శ్రీకాకుళం

వజ్జ చేరికతో పార్టీ మరింత బలోపేతం: మంత్రి అచ్చెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, సెప్టెంబర్ 23: వజ్జ బాబురావు తెలుగుదేశం పార్టీలోకి చేరడం మరింత పార్టీకి బలం చేకూరుతుందని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం వజ్జ స్వగృహానికి మంత్రి అచ్చెన్న, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందరశివాజీ, అశోక్‌కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషాలు చేరుకొని వజ్జకు తెలుగుదేశం పార్టీ కండువా వేసి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వై ఎస్ జగన్ ఒంటెద్దు పోకడలతో ఆ పార్టీ నాయకులు టీడీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని, రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని, పనితనాన్ని గమనించి వైసీపీ నేతలు చేరడానికి పోటీ పడుతున్నారన్నారు. వజ్జకు ఈ ప్రాంతంపై ప్రత్యేకమైన అవగాహన ఉందని, ఆయన ప్రధానంగా పలాస నియోజకవర్గ అభివృద్ధి చేయాలనే తలంపుతో ఏ పదవి ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేసారు.
వజ్జ చేరికతో టీడీపీకి ఎంత లబ్ది?
పలాస-కాశీబుగ్గ మొదటి పాలకవర్గ చైర్మన్‌గా 1984లో ఎన్‌టి ఆర్‌పై టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చూసి అనంతరం 2014 ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే శివాజీపై వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చూసారు. ఎన్నికల అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వజ్జను టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్ద కసరత్తు చేసి పార్టీలో చేర్చేందుకు రంగం సిద్దం చేసింది. అంతకుముందు టీడీపీ మైండ్‌గేమ్ ఆడి వైసీపీకి పరోక్ష హెచ్చరికలు పంపించి ఎట్టకేలకు మంత్రి చొరవతో టీడీపీ పార్టీ కండువాను బాబురావుకు వేయించగలిగారు. గడిచిన నాలుగేళ్లుగా రాజకీయాలపై దృష్టి సారించని వజ్జను ఒక్కసారిగా టీడీపీ నాయకులు పార్టీలో చేర్చుకోవడంతో పలాస రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలో చేరే కార్యక్రమంలో వజ్జ తన కార్యకర్తలతో భారీ సంఖ్యలో చేరుతారని భావించిన టీడీపీ శ్రేణులకు ఒకింత నిరాశ కలిగింది. వజ్జ ఆత్మీయులు తప్పితే కార్యకర్తలు కనిపించకపోవడం టీడీపీ తమ్ముళ్లు గుసగుసలాడుకోవడం కనిపించింది. ఏది ఏమైనా వజ్జ రాకతో పార్టీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

వైసీపీలో పలువురు చేరిక
పలాస, సెప్టెంబర్ 23: పలాస మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు నీలాపురంకు చెందిన సుమారు 120 మంది టీడీపీ కార్యకర్తలు పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు నాయకత్వంలో ఆదివారం వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉండేందని, ఇటీవల టీడీపీ నాయకుల పోకడలతో కార్యకర్తలు విసిగిపోయారని, రానున్న రోజుల్లో పలాస నియోజకవర్గంలో మరింత మంది టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో టీడీపీ పల్లకీ మోసిన కార్యకర్తలకు ప్రస్తుత టీడీపీ నాయకులు గుర్తించకుండా స్వలాభం కోసం పనిచేస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా జగన్ నాయకత్వాన్ని కోరుతున్నారన్నారు. వై ఎస్ జగన్ రావాలి, కావాలి జగన్ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు నుంచి మంచి స్పందన వస్తుందని, అందులోభాగంగానే టీడీపీ కార్యకర్తలు చేరుతున్నారన్నారు. రామన్న రాజ్యం కావాలంటే వై ఎస్ జగన్ సీ ఎం కావాలని, చారిత్రాత్మక విజయం అవసరమని, అమరావతి పేరుతో సీ ఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని కొల్లగోడుతున్నారని, కేవలం ప్రకటనలకే పరిమితం తప్పితే క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదన్నారు. ఈ నాలుగేళ్లులో చేయని అభివృద్ధి మరో 8 నెలల్లో అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్, వడిశ హరిప్రసాద్, బోర కృష్ణారావు, గౌరీత్యాడి, బి.గిరిబాబు, సన్యాసి ఆప్టో, శ్రీనివాసరావు, డబ్బీరు భవానీ, బడగల బల్లయ్య, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు
* అఖిల భారత్ అంతర్ జిల్లాల పోటీలకు ఎంపిక
పలాస, సెప్టెంబర్ 23: క్రీడలతో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం కాశీబుగ్గ జడ్‌పి క్రీడా మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించి, అఖిల భారత అంతర్‌జిల్లాల పోటీలకు అథ్లెటిక్స్ క్రీడాకారులను ఎంపిక చేసారు. అంతకుముందు జరిగిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యమైన క్రీడాకారులు ఉన్నప్పటికీ వారికి సరైన సదుపాయాలు లేక వారిలోని నైపుణ్యం మరుగన పడుతుందని, ప్రభుత్వం క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, ఓటమి గెలుపునకు నాంది అని, ఓటమితో నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో శిక్షణ పొంది విజయం సొంతం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఆనంతరావు, పి ఇటిలు మధు, తవిటయ్య, హరిబాబు, పద్మలోచనంలతోపాటు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.