శ్రీకాకుళం

సర్కార్‌కు ఇక సమర గీతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, సెప్టెంబర్ 22: ప్రజలను మోసగించి దోపిడీలకు పాల్పడే సర్కార్‌కు సమరగీతం పాడే రోజులు ఆసన్నమయిందని శ్రీకాకుళం వైసీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. మండలం మలకాం గ్రామంలో జగన్ రావాలి..జగన్ కావాలి కార్యక్రమంలో పాల్గొని పైవిధంగా అన్నారు. ప్రజలు అధికార పక్షాలపై దుయ్యబడుతుంటే సర్కార్‌కు పూజించేటట్లు కన్పిస్తుందన్నారు. శ్రమజీవుల కష్టాలను అర్ధం చేసుకోలేని ప్రభుత్వాలపై ప్రజలు గుణపాఠం చెప్పేందుకు ఆసన్నమయిందన్నారు. జగన్ కార్యక్రమాలకు జన సందేశంపై ప్రజలు జైజై ధ్వనులు పలుకుతున్నారని ఆయన అన్నారు. పేద ప్రజల రాజ్య స్థాపనకు జగనన్నకే సాధ్యమన్నారు. రైతుకూళీ రాజ్యానికి వైసీపీ కే ఓట్లువేసి అత్యధిక మెజార్టీతో ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. శ్రామిక బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనకోసం త్యాగాలు చేసిన వై ఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే వైసీపీ రాజ్యస్థాపన చేస్తామన్నారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే పథాకాల గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత విభాగ్ అధ్యక్షులు కోరుకుండ వెంకట సాయికుమార్, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి బాడాన లక్ష్ముంనాయుడు, జిల్లా వైసీపీ నేతలు గంట్యాడ రమేష్, లోలుగు కాంతారావు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధి, జె.శ్రీనివాసరావు, ఆర్.రాంబాబు, స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.

హౌసింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలి
* ఈ ఈ నారాయణరావు
జలుమూరు, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మంజూరు చేసిన ఎన్టీ ఆర్ భరోసా బిల్లులను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని హౌసింగ్ శాఖ ఈ ఈ నారాయణరావు అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్టీ ఆర్ బరోసా ఇళ్ల బిల్లును ఎన్ ఆర్ జి ఎస్ శాఖకు అనుసంథానం చేసినందున ఆ శాఖ అధికారులు సకాలంలో మస్కర్లను ఏర్పాటుచేసి లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని ఆశాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మండల అభివృద్ధి అధికారి పడాల వాసుదేవరావు, ఎన్ ఆర్‌జి ఎస్ ఏపీవో నక్క ప్రేమలత, హౌసింగ్ ఏఈ గౌరీశంకర్, ఎన్ ఆర్‌జి ఎస్ దిగువస్థాయి అధికారులు పాల్గొన్నారు.

శరవేగంగా రోడ్లు నిర్మాణాలు
పొందూరు, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలో రూ.1.60కోట్లు మంజూరుతో రహదారి సీసీ రోడ్లు ముమ్మరంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పైడితల్లి అమ్మవారి రహదారి భరంపురం వీధి -నాయుడు వీధి, కస్పావీధి-మహారాజా మార్కెట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలివున్న పనులకు వేగవంతం చేయాలని ఎంపీడీవో విజయభాస్కరరావు, పంచాయతీ ఈవో కింతలి మోహన్‌బాబులు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యతను పాటించాలని వారు అన్నారు. రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ఎప్పటికప్పుడు డీఈ, వర్క్ ఇనిస్పెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వారన్నారు.

రాజ్యాధికారంతోనే అగ్నికుల క్షత్రియులకు న్యాయం
వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 22: ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన అగ్నికుల క్షత్రియులకు రాజ్యాధికారంతోనే న్యాయం జరుగుతుందని అగ్నికుల క్షత్రియ సంఘ ప్రతినిధులు అన్నారు. శనివారం పూండిలో విలేఖరులతో మాట్లాడారు. అనాదిగా వెనుకబాటుకు గురవుతున్న సామాజిక వర్గానికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛను పథకం అమలు చేస్తున్నా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి పింఛను పథకం అమలు చేస్తున్నా, ఇక్కడ మాత్రం అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ టిక్కెట్ కోరే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అయితే పార్టీ టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపిపి జి.వసంతస్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పుచ్చ ఈశ్వరరావు, ఎంపిటిసి హేమంతరాజు, నాగార్జున, కృష్ణ, షణ్ముఖరావు, రాజు, భాస్కరరావు, జోగారావు పాల్గొన్నారు.

విద్యుత్ తీగలు తెగిపడి ఆవు మృతి
వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 22: గరుడభద్ర సమీపంలోని జీడిపిక్కల కర్మాగారం సమీపంలో శనివారం విద్యుత్ తీగలు తెగిపడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గూడ మోహనరావుకు చెందిన ఆవు మృతి చెందింది. కర్మాగారం సమీపంలో మేత చేస్తుండగా విద్యుత్ తీగలు తెగి ఆవుపై పడ్డాయి. విద్యుత్ షాకుతో ఆవు ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. విద్యుత్‌శాఖ అధికారులను కలిసి పలు పర్యాయాలు తీగలు మార్చమని ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, బాధిత రైతుకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు.