పశ్చిమగోదావరి

పందులు, కుక్కలు, దోమలు ఇదేనా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, సెప్టెంబర్ 22: రాజాం నగర పంచాయతీలో అన్ని వార్డుల్లో పందులు, కుక్కలు, దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయని, దీనిపై చర్యలు శూన్యమని స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు విమర్శించారు. శనివారం 9వ వార్డు పరిధిలోని మల్లిఖార్జునకాలనీ, లచ్చయ్యపేట ప్రాంతాల్లో వార్డుదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన నగర పంచాయతీ అధికారులను స్థానిక ప్రజలు నిలదీశారు. పందులు విచ్చలవిడిగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయని, కుక్కలు, దోమలు చెలరేగడంతో రోగాలబారిన పడుతున్నామని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేయాలని, పందులను ఇళ్లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఆయనతో పాటు ఏ ఈ సురేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీ, స్థానిక నాయకులు పారంకోటి సుధాకర్, నీలకంఠేశ్వరయాదవ్, పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువుగా గణనాధునికి అనుపోత్సవం
జి.సిగడాం, సెప్టెంబర్ 22: స్థానిక హరిజన వాడలో ఈనెల వినాయకచవితి సందర్భంగా తొమ్మిది అడుగులు గల వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి కాలనీ వాసులంతా ఉదయం, సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొమ్మిది రాత్రులు పూర్తయిన సందర్భంగా శనివారం పార్వతీ తనయుడు వరసిద్ధి వినాయకుడు, విఘ్న నాయకుడైన గణనాధునికి కనులపండువుగా అనుపోత్సవాన్ని నిర్వహించారు. సుమారు కాలనీకి చెందిన 250 కుటుంబాల వారు నిత్యం పూజలు చేసి ఆడమగ తేడా లేకుండా భక్తి ప్రపత్తులతో చిత్రి విచిత్ర వేషధారులతో గణనాధునికి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా వినాయక కమిటీ వారు మాట్లాడుతూ ప్రథమ పూజితుడు వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే జరగనున్న కార్యక్రమంనకు ఎటువంటి విఘ్నములు కలుగనీయడని వారి పూర్తి విశ్వాసమని తెలిపారు. అనుపోత్సవ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు సహకరించారు.

కస్పావీధిలో భారీ అన్నదానం
రాజాం, సెప్టెంబర్ 22: స్థానిక కస్పావీధిలో వినాయక ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ వీధి ప్రాంతంలోని వ్యాపారులు, ఇతర వర్గాల వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అయ్యవారి కోనేరు ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

పచ్చదనంతోనే ఆరోగ్య సముపార్జన
* డి.ఎఫ్.ఓ. ధనుంజయరావు
గార, సెప్టెంబర్ 22: పచ్చదనంతోనే ప్రజల ఆరోగ్య స్ధితిగతులు సక్రమంగా ఉంటాయని డి.ఎఫ్.ఓ. బి. ధనుంజయరావు అన్నారు. మండలం సాలిహుండాం కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయంలో వనం-మనం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక అటవీ విభాగం శనివారం చేపట్టింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా జిల్లా అటవీ విభాగం అధికారి ధనుంజయరావు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షింపబడిననాడే ప్రజల ఆరోగ్య స్థితిగతులు సముతుల్యంగా ఉంటాయని,

రంగనాధానికి అభినందన
రాజాం, సెప్టెంబర్ 22: రాజాం రచయితల వేదిక సభ్యులు, కవులు, మేథావి, రచయిత వేదిక కన్వీనర్ గార రంగంనాధంను శనివారం అభినందించారు. విజయనగరం గురజాడ సాహితీ సమితి ఆధ్వర్యంలో ఇటీవల అవార్డు పొందిన రంగనాంధను వీరంతా అభినందించారు. మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ కొత్తా సాయిప్రశాంత్, ఎస్ ఎల్‌టి ఎన్ కరస్పాండెంట్ తవిటినాయుడు, పెంకి చైతన్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.