీపీ పార్టీ గెలుపొందేందుకు కృషి చేస్తామన్నారు.