శ్రీకాకుళం

ముంపు ప్రాంతాలకు తీరని కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఎన్‌పేట, అక్టోబర్ 14: తిత్లీ తుపాను బీభత్సం, వంశధార వరదముంపులో గ్రామాల్లోని ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా నోచుకోలేకపోతున్నారు. వంశధార ఉగ్రరూపంతో లక్ష్మీనర్సుపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు, బసవరాజుపేట, పెద్దకోట తదితర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద ఉద్ధృతికి తీర ప్రాంత ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు పూర్తిస్థాయిలో పర్యటించకపోవడం, నష్టాలను అంచనా వేయడంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఎల్ ఎన్‌పేట, హిరమండలం మండలాలను తుపాను బాధిత ప్రాంతాలుగా గుర్తించకపోవడంపై ఆగ్రహిస్తున్నారు.

తుపాను బాధితులందరినీ ఆదుకుంటాం
*ప్రభుత్వ విప్ కూన రవికుమార్
సరుబుజ్జిలి, అక్టోబర్ 14: జిల్లాలో ఇటీవల ఏర్పడిన తిత్లీ తుపాను బాధితులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఫకీర్‌సాహెబ్‌పేట, అలమాజీపేట, సీతారాంనగర్ కాలనీ, పురుషోత్తపురం, రావివలస, పెద్ద వెంకటాపురం, చిన్న వెంకటాపురం వరద ప్రాంతాల్లో పర్యటించారు. అలమాజీపేట వద్ద వరద బాధితులను పరామర్శిస్తూ తుపాను నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. పురుషోత్తపురం గ్రామ పంచాయతీలో రక్షిత మంచినీటి పథకం ఉన్నప్పటికీ గత రెండేళ్ల నుంచి మూలపడి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు రవికుమార్ దృష్టికి తెచ్చారు. పురుషోత్తపురం గ్రామ రైతులు వరదముంపుతో కూడిన వరి పైరును ఆయనకు చూపిస్తూ కౌలు రైతులకు పంట నష్టం అందే విధంగా సహకరించాలని కౌలు రైతులు కోరారు. దీనిపై స్పందించిన విప్ రవికుమార్ మాట్లాడుతూ కౌలు రైతులు భూ యజమానుల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకుంటే వారికే పంట నష్టం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తిత్లీ తుపాను, వంశధార వరదముంపుతో నష్టపోయిన రైతులకు, తుపాను బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టాన్ని అర్హులైన బాధితులందరికీ అందించడం జరుగుతుందని రవికుమార్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస మున్సిపల్ చైర్మన్ ప్రతినిధి తమ్మినేని విద్యాసాగర్, సరుబుజ్జిలి ఆసుపత్రి కమిటీ చైర్మన్ సిద్దార్థ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నందివాడ గోవిందరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ డి ఈ ఆశాలత, మండల టీడీపీ నాయకులు లావేటి పూర్ణారావు, కె.లక్ష్మీగోవింద, పి.సురేంద్ర, ఎంపీటీసీ పి.వి.రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్యం బెల్ట్‌షాపులు ఎత్తివేయాలి
పాలకొండ, అక్టోబర్ 14 మద్యం బెల్ట్‌షాపులను ఎత్తివేయించడంలో ఎక్సైజ్‌శాఖాధికారులు విఫలం చెందారని, వాటిని ఎత్తివేయడానికి చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని ఐద్వా మండల కమిటీ నాయకులు పేర్కొన్నరు. ఆదివారం ఐద్వా మండలాధ్యక్షులు బి.సంధ్య, ప్రధాన కార్యదర్శి బి.స్వప్న మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. పాలకొండ నగర పంచాయతీలోని ఎన్.కె.రాజపురం గ్రామంలో మద్యం బెల్ట్‌షాప్ ఎత్తివేయించడంలో అధికారులు వైఫల్యం చెందినందున దసరా వారాలు సందర్భంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిపారన్నారు. అలాగే స్థానిక శ్రీకోటదుర్గమ్మ ఆలయ జంక్షన్ వద్ద ఇరువైపులా దసరా ఉత్సవాలు సందర్భంగా మద్యం బెల్ట్‌షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కూడా నియంత్రించాలన్నారు. ఈ అమ్మకాలు అరికట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.