శ్రీకాకుళం

రైతుబజార్‌లో విజిలెన్స్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గౌతమ్‌సవాంగ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రైతు బజార్‌లోవిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి టి.హరిక్రిష్ణ నేతృత్వంలో శ్రీకాకుళం రైతు బజార్‌లో శనివారం ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా రైతు బజార్‌లో ఉన్న రైతులు స్థానిక మార్కెట్ నుండి కూరగాయలను హోల్‌సేల్‌గా కొని రైతు బజార్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైతుబజార్‌లో విజయనగరం జిల్లా కందివలస గ్రామానికి చెందిన రౌతు చంద్రశేఖర్ అనే వ్యక్తి అరటిపండ్లను అనధికారంగా అమ్ముతున్నట్లు వారు గుర్తించారు. జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారులు ఆ అరటిపండ్లను పరీక్ష కొరకు నమూనాలు సేకరించారు. అంతేకాకుండా తూనికలు, కొలతల అధికారులు గడువు ముగిసిన తూనిక యంత్రాలను వాడుతున్న మజ్జిరామారావు, దానేటి ఆదినారాయణ, పెడద రాము, సీపాన వెంకటరమణలపై నాలుగు కేసులు నమోదు చేశారు. అదే విధంగా కొత్తగా తూనిక యంత్రాలను కొని ఎటువంటి అనుమతులు లేకుండా వినియోగిస్తున్న సూర రాజగోపాలరావుపై కూడా ఒక కేసును నమోదు చేశారు. ఈ విజిలెన్స్ తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డి ఎస్పీ కె.్భర్గవరావునాయుడు, సి ఐ చంద్ర, ఏ ఈ ఈ సామ్యూల్ రాజు, ఎస్సై కిరణ్‌కుమార్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రైతు బజార్‌తోపాటు ఆమదాలవలసలో గల రైతుబజార్‌లో కూడా విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

అంగన్వాడీ కేంద్రాలలో బాలామృతం పంపిణీ
లావేరు, సెప్టెంబర్ 22: మండలంలో రేగపాలెం, లక్ష్మీపురం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించే చర్యల్లో భాగంగా బాలమృతం పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. రేగపాలెంలో టీడీపీ నాయకులు కొల్లి ఈశ్వరరెడ్డి, లక్ష్మీపురంలో మాజీ సర్పంచ్ దల్లి రాజారావు చేతుల మీదుగా వీటినందజేశారు. ఎండిఖర్జూరం, న్యూట్రిపాలపౌడర్, బెల్లం వంటి సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వం పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగపరుచుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వారు గర్భిణులకు, బాలింతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ జాజిలక్ష్మి, సుజాత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

యువతకు పోలీస్ కౌన్సిలింగ్
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్థు చర్యగా సి ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. శనివారం పెద్దపాడు గ్రామానికి చెందిన యువత వినాయక ఉత్సవాలను నిర్వహించే సంఘ సభ్యులతోకౌన్సిలింగ్ నిర్వహించి ఎటువంటి తగాదాలకు తావివ్వకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో కర్రసాము ప్రదర్శన వద్దని పేర్కొన్నారు. ప్రతీ ఏట మాదిరిగా కాకుంటా ఈ ఏడాది మరింత పగడ్బంధీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా యువత, పెద్దలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ముందస్థుగా పోలీస్ అనుమతి లేనిదే ఎటువంటి ప్రదర్శనలు, ఊరేగింపులు చేయరాదని, చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

బాలికా సాదికారత పై అవగాహన కార్యక్రమం
లావేరు, సెప్టెంబర్ 22: స్థానిక మండల కేంద్రంలో బాలికా సాదికారతపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల సంఘాల ఏర్పాటు, జండర్‌డస్క్ కమిటీలు, అక్షయపాత్ర అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా బాలికలపై లైంగిక వేదింపులు నిరోధానికి వీలుగా పాఠశాలల్లో బాలల సంఘాలు ఏర్పాటు ఆవశ్యకతను ఎం ఈవో లండ ఈశ్వరరావు సమావేశంలో వివరించారు.జిల్లా మహిళా సమతా సొసైటీప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్.సత్యవేణి బాలికల హక్కులు, చట్టాలుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్స్ జి.జాన్సీరాణి, జె ఆర్‌సి పి.రమణమ్మ కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో 48మంది ఉపాధ్యాయులు, కస్తూరీభా పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.