శ్రీకాకుళం

పర్యాటక కేంద్రంగా శ్రీముఖలింగం క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో పలు ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు అన్ని వౌళిక సౌకర్యాలు కల్పించే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగాన్ని తీర్చి దిద్దేందుకు ఒక ప్రణాళిక తయారుచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఎస్ ఈ కె ఎమ్‌వి ప్రసాదరావు అన్నారు. శనివారం శ్రీముఖలింగాన్ని సందర్శించి పర్యాటకులకు అవసరమగు పలు అభివృద్ధి పనులపై పరిశీలించారు. ఆలయప్రాంగణంలో 40 అడుగుల వెడల్పుతో మాడవీధుల నిర్మాణం, ఆపరిసరాల్లో దుకాణాల సౌకర్యం ఏర్పాటుచేయుటకు ప్రణాళిక తయారుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. శ్రీముఖలింగం సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రయాణీకులు విశ్రాంతి గదులు, కళ్యాణ వేదిక, భోజన శాల, వాహనాలు నిలిపే స్థలాలు, మలమూత్ర విసర్జన శాలలు ఏర్పాటుకు స్థలాలను పరిశాలించారు. దేవాదాయశాఖ పరిథిలో ఉన్న భూముల వివరాలను మండల సర్వేయర్ ఈవో సూర్యనారాయణతో చర్చించారు. అదేవిధంగా వంశధార నదీతీరంలో పర్యాటకులు ఆకట్టుకొనే మంచి పార్క్, చక్రతీర్థ స్నానాలకు స్వామి వెళ్లే మార్గ నిర్మాణం ఆలయ ప్రాంగణంలో టిక్కెట్లు, ప్రసాద విక్రయ శాల గదుల నిర్మాణస్థలాలు స్వయంగా పరిశీలించారు. వీటన్నింటి నిర్మాణానికి రూ.20కోట్ల రూపాయల నిధులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు డి ఈ ఈ డాక్టర్ ఎమ్‌వి ఆర్ కృష్ణాజీ,జె ఈ దయాసాగర్, ఏ ఈ ఈ శంకరరావు, కార్యనిర్వాహణాధికారి వివి సూర్యనారాయణ, రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, సర్వేయర్, మాజీ సర్పంచ్ ప్రతినిథి తర్రా బలరాంలు పాల్గొన్నారు.

కుండపోత వర్షంతో పొలాలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి
జలుమూరు, సెప్టెంబర్ 22: శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షానికి మండల పరిథి పలు గ్రామాల్లో వరిచేలు పొలాలు వర్షంతో నిండి గట్లు తెగి నీటి ప్రవాహం పరుగులు తీసింది. జోనంకి, చల్లవానిపేట, రాణా, లింగాలవలస, పలు గ్రామాల్లో అధికంగా వర్షం కురియడంతో చాలా పొలాల గట్లు వర్షపునీటికి కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్నచిన్న పిల్లకాల్వలు పొంగి ప్రవహిస్తుండగా చాలా గ్రామాల్లో పలు చెరువులు నిండుకుండలా కన్పిస్తున్నాయి.

బాధ్యతగా బి ఎల్‌వోలు విధులు నిర్వహించాలి
* తహశీల్దార్ ప్రవళ్లిక ప్రియ
జలుమూరు, సెప్టెంబర్ 22: గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం నియమించిన పోలింగ్ బూత్ లెవెల్ అధికారులు బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మండల స్థాయి బి ఎల్‌వోల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలో 73 పోలింగ్ కేంద్ర పరిథిలో ఉన్న బి ఎల్‌వోలు నూతన ఓటర్లు నమోదు, మరణించిన ఓటర్లు తొలగింపు పలు అంశములపై బాధ్యత వహించి పనులను నిర్వహించాలని అన్నారు. ఓటర్లు చేర్పులు మార్పులు విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు దారి ఇవ్వకూడదని ఆమె సూచించారు. తప్పులు జరిగాయని రుజువైతే బి ఎల్‌వోలపై చర్యలుంటాయని ఆమె స్పష్టం చేశారు. మండలంలో గతంలో 66 పోలింగ్ కేంద్రాలుండగా నూతనంగా నగరికటకం, కొమనాపల్లి, గొట్టివాడ, వెంకటాపురం, పెద్దదూగాం, రాణా, టెక్కలిపాడు గ్రామాల్లో అదనంగా పోలింగ్ కేంద్రాలు మంజూరయ్యావని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు డిప్యూటీ తహశీల్దార్ తంగుడు నారాయణరావు, రెవెన్యూపరిశీలకులు, బూత్‌లెవెల్ అధికారులు పాల్గొన్నారు.

మురపాకలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం
లావేరు, సెప్టెంబర్ 22: మండలంలో మురపాక గ్రామంలోకేప్స్‌రాప్స్ అభివృద్ధివేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరసిద్ధి వినాయక వేడుకల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3,500మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. మురపాక సమీప గ్రామాలైన గుంటుకు పేట, సి.హెచ్ అగ్రహారం పిబినగర్ కాలనీ, చినమురపాక, పండిపేట, నాజానపేట గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జల్లేపల్లి జనార్థనరావు, తేనెల మంగయ్య, మడ్డికనకయ్య, వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షులు బాలి శ్రీనివాసులనాయుడు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.